బుల్లితెర చరిత్రలో ‘మొగలిరేకులు’ సెన్సెషన్.. ఒకప్పుడు యూత్ సైతం ఈ సీరియల్కు వీరాభిమానులు ఉండేవారు. అప్పటివరకు ప్రసారమైన బోరింగ్ టీవీ సీరియల్స్ బోరింగ్ టీవీ సీరియల్స్ స్టైల్స్ ను మార్చేసింది ఈ డైలీ సీరియల్. సాగదీత.. రొమాన్స్.. ఏడుపులు.. అత్త కోడుళ్లు గోడవలు కాకుండా.. ప్రతి ప్రేక్షకుడి మదిని హత్తుకునే సన్నివేశాలతో ప్రతిక్షణం ఆసక్తికర కథనంతో మొగలిరేకులు సీరియల్ ను తెరకెక్కించారు మంజుల నాయుడు. ఇక ఇందులో నటించిన ప్రతి నటీనటులకు అప్పట్లో ఎంతోమంది అభిమానులు ఉండేవారు. ముఖ్యంగా ఆర్కే నాయుడు. మున్నాగా ద్విపాత్రాభినయంలో నటించి కోట్లాది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.
ఇప్పటికీ ఆర్కే నాయుడు అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. మున్నా.. ఆర్కే నాయుడు అసలు పేరు సాగర్. కానీ అతని రియల్ నేమ్ కంటే ఆర్కే నాయుడు అంటేనే ఆడియన్స్ ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా తన నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలో ఎంతో హుందాగా.. మున్నా పాత్రలో యాటిట్యూడ్ కు అమ్మాయిలు ఫిదా అయ్యారు. ఈ సీరియల్ తోనే హీరోకు ఉన్నంత క్రేజ్ వచ్చేసింది. ఉత్తమ నటుడిగా నంది టీవీ అవార్డ్ సైతం అందుకున్నారు. అయితే మొగలిరేకులు తర్వాత సాగర్.. ప్రభాస్ నటించిన మిస్టర్ ఫర్పెక్ట్ సినిమాలో కనిపించారు. ఆ తర్వాత సినిమాల్లో సక్సెస్ కాలేకపోయారు.
చాలాకాలంగా అటు సినిమాల్లోగానీ.. ఇటు సీరియల్స్ లో గానీ కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు సాగర్. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు. ఇటీవల సాగర్ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిసి ఓ మొక్కను అందజేశారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.