నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి? నిజమా!
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు(49) రెండో పెళ్లి చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత..
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు(49) రెండో పెళ్లి చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో మరణించారు. అప్పటినుంచీ ఆయన ఒంటరిగానే ఉంటున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి దిల్ రాజు పెళ్లి చేసుకోవాలని కుటుంబసభ్యులే తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారట. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఆయన తన ఫ్యామీలీలోని 30 ఏళ్ల మహిళని పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ప్రైవేట్‌గా జరిగిన ఈ వేడుకలో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారట.
అయితే.. మంగళవారం ఆయన పెళ్లి అయిపోయినట్టు పలు వార్తలు ప్రచురితమయ్యాయి. కానీ.. దిల్ రాజు మాత్రం మంగళవారం నితిన్ నటించిన భీష్మ సక్సెట్ మీట్‌లో పాల్గొన్నారు. దీనిపై వారితో సంప్రదించగా.. వారి బంధువులు చెప్పిన దాని ప్రకారం మార్చిలో వివాహం ఉండనున్నట్లు చెబుతున్నారు. కానీ ఈ విషయం కూడా వారు కన్ఫామ్‌గా చెప్పలేదు. ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
కాగా.. ఇటీవల రిలీజ్ అయిన ‘జాను’ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. తమిళ సూపర్ హిట్ చిత్రం ’96’కి రీమేక్‌గా జాను చిత్రం తెరకెక్కింది. అలాగే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న బాలీవుడ్ మూవీ ‘పింక్’ రీమేక్ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దీనికి దర్శకత్వం వహిస్తుండగా.. సమ్మర్‌లో రిలీజ్ కాబోతుందని సమాచారం.
Read More: ఇక బెగ్గర్ ఫ్రీ నగరంగా హైదరాబాద్!
ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుడి పేరుతో ఇండియాలో ఓ గ్రామం.. ఎక్కడంటే!