
విలక్షణ నటుడు జగపతి బాబు ప్రస్తుతం జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షో హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అటు సినిమాలతో బిజీగా ఉంటూనే.. ఇటు సెలబ్రెటీలతో చిట్ చాట్ చేస్తున్నారు. జీ తెలుగులో ప్రతి ఆదివారం ఈ షో ప్రసారమవుతుంది. ఈ షో మొదటి ఎపిసోడ్ కు అక్కినేని నాగార్జున మొదటి అతిథిగా పాల్గొని కెరీర్, పర్సనల్ విషయాలు పంచుకున్నారు. ఇక ఆ తర్వాత యంగ్ హీరోయిన్ శ్రీలీల సైతం సందడి చేసింది. గత వారం న్యాచురల్ స్టార్ నాని, జగపతి బాబుతో కలిసి సందడి చేశారు. ఇందులో సెలబ్రెటీల నుంచి ఆసక్తికర విషయాలను రాబడుతున్నారు జగ్గు భాయ్. ఇక తాజాగా ఈ షోకు గెస్టులుగా సెన్సేషనల్ డైరెక్టర్స్ ఆర్జీవీ, సందీప్ రెడ్డి వంగ వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..
ఇద్దరు సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ ఒకే ఫ్రేమ్ లో కనపడి అల్లరి చేసి సరదాగా నవ్వించారు. వీరిద్దరితో కలిసి జగపతి బాబు సైతం అలరించారు. గతంలో పలు ఇంటర్వ్యూలలో సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ తన ఫేవరేట్ డైరెక్టర్ ఆర్జీవీ అని చాలాసార్లు చెప్పారు. ఇక ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకే షోలో పాల్గొన్నారు. ఇందులో జగపతి బాబుతో కలిసి ఆర్జీవీ, సందీప్ రెడ్డి వంగ ఏం చెప్పారు.. ? ఎలా సందడి చేశారు ? అనే విషయాలు చూడాలంటే ఫుల్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.
ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..
ఈ టాక్ షో ఫుల్ ఎపిసోడ్ సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. ఇక సందీప్ రెడ్డి వంగా సినిమాల విషయానికి వస్తే.. యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఇప్పటికే రాగా.. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ నటిస్తుంది.
ఇవి కూడా చదవండి : గ్లామర్లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..
ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..