అయోధ్య వేదికగా బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం (జనవరి 22) జరిగిన ఈ మహా క్రతువులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు భాగమయ్యారు. రామమందిర ప్రారంభోత్సవాన్ని కళ్లారా వీక్షించి తరించారు. అయోధ్యకు వెళ్లని వారు టీవీల్లో రామోత్సవాన్ని చూసి తరించిపోయారు. మహేశ్ బాబు తదితర స్టార్ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా రామ భక్తిని చాటుకున్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ రైతు బిడ్డ అలియాస్ పల్లవి ప్రశాంత్ అయితే తనదైన శైలిలో వినూత్నంగా రామ భక్తిని చాటుకున్నాడు. ఏం చేసినా అందులోతన ప్రత్యేకతను చాటుకునే అతను అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజున కూడా అదే పంథాను అనుసరించాడు. ఈ సందర్భంగా కాషాయ వస్త్రాలను ధరించిన పల్లవి ప్రశాంత్.. వెనుక కాషాయ జెండాతో ధ్యానం చేస్తూ ఫొటోలకు పోజులు ఇచ్చాడు. అనంతరం ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ‘500 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ’, ‘జై శ్రీరామ్’ అంటూ తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చాడు.
ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఇక కామన్ మ్యాన్ కేటగిరిలో బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. తన ఆటతీరు, మాటతీరుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. మహామహులైన 19 మంది సెలబ్రిటీలను కాదని బిగ్ బాస్ ఏడో సీజన్ విజేతగా అవతరించాడు. అయితే గ్రాండ్ ఫినాలే రోజే అన్నపూర్ణ స్టూడియో బయట అవాంఛనీయ సంఘటనలు జరగడం, కేసులు నమోదు కావడం, అందులో పల్లవి ప్రశాంత్ పేరు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ తర్వాత రైతు బిడ్డను అరెస్ట్ చేయడం, చంచల్ గూడ జైలుకు తరలించడం, బెయిల్‌పై విడుదల కావడం.. తదితర సంఘటనలు రైతు బిడ్డను తరచూ వార్తల్లో నిలిపాయి.
తనికెళ్ల భరణితో రైతు బిడ్డ..