AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaanu Song: నెట్టింట వైరలవుతున్న ‘జాను’ సాంగ్.. ఇంతకీ షన్ను పక్కన ఆ అమ్మాయి ఎవరో తెలుసా ?..

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆహా ఓటీటీలో ఏజెంట్ ఆనంద్ సంతోష్ అనే వెబ్ సిరీస్ చేసిన షన్నూ తాజాగా మరో ప్రైవేట్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే విడుదలైన జాను సాంగ్ ప్రోమో నెట్టింట తైగ చక్కర్లు కొడుతుంది.

Jaanu Song: నెట్టింట వైరలవుతున్న 'జాను' సాంగ్.. ఇంతకీ షన్ను పక్కన ఆ అమ్మాయి ఎవరో తెలుసా ?..
Jaanu Song
Rajitha Chanti
|

Updated on: Dec 28, 2022 | 10:48 AM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రైవేట్ సాంగ్స్ హావా కొనసాగుతుంది. మ్యూజిక్.. లిరిక్స్ ఆడియన్స్ మనసులను హత్తుకుంటున్నాయి. ఇప్పటివరకు అనేక పాటలు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ సంపాదించుకున్నాయి. ఇక అందులోని నటీనటులు కూడా కావాల్సినంత క్రేజ్ వచ్చేస్తుంది. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ షన్నూ నటించి జాను సాంగ్ తెగ వైరలవుతుంది. షార్ట్ ఫిల్మ్ ద్వారా యూట్యూబర్ గా మారిన షన్నూ.. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ తో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన సూర్య సిరీస్ సైతం సూపర్ హిట్ అయ్యింది. దీంతో బిగ్ బాస్ ఆఫర్ అందుకున్నాడు. టైటిల్ రేసులో పోటీ పడిన షన్నూ.. చివరకు రన్నరప్ గా నిలిచాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆహా ఓటీటీలో ఏజెంట్ ఆనంద్ సంతోష్ అనే వెబ్ సిరీస్ చేసిన షన్నూ తాజాగా మరో ప్రైవేట్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే విడుదలైన జాను సాంగ్ ప్రోమో నెట్టింట తైగ చక్కర్లు కొడుతుంది.

అయితే ఈ పాటలో షన్నూ పక్కన ఓ కొత్త అమ్మాయి కనిపించింది. అందం.. ఎక్స్ ప్రెషన్స్ తో అట్రాక్షన్ గా నిలిచింది. దీంతో ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ ఆ కొత్త బ్యూటీ ఎవరా అని ఆలోచిస్తున్నారా ? .. తన పేరు సుష్మిత శెట్టి. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది..ఆమెకు ఇన్ స్టాలో దాదాపు లక్షకుపైగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కువగా రీల్స్ చేస్తూ అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు షన్నూతో జత కట్టింది. ఇక ఈ పాటతో యూట్యూబ్ లో సూపర్ క్రేజ్ సొంతం చేసుకోబోతుంది. అంతేకాకుండా.. ఈ పాటకు యశ్ కొరియోగ్రఫీ అందించారు.

రొమాంటిక్ సాంగ్ గా తెరకెక్కిన ఈ పాటలో షన్నూ ఎనర్జిటిక్ డాన్స్ తో పాటు.. సుష్మిత క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకున్నాయి. ఈ పాటకు వందన బండారి నిర్మించగా.. సందీప్ కూరపాటి సంగీతం అందించి ఆలపించారు. ప్రస్తుతం జాను సాంగ్ ప్రోమో వైరలవుతుండగా.. త్వరలోనే ఫుల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే