Kathi Mahesh: కత్తి మహేష్ పరిస్థితి విషమం.. చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలింపు

సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉదయం ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు నెల్లూరు జిల్లా..

Kathi Mahesh: కత్తి మహేష్ పరిస్థితి విషమం.. చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలింపు
Kathi Mahesh

Updated on: Jun 26, 2021 | 7:04 PM

సినీ నటుడు, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉదయం ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి పీలేరు వెళ్తుండగా చోటు చేసుకున్న ఈ ఘటనలో కత్తి మహేష్ కారు నుజ్జు నుజ్జుయింది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్‌ కళ్లు, దవడలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు శస్త్ర చికిత్సలు నిర్వహించారు.

ప్రస్తుతం కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో.. మెరుగైన వైద్యం నిమిత్తం ఆయన్ని వైద్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలిస్తున్నారు. కాగా, తానే డ్రైవింగ్ చేస్తున్నానని.. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే కత్తి మహేష్‌కు తీవ్ర గాయాలయ్యాయని ఆయన స్నేహితుడు సురేష్ వెల్లడించారు.

జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించిన ‘బిగ్ బాస్ సీజన్ 1’లో కత్తి మహేష్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ ద్వారా ఆయన సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. అంతేకాకుండా తరచూ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ ప్రేక్షకులను పలకరించేవారు.

 

Also Read:

ఈ పండుతో డయాబెటీస్‌కు చెక్ పెట్టొచ్చు.. ప్రపంచంలోనే తియ్యటి ఫ్రూట్.. ప్రత్యేకత ఇదే.!

ఈ కొండచిలువను చూసేందుకు ఎగబడుతున్న జనాలు.. వీడియో చూస్తే మీరు ఫిదా కావాల్సిందే.!

వీడెవడండీ బాబు.! ‘క్రిస్ గేల్’ తమ్ముడులా .. 10 బంతుల్లో 50 పరుగులు బాదేశాడు..

చెట్టు తొర్రలో భారీ గుడ్లు.. వాటిని పగలగొట్టి చూడగా స్థానికులు హడల్.!