Premi Viswanath: రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన వంటలక్క! ఒక్కరోజుకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

తెలుగు బుల్లితెర ఆడియన్స్ ఫేవరెట్ సీరియల్స్ లో కార్తీక దీపం కచ్చితంగా ఉంటుంది. వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ కోసమైనా ఈ సీరియల్ ను క్రమం తప్పకుండా చూసే వారు చాలామంది ఉన్నారు. అయితే తన డిమాండ్, క్రేజ్ దృష్ట్యా తన రెమ్యునరేషన్ ను కూడా భారీగా పెంచేసిందట వంటలక్క.

Premi Viswanath: రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన వంటలక్క! ఒక్కరోజుకు ఎంత తీసుకుంటుందో తెలుసా?
Premi Viswanath

Updated on: Apr 05, 2025 | 6:17 PM

సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉందో.. బుల్లితెరపై కొంత మంది సీరియల్ నటీమణులకు కూడా అంతే క్రేజ్ ఉంది. అందులో కార్తీక దీపం సీరియల్ నటి వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ ఒకరు. తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులకు బాగా చేరువైందీ అందాల తార. ఇక కార్తిక దీపం సీరియల్ కూడా తెలుగు టెలివిజన్ రంగంలోనే సంచలనం సృష్టించింది. అప్పుడెప్పుడో ఎప్పుడో 2017 లో ప్రారంభమైన ఈ సీరియల్ 2023 లో ఫస్ట్ సీజన్ ను కంప్లీట్ చేసుకుంది. దాదాపు 1500లకు పైగా ఎపిసోడ్స్ ఈ సీరియల్ సాగిందంటే ఎంతటి ప్రేక్షకాదరణ దక్కిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకునే కార్తీక దీపం సెకండ్ సీజన్ ను కూడా తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సీజన్ కు కూడా భారీ స్పందన వస్తోంది. అలాగే టీఆర్పీ రేటింగ్ లోనూ కార్తీక దీపం 2 దూసుకెళుతోంది.

కార్తీక దీపం సీరియల్ కు వస్తోన్న పాపులారిలీ దృష్ట్యా వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ కూడా తన రెమ్యునరేషన్ ను పెంచేసందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె రోజుకు రూ. 50 వేల వరకు డిమాండ్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నెలలో దాదాపు 20-205 రోజుల పాటు ప్రేమి విశ్వనాథ్ షూటింగ్ లో పాల్గొంటుంది. తద్వారా ఈ అమ్మడికి లక్షల్లోనే పారితోషికం అందుతోందట. సీరియల్ కు వచ్చిన ప్రజాదరణ, రేటింగ్స్  వల్ల లాభాలు గట్టిగానే వస్తున్నాయని, అందుకే ప్రొడ్యూసర్స్ కూడా వంటలక్క రెమ్యునరేషన్ విషయంలో  విషయంలో వెనకాడటంలేదని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

వంటలక్క లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

 

ఇక సీరియల్స్ నటీమణుల రెమ్యునరేషన్ విషయంలో వంటలక్కనే టాప్ పెయిడ్ ఆర్టిస్ట్ అని తెలుస్తోంది. ఆ తర్వాత సుజిత, కస్తూరి లాంటి ఆర్టిస్టులు ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి ఏళ్లు గడుస్తున్నా వంటలక్క క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది.

కుమారుడితో  కలిసి ఫారిన్ వెకేషన్ లో ప్రేమి విశ్వనాథ్..

కార్తీక దీపం 2 సీరియల్ లో ప్రేమి విశ్వనాథ్, నిరూపమ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..