Bigg Boss 6 Telugu: ‘ఆమెపై ఇంత ప్రేమ ఎందుకో.. ఇప్పటికీ మిస్టరీనే’.. సీక్రెట్ రూమ్‌కి మాత్రం పంపకండి దొర
సోషల్ మీడియాలో ఎక్కువశాతం నెగెటివ్ కామెంట్స్. ఒక్క హోస్ట్ నాగార్జున తప్ప అందరూ ఆమె గేమ్ ఆడే విధానాన్ని విమర్శిస్తూనే ఉంటారు. కానీ ఇన్ని వారాలు ఆమె హౌస్‌లో ఎలా ఉందన్నది అంతుచిక్కని విషయం.
బిగ్ బాస్ ఈ సీజన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆర్టిస్టుల సెలక్షన్ ఘోరాతి ఘోరంగా ఉంది. ఇంట్లోకి వెళ్లినవారితో ఆట ఆడించడానికి బిగ్ బాస్ టీమ్‌తో పాటు హోస్ట్ నాగార్జున పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కాదు. గీతూ ఎలిమినేషన్ పక్కా అని ఇప్పటికే అర్థమయ్యింది. అయినప్పటికీ ఆమెపై ప్రేమను చంపుకోలేకపోతున్నారు హోస్ట్ అండ్ బిగ్ బాస్. మొదట్నుంచి నుంచి ఆమె పెద్ద ప్లేయర్ అన్నట్లు తనకు తానే బిల్డప్ ఇస్తుంది. బిగ్ బాస్‌ను పక్కనబెట్టి తనే.. ఏదో మిగతా వాళ్లతో ఆట ఆడిస్తున్నట్లు ఫీల్ అవుతుంది. ఆటలో ఉంటే అమ్మనాన్నలు కూడా పట్టించుకోదట. వెదవలా బిహేవ్ చేస్తా అని తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకుంది. ఆమెకు శనివారం ఎపిపోడ్‌లో బాలదిత్య ఇచ్చిన కౌంటర్ మాత్రం అదుర్స్. అమ్మానాన్నలతో నేను గేమ్ ఆడినా గెలవాలనుకుంటాను సార్.. కానీ ఆడే విధానం ఒకటి ఉంటుంది అంటూ గీతూని సపోర్ట్ చేసిన నాగార్జునకు అదిరిపోయే పంచ్ ఇచ్చాడు బాలాదిత్య.
మొత్తంగా పెద్దరికంగా వ్యవహరించే బాలాదిత్యకు సిగరేట్ వీక్‌నెస్ అనే నేమ్ పడటానికి కారణం మాత్రం గీతూనే అనేది వాస్తవం. నిజంగా ఆ ఇష్యూని అంతలా లాగి.. అతడి క్యారెక్టర్‌ని తగ్గించినట్లు అనిపించింది. ఇంత చేసి కూడా తన తప్పు లేనట్లు నంగనాశిలా మాట్లాడుంది ఈ మహాతల్లి. ఇక సీజన్ స్టార్టింగ్ నుంచి గీతూని తన భుజాలపై మోస్తున్న నాగార్జున ఈసారి ఆమెను నెత్తిన పెట్టుకున్నారు. గీతూ చేసిన తప్పుల్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు. బాలాదిత్య వీక్నెస్ పట్టుకుని ఆడిన గీతూని తిట్టకుండా.. మీ అన్న సిగరెట్లు మానేయాలని అలా చేశావా?అని యాంగిల్ మార్చి ప్రొజెక్ట్ చేశారు. అతడు మారతాడని నువ్వు నమ్ముతున్నావా అంటూ ఆమెను మరో ఎత్తుకు తీసుకెళ్తే ప్రయత్నం చేయడం నవ్వు తెప్పించింది. ఇక బాలాదిత్య గీతూ గొడవ విషయంలో ఆదిత్యదే తప్పని అక్కడున్న జూనియర్ ఆర్టిస్టులతో చెప్పించడం మాత్రం హైలెట్ సీన్.
స్టార్టింగ్ నాలుగు రోజులు చూశాం.. అమ్మో ఆ గీతూ ఓవరాక్షన్ భరించలేక మానేశాం అనేవాళ్లు చాలామంది ఉన్నారు. నెగెటివిటీని పీక్‌లో స్ప్రెడ్ చేసిన గీతూని.. నిజంగా ఏ ఆడియెన్స్ ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చారో అర్థం కాలేదు. మొత్తంగా ఓ విముక్తి అయితే వచ్చింది. ఆమె ఎలిమినేట్ అవుతున్నట్లు తేలిపోయింది. అయితే దయచేసి సీక్రెట్ రూమ్‌కి మాత్రం పంపకండి అంటూ వేడుకుంటున్నారు కొందరు వ్యూయర్స్. మరి అలాంటి తప్పు బిగ్ బాస్ టీమ్ చేస్తుందో, ఇప్పటికైనా మేల్కుంటుందో చూడాలి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.