Krishna Mukunda Murari Episode 7th September: మురారీ ఆశీర్వాదం తీసుకున్న ముకుంద.. భవానీకి కూతురు ప్రేమ చెప్పెయ్యడానికి రెడీ అయిన శీనివాస్

|

Sep 07, 2023 | 7:11 AM

వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కృష్ణ, ముకుంద, అలేఖ్య, సుమలత , రేవతి. మీ మనసులో ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది అని పూజారీ అంటే.. కృష్ణ ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ప్రతి జన్మలో ఏసీపీ సార్ నా భర్తగా రావాలి అని అనుకుంటే.. ముకుంద మురారీని నా భర్తగా కోరుకుంటున్నా.. నా మనసులో మురారీకి తప్పవేరేవారికి స్తానం లేదు అని అనుకుంటుంది. పూజ అయిన తర్వాత భర్త ఆశీర్వాదం తీసుకోమని పూజారీ చెబితే.. కృష్ణ మురారీ ఆశీర్వాదం తీసుకుంటుంది.

Krishna Mukunda Murari Episode 7th September: మురారీ ఆశీర్వాదం తీసుకున్న ముకుంద.. భవానీకి కూతురు ప్రేమ చెప్పెయ్యడానికి రెడీ అయిన శీనివాస్
Krishna Mukunda Murari
Follow us on

తన ప్రేమని బతికించకపోతే చచ్చేది నా ప్రేమ కాదు నీ కూతురు తాను ఆత్మహత్య చేసుకుంటానని తండ్రిని బెదిరిస్తుంది.  మురారీని ఎంతగా ప్రేమించానో.. ఆదర్శ్ తో పెళ్లి మీ బలవంతం మీద ఒప్పుకున్నట్లు జరిగింది చెప్పండి అని తండ్రిని చెబుతుంది. చివరి క్షణం వరకూ మురారీ కోసం ఎదురుచూసినట్లు అత్తయ్యకు జరిగింది చెప్పండి.. అత్తయ్యకు భయపడో.. కృష్ణ మీద జాలి పడో నిజం దాస్తే మీకు నిజమే మిగులుతుంది.. కూతురు కాదు అంటూ శ్రీనివాస్ బెదిరిస్తే.. అలాగేనమ్మా  చెబుతాను అని అంటాడు శ్రీనివాస్. మీ రూపంలో ఇంకా నా ప్రేమ బతికే ఉంది.. అని అంటుంది ముకుంద

అమ్మైనా నాన్నైనా నేనే కదా నీకు

కృష్ణ చన్నీటి స్నానము చేసి.. వణుకుతుంటే.. బాపు బొమ్మ, బుట్టబొమ్మ… ఇవన్నీ కలగలిస్తే నువ్వే కృష్ణ అని అనుకుంటాడు ముకుంద. మీరు చన్నీటికి తట్టుకోలేరు కానీ.. వేడినీటితోనే స్నానం చేయండి అని అంటుంది. కృష్ణను చూసి టెంప్ట్ అయిపోతున్నా అంటూ అక్కడ నుంచి మురారీ వెళ్ళిపోతాడు. ఇవాళా ప్రతి భార్య తన భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఎలాగైనా అందరూ చూస్తుండగానే మురారీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని.. అందరికి మురారీని తన భర్త అని తెలియాలి.. ముకుంద నిర్ణయం తీసుకుంటుంది.

కృష్ణ తుమ్ముతుంటే.. అందుకే చన్నీటి స్నానం వద్దన్నా.. పూజారీ ఓ వైపు మంత్రాలు చదువుతుంటే.. హైపిచ్ లా హచ్ హచ్ అని తుమ్ముతు ఉండు అని మురారీ అంటుంటే.. మీరు అచ్చు మా నాన్నలానే మాట్లాడుతున్నారు అని అంటుంది కృష్ణ. ఇక నీకు అమ్మైనా , నాన్నైనా అన్నీ నేనే కదా అని అనుకుంటూ నువ్వు నా బాధ్యత కదా కృష్ణ అంటే.. ఏమన్నారు బంధమా భాద్యతా అని అడిగితె నీకు తెలియదా అని మురారీ కృష్ణను అడుగుతాడు. అర్ధం అయింది నాతోనే చెప్పించాలని అనుకుంటున్నారు కదా ఏసీపీ సార్ అని కృష్ణ మూతిని మూడు వంకర్లు తిప్పుతుంది. మీతోనే చెప్పిస్తా నిజం అంటూ ఏమండీ అని అంటే.. అంటే మన బంధం అని ఒప్పేసుకున్నట్లే.. సంతోషంతో కొంచెం కొత్తగా ఉంది అని అంటాడు.

ఇవి కూడా చదవండి

వరలక్ష్మీ వ్రతానికి రెడీ .. ముకుంద ప్రేమ చెప్పడానికి వచ్చిన శ్రీనివాస్

మధు బయట పని ఉంది లేట్ గా వస్తాను అని అంటే.. వరలక్ష్మీ వ్రతం అని నీ కాళ్లు మొక్కిన తర్వాతే తింటానని త్వరగా వచ్చెయ్యమని అడుగుతుంది అలేఖ్య. ముకుంద తన తండ్రి ఇంకా రాలేదు ఏమిటి అని ఆలోచిస్తుంటే.. శ్రీనివాస్ వస్తారు. నాకు తెలుసమ్మా ఈ ఇంట్లో అందరూ వేరు నువ్వు వేరు అని అంటాడు శ్రీనివాస్. ఇదిగో ఈ చీర కట్టుకో అంటే.. భవానీ మేము తనని వేరుగా ఎందుకు చూస్తాం.. అని అడుగుతుంటే.. నేను అంటుంది అది కాదు.. నాకూతురిలో భర్త లేడనే దిగులు కనిపించడం లేదా.. అని శ్రీనివాస్ అంటుంటే.. నేను ఏమి చెప్పమన్నా నువ్వు ఏమి  చెబుతున్నావు నాన్న అని అనుకుంటుదని ముకుంద. నువ్వేమీ దిగులు పడకు భవానీ దేవిగారు నీ జీవితానికి ఒక దారి చూపిస్తారు.. నీ భర్తతో సుఖంగా ఉంటావు అని అంటాడు. ఇపుడు ముకుంద నాన్న వచ్చి ఇంత రాద్ధాంతం చేయడం అవసరమా అని కృష్ణ .. మురారీ అంటుంటే.. పూజ అయ్యాక ఇక్కడే ఉండమని శ్రీనివాస్ కు భవానీ చెబుతుంది.. నేను కూడా ముకుంద మురారీ విషయం చెప్పేస్తా అని అనుకుంటాడు శ్రీనివాస్.

మురారీ ఆశీర్వాదం తీసుకున్న ముకుంద

వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కృష్ణ, ముకుంద, అలేఖ్య, సుమలత , రేవతి. మీ మనసులో ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది అని పూజారీ అంటే.. కృష్ణ ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ప్రతి జన్మలో ఏసీపీ సార్ నా భర్తగా రావాలి అని అనుకుంటే.. ముకుంద మురారీని నా భర్తగా కోరుకుంటున్నా.. నా మనసులో మురారీకి తప్పవేరేవారికి స్తానం లేదు అని అనుకుంటుంది. పూజ అయిన తర్వాత భర్త ఆశీర్వాదం తీసుకోమని పూజారీ చెబితే.. కృష్ణ మురారీ ఆశీర్వాదం తీసుకుంటుంది.. ముకుంద చెవి రింగు పడిపోయింది అనే వంకతో మురారీ కాళ్ళను తాకి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇది రేవతి , కృష్ణ , మధు కూడా గమనిస్తారు.  ముకుంద తన భర్త మురారీ అని చెప్పకనే చెప్పేసింది నువ్వు సూపర్ ముకుంద అని అలేఖ్య అని అనుకుంటుంది. సుమలత పంతులుగారికి దక్షిణ ఇచ్చి పంపించు అని చెప్పి.. రేవతి శ్రీనివాస్ గారు మీరు ఇద్దరూ నాతో రండి అంటూ భవానీ తనతో తీసుకుని వెళ్తుంది.

మాకు తెలియని విషయం మీకు ఎలా తెలిసింది.. శ్రీనివాస్ తో మాట్లాడుతున్న భవానీ

ప్రతి రోజూ గుడ్ మార్నింగ్ పెట్టడంలో మీ ఉద్దేశ్యం ఏమిటి .. అంటుంటే మీరు చెప్పింది నిజమే శ్రీనివాస్ గారు ఆదర్శ్ కావాలనే ఇంటికి రావడం లేదు. కన్నల్ గారు కాల్ చేసి మరీ చెప్పారు. ఎగ్జాట్లీ మీరు ఏమి చెప్పారో అదే కన్నల్ గారు చెప్పారు.. మావాడి గురించి మాకు తెలియని విషయం మీకు ఎలా తెలిసింది. అని శ్రీనివాస్ ను ప్రశ్నిస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో

మురారీ మన ప్రేమ విషయం క్లైమాక్స్ వచ్చింది అని ముకుంద సంతోషంతో ఉంటే.. అక్కడికి కృష్ణ ముకుందా అంటూ వస్తుంది.. కృష్ణ ఎప్పుడు రాంగ్ టైం లో ఎంట్రీ ఇస్తుంది.. ఇంట్లో మేము అందరం జంటలుగా ఉంది.. నువ్వు ఒంటరిగా ఉండడం చూస్తుంటే నాకు బాధ వేస్తుంది ముకుంద అని అంటుంటే.. ముకుంద సహనం కోల్పోయి కృష్ణ ప్లీజ్ అని అంటుంది..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి