Karthika Deepam: కార్తీక దీపం నుంచి కావాలనే తప్పించేశారట.. షాకింగ్ కామెంట్స్ చేసిన మోనిత
ముఖ్యంగా మహిళలలో సీరియల్ అభిమానులు ఎక్కువ.. ఇప్పటికే చాలా సీరియల్స్ ప్రేక్షకాదరణ పొందుతూ.. దూసుకుపోతున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసిన సీరియల్ కార్తీక దీపం.
సినిమాలతో పోటాపోటీగా సీరియల్స్ కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. నిజానికి అభిమాన హీరోల సినిమాలు ఏడాది ఒకటి వస్తుంది. కానీ సీరియల్స్ మాత్రం ఏడాది పొడవునా టెలికాస్ట్ అవుతూనే ఉంటాయి. దాంతో సీరియల్స్ కు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా మహిళలలో సీరియల్ అభిమానులు ఎక్కువ.. ఇప్పటికే చాలా సీరియల్స్ ప్రేక్షకాదరణ పొందుతూ.. దూసుకుపోతున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసిన సీరియల్ కార్తీక దీపం. ఆడవారు. మగవారు, చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా ఈ ఈసీరియల్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అలాగే కార్తీక దీపం సీరియల్ టీఆర్పీ లోనూ టాప్ ప్లేస్ లో దూసుకుపోతోంది. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తున్నారు జనాలు. ఇదిలా ఉంటే కార్తీక దీపం సీరియల్ నుంచి ఒక నటిని కావాలనే తప్పించారని ఆవేదన వ్యక్తం చేసింది.
కార్తీకదీపం సీరియల్ చూసే వారికి అందులోని ప్రతి క్యారెక్టర్ బాగా గుర్తుండిపోతుంది. అలా గుర్తున్న పాత్రల్లో వంటలక్క తావతా చెప్పుకునేది మోనిత గురించే. ఈ పాత్రలో నటించింది శోభా శెట్టి. అయితే ఇటీవల ప్రసారం అవుతోన్న ఎపిసోడ్స్ లో ఆమె పాత్ర కనిపించడం లేదు. దాంతో సీరియల్ ఫ్యాన్స్ ఆమె ఏమైపోయింది అని ఆరా తీస్తున్నారు.
తాజాగా శోభా శెట్టి మాట్లాడుతూ.. తనను కావాలనే కార్తీకదీపం సీరియల్ నుంచి తప్పించారని షాకింగ్ కామెంట్స్ చేసింది. “నా లైఫ్‌లో నేను ఎన్నో సీరియల్స్ లో నటించాను. కానీ ఇంతలా ఎప్పుడూ బాధపడలేదు అని అన్నారు శోభా. రీ ఎంట్రీ తర్వాత 5 నెలలు మాత్రమే పని చేశాను. నేను సీరియల్ తర్వాత షెడ్యూల్ కోసం రెడీ అయ్యి కూర్చున్నాను. నా పాత్ర సీరియల్ లో జైలుకు వెళ్లినట్లు పెట్టారు.. జైలుకు వెళ్లొచ్చాక నా రీఎంట్రీ మళ్ళీ ఉంటుందని ఆశించాను. కానీ నా పాత్రను తొలగించినట్టు చెప్పారు. నేను షాక్ అయ్యాను..కథ ప్రకారం నా పాత్రను సేడ్ చేయాల్సి వచ్చిందని అన్నారు. నాకు నమ్మబుద్ది కాలేదు. కథలో మోనిత గురించి డాక్టర్ బాబుకి అన్ని విషయాలు తెలిసిపోయాయి కాబట్టి ఇప్పట్లో నా పాత్ర అవసరం లేదు.. కాబట్టి మోనిత ఫ్రెండ్ అయిన చారుశీలని రంగంలోకి దించారు. ఇప్పుడు కథ మరింత ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత కొంతకాలానికి మళ్లీ నా ఎంట్రీ ఉంటుంది. అప్పుడు మరింత రంజుగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు శోభా శెట్టి.