Mukku Avinash: ముక్కు అవినాష్‌కు తెలంగాణ ప్రభుత్వం తరపున సాయం.. మంత్రి చేతుల మీదుగా చెక్కు అందజేత

Mukku Avinash: జబర్దస్త్‌ కమెడియన్‌, తెలుగు బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ కంటెస్టెంట్‌ ముక్కు అవినాష్‌కు తెలంగాణ ప్రభుత్వం 60 వేల రూపాయల చెక్కును అందించింది...

Mukku Avinash: ముక్కు అవినాష్‌కు తెలంగాణ ప్రభుత్వం తరపున సాయం.. మంత్రి చేతుల మీదుగా చెక్కు అందజేత
Mukku Avinash

Edited By:

Updated on: Mar 28, 2021 | 8:35 PM

Mukku Avinash: జబర్దస్త్‌ కమెడియన్‌, తెలుగు బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ కంటెస్టెంట్‌ ముక్కు అవినాష్‌కు తెలంగాణ ప్రభుత్వం 60 వేల రూపాయల చెక్కును అందించింది. అవినాష్‌ తల్లి అనారోగ్యానికి గురికావడంతో ఆమె వైద్యానికి అవసరమయ్యే డబ్బును చెక్‌ రూపంలో అందించింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన కాళ్ల లక్ష్మీరాజం (అవినాష్ తల్లి) అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 60 వేల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నగదు చెక్కును మంత్రి కొప్పుల ఈశ్వర్‌ లక్ష్మీరాజం కుమారుడు అవినాష్‌కు అందజేశారు. అనంతరం ఈ ఫోటోలను అవినాష్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

కాగా, అవినాష్‌ బిగ్‌బాస్‌ రియాలిటీషో నాలుగో సీజన్‌లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా ప్రేక్షకులకు నాన్‌స్టాప్‌ కామెడీని అందించాడు. అరియానతో స్నేహం చేస్తూ మోనాల్‌ను ఆటపట్టిస్తూ బిగ్‌బాస్‌ హౌస్‌లో తెగ సందడి చేశాడు. ప్రస్తుతం అవినాష్‌ పలు ప్రాజెక్టులకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

వైల్డ్ డాగ్ లైవ్ ఈవెంట్ దిగువన చూడండి…


ఇవీ చదవండి: Ram Charan : పొలిటికల్ థ్రిల్లర్ గా శంకర్ సినిమా.. ముఖ్యమంత్రిగా రామ్ చరణ్.. చక్కర్లు కొడుతున్న వార్త

Insurance: బ్యాంకులు మూసివేస్తే డిపాజిట్‌ చేసిన డబ్బుల పరిస్థితి ఏమిటీ..? తాజాగా కేంద్రం కీలక నిర్ణయం