Krishna Mukunda Murari Episode September 25th, 2023: ఎన్ని కష్టాలు వచ్చినా మురారిని వదులుకోను అని ప్రామిస్ చేసిన కృష్ణ.. ఎలాగైనా నేను నా ప్రేమని దక్కించుకుంటా అంటున్న ముకుంద..

|

Sep 26, 2023 | 6:15 AM

ముకుంద వచ్చి ఆదర్శ్ ఇష్టాల గురించి చెబుతుంది అని కృష్ణ అంటే.. ముకుంద వచ్చి ఆదర్శ్ కోసం మురారీ ఏమైనా చేస్తాడు.. అలాగే మురారీ కోసం ఆదర్శ్ ఎటువంటి త్యాగానైనా చేస్తాడు. అంత ఇష్టం మురారీ అంటే .. ప్రసాద్ ఇంతలో సుమ తను ఆదర్శ్ గురించి చెబుతుందా మురారీ గురించి చెబుతుందా అని అంటుంటే.. ముకుంద .. ఆదర్శ్ పేరుతో మురారీ గురించి చెబుతుంది.

Krishna Mukunda Murari Episode September 25th, 2023: ఎన్ని కష్టాలు వచ్చినా మురారిని వదులుకోను అని ప్రామిస్ చేసిన కృష్ణ.. ఎలాగైనా నేను నా ప్రేమని దక్కించుకుంటా అంటున్న ముకుంద..
Krishna Mukunda Murari
Image Credit source: Hotstar
Follow us on

రేవతి పూజ చేసిన తర్వాత అందరికి ప్రసాదం ఇస్తూ.. కృష్ణ చేతిలో ప్రసాదం పెట్టి.. దీనిని భార్య భర్తలు ఇద్దరూ ఖచ్చితంగా తినమని అని చెబుతుంది. తన చేతిలో ప్రసాదం ఎలాగైనా మురారీతో తినిపించాలి ప్లాన్ వేసిన ముకుందకు సాయం చేసిన అలేఖ్య. మధు అలేఖ్యల రగడలో కృష్ణ చేతిలో ప్రసాదం కింద పడిపోతుంది. అప్పుడు ముకుంద తన చేతిలో ప్రసాదాన్ని తినమని ఇస్తుంది. అడుగడుగునా కృష్ణ మీద తనపై చేయి సాధించడానికి ప్రయత్నిస్తుంది. దీనికి అలేఖ్య ఆడడుగునా సాయం చేస్తూ ముకుందకు అండగా నిలుస్తుంది. మురారీకి కృష్ణ ప్రసాదం తినిపించిన తర్వాత తన చేతిలో ఉన్న ప్రసాదాన్ని ముకుంద తినడం చూసిన కృష్ణ.. నిన్ను నమ్మి నేను చాలా పెద్ద తప్పుచేశాను ముకుంద.. గుర్తు పెట్టుకుంటాను.. వడ్డీతో సహా ఇచ్చేస్తాను అని అంటుంది.

నా భర్త ఫ్రెండ్లీగా ఉండాలి

ఏసీపీ సార్ కు సన్మానం చేసి ఆయన గురించి నాలుగు మంచి విషయాలు చెబుతాను అంటుంది. మురారీ మెడలో దండ వేసి ఏ భార్య అయినా తన భర్త తనతో ఫ్రెండ్లీ గా ఉండలని కోరుకుంటుంది. నేను కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మేము అలాగే ఉంటాము కూడా కానీ నేను ఒక్క విషయంలో చాలా అదృష్ట వంతురాలిని.. ఏసీపీ సార్ పేరుకే పెద్ద పోలీసు ఆఫీసార్.. ఆయనది చిన్న పిల్ల మనసత్త్వం. అందుకే నేను ఆయన్ని ఏబీసీడీల అబ్బాయి అని పిలుస్తాను. ప్రేమించే భార్య ఉంటే చాలా అదృష్టవంతురాలు అని అంటారు. ఆయనకు ప్రేమతో పాటు బుద్ధులు కూడా నేర్పే అదృష్టం దొరికింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను అని కృష్ణ చెబుతుంది. అంతేకాదు మురారీకి ఇష్టమైన ఆట, ప్లేసెస్  వంటి అనేక విషయాలు చెప్పి.. ఏసీపీ సార్ కోసం ఒక ప్రామిస్ చేస్తున్నా అంటూ మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోను అని చెబుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా మిమ్మల్ని ఎప్పటికి వదులుకోను అని అంటే రేవతి చాలా సంతోషపడింది.

ఆదర్శ్ ని అడ్డు పెట్టుకుని మురారీ గురించి చెప్పిన ముకుంద..

ముకుంద వచ్చి ఆదర్శ్ ఇష్టాల గురించి చెబుతుంది అని కృష్ణ అంటే.. ముకుంద వచ్చి ఆదర్శ్ కోసం మురారీ ఏమైనా చేస్తాడు.. అలాగే మురారీ కోసం ఆదర్శ్ ఎటువంటి త్యాగానైనా చేస్తాడు. అంత ఇష్టం మురారీ అంటే .. ప్రసాద్ ఇంతలో సుమ తను ఆదర్శ్ గురించి చెబుతుందా మురారీ గురించి చెబుతుందా అని అంటుంటే.. ముకుంద .. ఆదర్శ్ పేరుతో మురారీ గురించి చెబుతుంది. ఆదర్శ్ తిరిగి వచ్చాకా ప్రామిస్ ఇంటిలో మీ అందరికి చెబుతా.. అసలు ఆదర్శ్ తిరిగి వస్తేనే కదా అంటూనే నేను ఇప్పుడు ఆదర్శ్ కోసం ఒక పాటకు డ్యాన్స్ చేస్తా అని ముకుంద నువ్వు నాకు నచ్చావ్ సినిమాలోని సాంగ్ కు డ్యాన్స్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మధు గురించి అలేఖ్య

మధుకి సినిమాలంటే చాలా ఇష్టం.. నా కోసం ఏమైనా చేస్తాడని చెబుతుంది అలేఖ్య. నీ నెక్స్ట్ బర్త్ డే లోపు నీతో నేను వడ్డాణం కూడా కొనిపించుకుంటా అని అంటుంది. షాపింగ్ గురించి చాలు అని అంటాడు మధు.

ప్రసాద్ గురించి సుమ

మా గురించి చెప్పాలంటే మా ఆయన గురించి చెప్పడానికి ఏమీ లేదని ఈ మైక్ కూడా అర్ధం అయింది ఏమో అంటూ సరదాగా సుమ అంటుంది.

జల్లెడలో నిండు చంద్రుడిని చూసి..

జల్లెడలో నిండు చంద్రుడిని చూసి కట్టుకున్న భర్తను చూస్తే ఏడేడు జన్మలకు తనే భర్తగా వస్తాడని నమ్మకం అని అంటే.. ఈ రోజు జల్లెడలో నేను ఆదర్శ్ ని కాదు మురారీని చూస్తాను అని ముకుంద అనుకుంటుంది. కృష్ణ మురారీని చేస్తుంది. సుమ ప్రసాద్ ను .. అలేఖ్య మధుని చూస్తుంది. చివరికి మధు ఆదర్శ్ ఫోటో పట్టుకుంటే.. అలేఖ్య అడ్డుపడి.. ఆదర్శ్ ఫోటోని పట్టుకున్న మురారీని చూసిన ముకుంద.. సాయం చేసిన అలేఖ్య..

రేపటి ఎపిసోడ్ లో

కృష్ణ తండ్రి లాంటి వ్యక్తి ఒకరు ఎంట్రీ ఇచ్చారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..