Vijay Devarakonda: ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ షణ్ముక ప్రియకు బంపర్ ఆఫర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ఆనందంతో గంతులేసిన సింగర్..

సోనీ టీవీ నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ 12వ సీజన్‏లో తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ పైనల్‏లో ఇతర గాయకులతో గట్టిగానే తలపడుతుంది. శా

Vijay Devarakonda: ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ షణ్ముక ప్రియకు బంపర్ ఆఫర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ఆనందంతో గంతులేసిన సింగర్..
Vijay Devarakonda

Edited By: Rajeev Rayala

Updated on: Aug 16, 2021 | 10:18 PM

సోనీ టీవీ నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ 12వ సీజన్‏లో తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ పైనల్‏లో ఇతర గాయకులతో గట్టిగానే తలపడుతుంది. శాస్త్రీయ సంగీతంతోపాటు.. వెస్ట్రన్, పాప్, రాక్ బ్లూస్ వంటి పాటలను తన సుమధుర గానంతో సంగీత ప్రియనులను అలరిస్తోంది. లిటిల్ చాంప్స్, పాడుతా తీయగా వంటి పోటీల్లో పాల్గొని ప్రశంసలు అందుకున్న షణ్ముఖ ఇప్పుడు ఇండియన్ ఐడల్ కోసం పోటీ పడుతుంది. ఈక్రమంలో ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్‏గా నిలిచిన షణ్ముక ప్రియకు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ విషెస్ అందించి, సర్ ప్రైజ్ చేశారు.

ఈ ఆదివారం జరగబోయే పాపులర్ సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 2021 గ్రాండ్ ఫినాలేలో ఫైనలిస్ట్‏గా పోటీచేస్తున్న తెలుగమ్మాయి షణ్ముక ప్రియకు హీరో విజయ్ దేవరకొండ వీడియా ద్వారా బెస్ట్ విషెస్ అందించి సర్ ప్రైజ్ చేశాడు. దీంతో ఫేవరేట్ హీరో అలా తనకు విష్ చేయడంతో షణ్ముక స్టేజ్ పైనే ఆనందం వ్యక్తం చేసింది. తను ‘‘విజయ్ దేవరకొండ కు పెద్ద ఫ్యాన్ అనీ, విజయ్ సినిమాలో పాడటమే తన కోరిక అని గతంలో ఒకసారి షో నిర్వాహకులకు తెలిపింది. ఇక సోనీ టీవీ నిర్వాహకులు విజయ్‏ను సంప్రదించి షణ్ముకకు విషెస్ తెలపాలని కోరారు. వెంటనే విజయ్ దేవరకొండ ఓ వీడియోతో ప్రోగ్రామ్ జరగుతున్నప్పుడే షణ్ముక ప్రియను సర్ ప్రైజ్ చేశాడు. తనకు ఆల్ ది బెస్ట్ చెప్పడమే కాకుండా, టైటిల్ గెలిచినా, గెలవకపోయినా.. తన నెక్స్ట్ సినిమాలో పాడే అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఈ వీడియో చూడగానే షణ్ముక ప్రియ,వాళ్ల పేరెంట్స్ ఆనందంలో మునిగిపోయారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‏లో వైరల్ అయింది. షోలో ఉన్న కంటెస్టెంట్‏లు, గెస్ట్‏లు, ప్రేక్షకులు అంతా షణ్ముకకు విజయ్ ఆఫర్ ఇవ్వడాన్ని అభినందించారు.

ట్వీట్..


Also Read: Prakash Raj: ‘మా’లో కాకపుట్టిస్తున్న ప్రకాష్ రాజ్ ట్వీట్.. అసలు ఉద్దేశం అదేనా..

Meera Mithun: పోలీసులకు చుక్కలు చూపించిన మీరా మిథున్.. టచ్ చేస్తే ఆత్యహత్య చేసుకుంటా.. వీడియో వైరల్..

Paagal Movie Review: అమ్మలాంటి ప్రేమ కోసం ‘పాగల్‌’ పాట్లు.. ఇంతకీ లవ్‏లో పాసవుతాడా!