Prakash Raj: ‘మా’లో కాకపుట్టిస్తున్న ప్రకాష్ రాజ్ ట్వీట్.. అసలు ఉద్దేశం అదేనా..

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజు రోజుకీ వేడెక్కుతుంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగా.. అభ్యర్థులు బహిరంగ

Prakash Raj: 'మా'లో కాకపుట్టిస్తున్న ప్రకాష్ రాజ్ ట్వీట్.. అసలు ఉద్దేశం అదేనా..
Prakash Raj
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Aug 16, 2021 | 10:18 PM

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజు రోజుకీ వేడెక్కుతుంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగా.. అభ్యర్థులు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. మా అధ్యక్ష పదవి కోసం సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, నటి హేమ, సీవిఎల్ పోటిపడుతున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో లోకల్, నాన్ లోకల్ అని.. ప్రకాష్ రాజ్ అధ్యక్షుడిగా పోటిచేయడం మాకు ఇష్టలేదంటూ కొందరు విమర్శించగా.. అందుకు ప్రకాష్ రాజ్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక ఇటీవల నటి హేమ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. మా అధ్యక్షుడిగా ఉన్న నరేష్.. నిధులు దుర్వినియోగం చేశారని.. ఎన్నికలు జరిపాలని కోరుతున్నట్లుగా తన సభ్యులకు పంపిన వాయిస్ మెసేజ్ వైరల్ అయ్యింది. దీంతో తనపై హేమ చేసిన ఆరోపణలను అవాస్తవం అని నరేష్ సీరియస్‏గా స్పందిస్తూ.. నిబంధనలను ఉల్లంఘించిన హేమపై చర్యలు తీసుకోవాలని మా క్రమశిక్షణ సంఘంకు ఫిర్యాదు చేశారు. దీంతో మా క్రమశిక్షణ సంఘం హేమకు నోటీసులు పంపింది.

అయితే మా ఎన్నికలలో అభ్యర్థులు చేస్తోన్న ఆరోపణలతో మా ప్రతిష్ట దిగజారుతుందని.. వెంటనే వారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని మెగాస్టార్ చిరంజీవి.. కృష్ణంరాజుకు బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్‏లో కొత్త చర్చకు దారి తీసింది. ఇవాళ ఆయన తన ట్విట్టర్ ఖాతాలో జెండా ఎగురవేస్తాం అంటూ ట్వీట్ చేశారు. అయితే రేపు (ఆగస్ట్ 15) స్వాతంత్ర దినోత్వవంను ఉద్దేశించి పెట్టి ఉండకపోవచ్చునని.. త్వరలో జరగబోతున్న మా ఎన్నికలలో తాము జెండా ఎగరేస్తామని ప్రకాష్ రాజ్ ధీమా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో సినీ పరిశ్రమలో మరోసారి ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్ అవుతుంది. గతంలో కూడా ప్రకాష్ రాజ్ పలు మార్లు మా ఎన్నికలపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. పది రోజలు క్రితం తెగేదాక లాగొద్దు అంటూ.. నెల క్రితం ఎలక్షన్స్ ఎప్పుడూ అంటూ ట్వీట్ చేసాడు.

ట్వీట్..

Also Read: Meera Mithun: పోలీసులకు చుక్కలు చూపించిన మీరా మిథున్.. టచ్ చేస్తే ఆత్యహత్య చేసుకుంటా.. వీడియో వైరల్..

Paagal Movie Review: అమ్మలాంటి ప్రేమ కోసం ‘పాగల్‌’ పాట్లు.. ఇంతకీ లవ్‏లో పాసవుతాడా!

Akkineni Sumanth: విడాకులు తీసుకున్న మోస్ట్ కన్ఫ్యూజ్డ్ మెన్.. మళ్లీ మొదలైందంటున్న సుమంత్..

నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం