Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ విన్నర్‌ ప్రైజ్‌ మనీని రివీల్ చేసిన నాగ్.. షో హిస్టరీలోనే టాప్.. ఎన్ని లక్షలంటే?

|

Dec 15, 2024 | 4:58 PM

సుమారు మూడు నెలలుగా బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తుది అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ రియాలిటీ షోకు ఆదివారం (డిసెంబర్ 14) ఎండ్ కార్డ్ పడనుంది. మరికాసేపట్లో జరిగే గ్రాండ్ ఫినాలే ప్రారంభం కానుంది.

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ విన్నర్‌ ప్రైజ్‌ మనీని రివీల్ చేసిన నాగ్.. షో హిస్టరీలోనే టాప్.. ఎన్ని లక్షలంటే?
Bigg Boss 8 Telugu
Follow us on

బిగ్‌ బాస్‌ 8 తెలుగు సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో విజేత ఎవరో తేలిపోనుంది. మెయిన్ కంటెస్టెంట్స్, వైల్డ్ కంటెస్టెంట్స్ తో మొత్తం 22 మంది ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. వీరిలో ఐదుగురు ఫైనల్ కు చేరుకున్నారు. గౌతమ్‌, నిఖిల్‌,నబీల్‌,ప్రేరణ, అవినాష్‌ టైటిల్‌ రేసులో నిలిచారు. ఇక విజేతను నిర్ణయించే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే బిగ్‌ బాస్‌ గ్రాండ్ ఫినాలేకు సంబంధించి వరుసగా ప్రోమోలు రిలీజ్ అవుతున్నాయి. ఈ ప్రోమోల్లోనే బిగ్ బాస్ ప్రైజ్‌ మనీ, ట్రోఫీ గురించి హోస్ట్ నాగార్జున రివీల్‌ చేశారు. ఈ సీజన్ విజేతకు రూ. 55 లక్షల ప్రైజ్ మనీ అందేజేస్తున్నట్లు నాగార్జున స్వయంగా ప్రకటించారు. కాగా బిగ్‌ బాస్‌ తెలుగు హిస్టరీలో ఇదే భారీ మొత్తం అని నాగ్‌ తెలిపారు. దీంతో పాటు ఈ సీజన్‌ విన్నర్‌ కు మారుతి కార్‌ కూడా దక్కనుంది. ఇప్పటికే ఆ సంస్ధ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కాగా గతంలో బిగ్ బాస్ విజేతలకు రూ. 50 లక్షల వరకు మాత్రమే ప్రైజ్ మనీ ఇచ్చేవారు. అయితే ఈసారి అది కాస్తా పెరిగిందని చెప్పువచ్చు.

కాగా బిగ్‌ బాస్‌ విడుదల చేసిన ప్రోమోలో ఈ సీజన్‌కు సంబంధించి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ అందరూ సందడి చేశారు. అందరి సమక్షంలోనే అక్కినేని నాగార్జున ప్రైజ్‌ మనీ రివీల్‌ చేశారు. ఇక బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సందడి చేశారు. ఆయన నటించిన కొత్త సినిమా ‘యూఐ’ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ షోలో పాల్గొన్నారు. మొదటి ఫైనలిస్ట్‌గా సెలెక్ట్ అయన అవినాష్‌ను ఎలిమినేట్ చేసి హౌజ్ నుంచి స్టేజీపైకి ఉపేంద్రనే తీసుకొచ్చారని తెలుస్తోంది. అలాగే లక్ష్మిరాయ్‌, నభానటేశ్ . ప్రగ్యాజైశ్వాల్‌ డ్యాన్సులతో అలరించారు.

ఇవి కూడా చదవండి

మరికొన్ని గంటల్లో గ్రాండ్ ఫినాలే..

కాగా ఈ సారి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు ఎవరూ చీఫ్ గెస్ట్ ఉండరని తెలుస్తోంది. హోస్ట్ నాగార్జుననే స్వయంగా విజేతను ప్రకటించి బిగ్ బాస్ ట్రోఫీని బహూకరించనున్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.