Karthika Deepam: మోనితకు షాక్ మీద షాక్.. నీది ప్రేమ కాదు పంతం అన్న కార్తీక్.. దీపకు కీలక విషయం చెప్పిన ఆదిత్య..

|

Jul 08, 2021 | 11:18 AM

Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1086 ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. మోనిత కార్తీక్ ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. మీ అమ్మ అమెరికా ఎందుకు వెళ్ళింది..నా వెనుక..

Karthika Deepam: మోనితకు షాక్ మీద షాక్.. నీది ప్రేమ కాదు పంతం అన్న కార్తీక్.. దీపకు కీలక విషయం చెప్పిన ఆదిత్య..
Karthika Deepam July 8th
Follow us on

Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1086 ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. మోనిత కార్తీక్ ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. మీ అమ్మ అమెరికా ఎందుకు వెళ్ళింది..నా వెనుక ఎం జరుగుతుంది అంటూ తేల్చుకుంటా అంటూ వెళ్తున్న మోనితని చేయి పట్టి కార్తీక్ అవుతాడు. నా చెయ్యేకాదు.. నా జీవతం నీ చేతిలోనే ఉంది కార్తీక్ అంటే.. వెంటనే మోనిత చేయి వదిలేస్తాడు, దీంతో మోనిత చేయి వదిలేసినంత ఈజీగా నన్ను వదిలేయలేవు అంటుంది. కార్తీక్ మోనిత కు షాక్ ఇస్తూ.. నీది పంతం.. ప్రేమ లేదు.. నాది స్నేహం.. స్వార్ధం లేదు.. ఈ చిక్కు ముడితో నన్ను కట్టేశావు. అయినా ఓపికగా ఉన్నా..నాకు తెలియకుండా జరిగిన తప్పు నా జాబితాలో చేర్చకు.. అయినా మౌనంగానే భరిస్తున్నా.. ఈ దోషాన్ని.. మా అమ్మకు.. న భార్యకు అంటగట్టకు. నేను సహించను. స్నేహం కావాలంటే చెప్పు.. నేను ముందువరసలో ఉంటా.. అంతేకాని న్యాయం కావాలనంటే ..అన్యాయానికి తలవంచాను.. ఎదో నువ్వు అత్యాచారానికి.. అన్యాయానికి గురైనట్లు మాట్లాడుతున్నావు.. నీలో ప్రేమ కానీ.. నేను నిన్ను వదిలేస్తానన్న బాధ కానీ ఎక్కడా లేవు. నీకు కావాల్సింది దక్కించుకోవడం కోసం ఎంత దూరమైన వెళ్తావన్న బెదిరింపు కనిపిస్తోంది..’నాకు తెలియని తప్పుకు ఈ చర్యకి నేను నైతిక బాధ్యత వహించలేను.. నా కాపురాన్ని కష్టాల్లోకి నెట్టెయ్యలేను అంటూ మోనిత కు షాక్ ఇచ్చి అక్కడ నుంచి కార్తీక్ వెళ్ళిపోతాడు.

దీప ఆలోచిస్తుంటుంది.. పిల్లలు అమ్మ కోసం శౌర్య డాక్టర్లా హిమ పేషేంట్ లా మారి.. నటిస్తూ.. దిగులుగా ఉంది.,. మా నాన్న చాలా మంచివాడు.. మా అమ్మే సరిగ్గా ఉండడం లేదు అంటుంది హిమ.. అప్పుడు దీప పిల్లలదగ్గరకు వస్తుంది. దీపని పేషేంట్ లా కూర్చోబెడితే… శౌర్య దీప హాట్ బీట్ చెక్ చేసి..ఏంటి సుస్థి అంటుంది. నా పిల్లలు నన్ను అర్ధం చేసుకోవోడం లేదు. నేను వాళ్ళకి చెడ్డదాలనిలా కనిపిస్తున్నా అంటే.. పిల్లలలు అమ్మా బాధపడొద్దు.. మేము నిన్ను ఎప్పుడూ తప్పుగా అనుకోలేదు.. నాన్న మంచివాడు అని చెబుతున్నామంతే .. అందుకనే మన కోసం అక్కడ నుంచిఇక్కడకొచ్చి ఉంటున్నాడు చెప్పి.. అక్కడ నుంచి వెళ్ళిపోతారు.

మరోవైపు మోనిత కు ఆస్పత్రిలోని భాగ్యం చెప్పిన మాటలు చెబుతారు.. అవన్నీ గుర్తు చేసుకున్న మోనిత ఏంటి ఏమి జరుగుతుంది.. పెళ్లి డేట్ దగ్గరకు వస్తుందంటే.. వాళ్లలో టెన్షన్ పెరుగుతుంది అని అనుకుంటే.. నన్నే టెన్షన్ పెడుతున్నారు. జాగ్రత్తగా ఉండాలి.. నేను దీపని కాదు .. ఒకొక్కరి సంగతి తేలుస్తా … సౌందర్య గారు మీరు అమెరికా వెళ్లినంత మాత్రాన్న సమస్యలు సముద్రాలు దాటి పోయినట్లు కాదు.. చెబుతా.. ఒకొక్కరికి కాదు.. చెబుతాను.. నా స్టైల్‌లో బుద్ది చెబుతా.. అని తనలో తానే అనుకుంటుంది మోనిత.

దీప కార్తీక్ గురించి ఆలోచిస్తుంటుంది.. ఇంతలో కార్తీక్ వచ్చి.. పిల్లలకు కొత్త బట్టలు ఇస్తాడు.. అవి కట్టుకుని రమ్మనమని చెబుతాడు. మా సైజెస్ నీకు తెలియవుగా ఎలా తెచ్చావు.. అంటే రూ. 10 వేలు పందెం వేస్తున్నా ఇవి మీకు కరెక్టుగా సరిపోతాయని అంటాడు కార్తీక్.. ఇదంతా చూస్తున్న దీప ఏమిటి ఆయనలో ఇంత మార్పు అనుకుంటూ.. వాటర్ బాటిల్ తీసుకోబోతుంది. కార్తీక్ ఆ బాటిల్ దీప చేతికి ఇచ్చి.. తగు నీకే అవసరం.. అంటాడు.. దీప తర్వాత ఆ బాటిల్ నీటిని తాను పూర్తిగా తాగేసి.. ఏముంది ఏమి లేదు ఖాళీ.. నా మనసులా.. నువ్వు కూడా నీ మనసుని ఖాళీ చేసుకో.. నా మీద అనుమానం. అపనమ్మకం వద్దు అని చెబుతాడు కార్తీక్.. ఇంతలో పిల్లలు కొత్తబట్టలు కట్టుకుని వస్తే.. రండి సెల్ఫీ దిగుదాం.. అంటూ పిల్లలలో పాటు దీపని కూడా రమ్మని.. అంటాడు. దీప భుజంపై కార్తీక్ ప్రేమగా చెయ్యి వేసి.. నలుగురు కలిపి సెల్ఫీ దిగుతారు.. మన అందరి సెల్ లోను ఇదే సెల్ఫీ స్క్రీన్ మీద ఉండాలి.. అని కార్తీక్ చెబుతాడు..వెళ్లండి వెళ్లి మీ ఫ్రెండ్స్‌ అందరికీ ఈ డ్రెస్‌లు చూపించి రండీ’ అని పంపిస్తాడు.

దీపని ఓ కుర్చీలో కూర్చోబెట్టి.. ఈ మార్పు నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు.. ఎందుకంటే.. నిన్నటి వరకూ నేను తప్పుచేసినవాడిలా తల దించుకున్నా.. ఈ మార్పు నీకు అసహ్యంగా ఉండొచ్చు.. అంత తప్పు చేసి.. ఏమీ జరగని వాడిలా ఇదేంటి అని నువ్వు ఆలోచించవచ్చు.. కొంచెం ఓపిక పట్టు దీప .. రేపటి ఎపిసోడ్ లో ఆదిత్య.. దీపకు ఓ కీలకమైన విషయాన్నీ కార్తీక్ నిర్దోషత్వం రుజువు చేసే సాక్ష్యాన్ని చెబుతున్నాడు.. మరి దీప రంగంలోకి దిగి మోనిత కు ఏ విధంగా షాక్ ఇస్తుందో చూడాలి మరి

Also Read:జమ్ము కశ్మీర్‌లో టెన్షన్‌..టెన్షన్‌.. 24 గంటల్లో ఐదుగురు ఉగ్రవాదుల హతం