అమెరికా అధ్యక్షుడి పేరుతో ఇండియాలో ఓ గ్రామం.. ఎక్కడంటే!

ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో ఒక అధ్యక్షుని పేరుతో భారత్‌లో ఒక గ్రామం..

అమెరికా అధ్యక్షుడి పేరుతో ఇండియాలో ఓ గ్రామం.. ఎక్కడంటే!
Follow us

| Edited By:

Updated on: Feb 26, 2020 | 12:55 PM

Former American President Jimmy Carter: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా భారత్‌లో రెండు రోజుల పర్యటన చేసిన సంగతి తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఆయన పర్యటన సాగింది. దీంతో.. యావత్ ప్రపంచం చూపు ఇండియాపై పడింది. కాగా… ఇప్పటివరకు భారత్‌లో ఆరుగురు అమెరికా అధ్యక్షులు పర్యటించగా, ట్రంప్ 7వ అధ్యక్షునిగా నిలిచారు. అయితే ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో ఒక అధ్యక్షుని పేరుతో భారత్‌లో ఒక గ్రామం ఉంది. ఆయనే అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్.

జిమ్మీ కార్టర్ పేరుతో హర్యానాలోని గురుగ్రామ్ సమీపంలో ‘కార్టర్పురి’ అనే గ్రామం ఉంది. ఇలా పేరు పెట్టడానికి పలు కారణాలున్నాయి. అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎమర్జన్సీ విధించిన అనంతరం ప్రధాని మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో తొలి కాంగ్రెసేతర జనతా ప్రభుత్వం ఏర్పడింది. ఈ సర్కార్ ఏర్పడ్డ తర్వాత కొద్ది రోజులకే 1978 జనవరి 3న అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ సతీ సమేతంగా భారత్‌లో పర్యటించారు. కాగా ఆయన మొదటిసారిగా ఢిల్లీకి దగ్గరలో ఉన్న ‘దౌలత్పూర్ నసీరాబాద్’ అనే పల్లెటూరుకి జిమ్మీ వెళ్లారు. ఆయన సందర్శించిన అనంతరం ఆ గ్రామానికి ఆ పేరు పెట్టారు. అయితే కేవలం ఆయన పర్యటించినందుకే ఈ పేరు పెట్టలేదు.

1960లో ఆర్మీ కోర్ మెంబర్‌గా జిమ్మీ కార్టర్ తల్లి లిలియన్ గోర్డి కార్టర్ దౌలత్ పూర్‌కి ఓ సామాజిక కార్యకర్తగా వెళ్లారు. ఆ తర్వాత కొన్నాళ్ల తర్వాత జిమ్మీ దంపతులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఆ గ్రామ ప్రజలు వీరిని జాగ్రత్తగా చూసుకోవడంతో.. ఓ టెలివిజన్ సెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు జిమ్మీ దంపతులు. ఆ తర్వాత వారు గ్రామం నుంచి వెళ్లిపోతూ ఓ లేఖ రాశారు. అనంతరం ఆగ్రామానికి ‘కార్టర్ పురి’ అని పేరు పెట్టారు. అలా ఆ గ్రామం పేరు ఫేమస్ అయ్యింది.

Read More: ఇక బెగ్గర్ ఫ్రీ నగరంగా హైదరాబాద్!