Actress : కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. సినిమాల్లో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే.. ఇప్పుడు సీరియల్స్‌తో బిజీ..
సినీరంగంలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభమేమి కాదు. కానీ కొంతమంది తారలు మాత్రం ఒకటి రెండు చిత్రాలతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటారు. ఆ తర్వాత సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటారని భావిస్తే.. అనుహ్యంగా సినిమాలకు దూరమైపోతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం ఆ జాబితాలోకి చెందినవారే.

పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు ఆమె టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ప్రేమకథ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఒకటి రెండు సినిమాలతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఇండస్ట్రీకి దూరమైన ఈ చిన్నది… ఇప్పుడు బుల్లితెరపై బిజీగా ఉంటుంది. అప్పట్లో సినిమాలతో అలరించిన ఆమె.. ఇప్పుడు సీరియల్ హీరోయిన్ గా , నిర్మాతగా రాణిస్తుంది. ఆమె మరెవరో కాదండి.. సుహాసిని. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. స్మాల్ స్క్రీన్ పై వరుస సీరియల్స్ చేస్తూ అలరిస్తుంది. కొన్నాళ్ల క్రితం తన ఇన్ స్టాలో ఈ చిన్ననాటి ఫోటో షేర్ చేస్తూ.. “నేను బాల్యం నుంచి ప్రారంభిస్తాను” అంటూ రాసుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Nani : నానితో జెర్సీ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ? చివరకు ఆ హీరోతో బ్లాక్ బస్టర్..
సుహాసినికి సోషల్ మీడియాలో 1.5k ఫాలోవర్స్ ఉన్నారు. తెలుగులో ఒకప్పుడు సినిమాల్లో కథానాయికగా నటించింది. 2003లో బి.జయ దర్శకత్వం వహించిన చంటిగాడు సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, భోజ్ పురి చిత్రాల్లో నటించింది. తెలుగులో సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో నెమ్మదిగా బుల్లితెరపైకి తెరంగేట్రం చేసింది.
ఇవి కూడా చదవండి : Tollywood : కుర్రాళ్లకు మెంటలెక్కించిన హీరోయిన్.. కట్ చేస్తే.. అవకాశాల కోసం ఎదురుచూపులు..
2010లో అపరంజి అనే సీరియల్ ద్వారా స్మాల్ స్కిన్ పైకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అనుబంధాలు, అష్టాచెమ్మ, శివశంకరి వంటి సీరియల్స్ చేసింది. కొన్నాళ్ల క్రితం దేవత, మామగారు సీరియల్స్ ద్వారా మరింత పాపులర్ అయ్యింది.
ఇవి కూడా చదవండి : Prithviraj Sukumaran : ఏంటీ.. ఈ స్టార్ హీరో భార్య టాప్ జర్నలిస్టా.. ? ఫోన్ కాల్‌తో ప్రేమకథ.. లవ్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్టులు..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Cinema : ఇదెక్కడి సినిమా రా బాబూ.. 45 కోట్లు పెట్టి తీస్తే రూ.60 వేల కలెక్షన్స్ రాలేదు.. నిర్మాతలను నిండా ముంచేసింది..




