
బిగ్ బాస్ తెలుగు 9 రియాలిటీ షో ప్రారంభానికి మరికొన్ని గంటలే మిగిలి ఉంది. ఆదివారం (సెప్టెంబర్ 07) సాయంత్రం 7 గంటల నుంచి ఈ బిగ్ బాస్ గ్రాండ్ లాంఛ్ ఉండనుంది. దీనికి సంబంధించి అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. పలువురు సినీ ప్రముఖులు ఈ గ్రాండ్ ఈవెంట్ లో సందడి చేయనున్నారని టాక్. కొందరు కంటెస్టెంట్లు అద్దిరిపోయే డ్యాన్స్ పెర్ఫామెన్స్ లతో ఎంట్రీ ఇవ్వబోతున్నారట. మరికొందరు ఏవీలతో హౌస్ లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. తనూజా గౌడ, శ్రష్టి వర్మ, ఆషా సైనీ, ఇమ్మాన్యుయెల్, సంజనా గాల్రానీ, రీతూ చౌదరీ, భరణి, రాము రాథోడ్, సుమన్ శెట్టి, అలేఖ్య చిట్టి పికిల్స్ గర్ల్స్ రమ్య, దేబ్జానీ, దీపికా, శివకుమార్, శ్రీతేజ, తేజస్విని గౌడ ఫిక్స్ అయ్యారట. సెలబ్రిటీ కంటెస్టెంట్లు 9 మంది, కామనర్స్ ఆరుగురు, మొత్తం 15 మందిని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించబోతున్నట్టు సమాచారం.
అయితే పైన చెప్పిన కంటెస్టెంట్లలో కొంత మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా రానున్నట్లు సమాచారం. బిగ్ బాస్ షోకి నాగార్జున హోస్ట్ గా చేస్తుండగా, బిగ్ బాస్ బజ్ కూడా కీలకంగా ఉంటుంది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లని ఫస్ట్ ఇంటర్వ్యూలు చేసే ఈ ప్రోగ్రామ్ కు గతంలో అరియానా, గీతు, అంబటి అర్జున్ తదితరులు యాంకర్ గా వ్యవహరించారు. అయితే ఈసారి స్టార్ నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ శివాజీని హోస్ట్ చేస్తారని సమాచారం. ముక్కుసూటిగా మాట్లాడే అతను అయితేనే రెగ్యులర్ షో కంటే, ఈ బజ్ మరింత రసవత్తరంగా ఉంటుందని మేకర్స్ డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో బిగ్ బాస్ ఫినాలే వరకు వచ్చి జస్ట్ టైటిల్ మిస్ అయ్యాడు శివాజీ. ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ లో సందడి చేసేందుకు మంగపతి రెడీ అయ్యారని సమాచారం.
That entry was a whole cinematic universe 🎬🔥
Don’t miss the #BiggBossSeason9 Grand Launch on September 7th at 7 PM, only on #StarMaa#BiggBossTelugu9 #BiggBossTelugu9GrandLaunch pic.twitter.com/LqBCGx54ic
— Starmaa (@StarMaa) September 6, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.