AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF 2: షాకింగ్ న్యూస్.. ‘కేజీఎఫ్‌ 2’ నుంచి కీలక నటుడు ఔట్..!

బాహుబలి ఫ్రాంచైజీ తరువాత అలాంటి క్రేజ్‌తో తెరకెక్కుతోన్న మరో పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్ 2. యశ్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న ఈ మూవీపై కన్నడతో పాటు మిగిలిన ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

KGF 2: షాకింగ్ న్యూస్.. 'కేజీఎఫ్‌ 2' నుంచి కీలక నటుడు ఔట్..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 26, 2020 | 2:57 PM

Share

బాహుబలి ఫ్రాంచైజీ తరువాత అలాంటి క్రేజ్‌తో తెరకెక్కుతోన్న మరో పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్ 2. యశ్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న ఈ మూవీపై కన్నడతో పాటు మిగిలిన ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ షూటింగ్‌ కూడా దాదాపుగా క్లైమాక్స్‌కు వచ్చేయగా.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ షాకింగ్ వార్త శాండిల్‌వుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ మూవీ నుంచి కీలక నటుడు ఔట్ అయ్యారట. మొదటిభాగంలో జర్నలిస్ట్ కమ్ రైటర్ కమ్ నెరేటర్‌ పాత్రలో కనిపించిన అనంత్ నాగ్‌ను రెండో భాగం కోసం కూడా తీసుకున్నారు.

అయితే తన పాత్రతో అంత సంతృప్తి పొందని అనంత్‌ నాగ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. దీంతో ఆ పాత్రను మరో నటుడితో చేయించబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి చెప్పాలంటే కేజీఎఫ్‌లో ఉన్న పవర్‌ఫుల్ పాత్రల్లో అనంత్ నాగ్‌ పాత్ర ఒకటి. ఆ కథను ఆయన చెప్పే విధానం ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు రెండో భాగం నుంచి అనంత్ నాగ్ తప్పుకుంటే.. ఆ పాత్రకు ఏ నటుడు న్యాయం చేయగలరన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

కాగా యాక్షన్ ఎంటర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్ విలన్‌గా కనిపించనున్నారు. రవీనా టాండెన్, రావు రమేష్, శ్రీనిధి శెట్టి, అచ్యుత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్ కిరుగందర్ నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది జూలై 30న కేజీఎఫ్‌ 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.

Read Thi Story Also: ‘కేజీఎఫ్’ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలోనే టీజర్..!

Follow Us
శత్రువును ఎదుర్కోవాలంటే.. ఈ 7 వ్యూహాత్మక అస్రాలు మీకు తెలియాలి!
శత్రువును ఎదుర్కోవాలంటే.. ఈ 7 వ్యూహాత్మక అస్రాలు మీకు తెలియాలి!
ట్రాఫిక్ చలాన్లు కట్టట్లేదా? అయితే మీ ఇంట్లో కరెంట్ కట్ అవ్వొచ్చు
ట్రాఫిక్ చలాన్లు కట్టట్లేదా? అయితే మీ ఇంట్లో కరెంట్ కట్ అవ్వొచ్చు
బ్యాంక్ ఖాతాదారుడు మరణిస్తే.. అతడి అకౌంట్లోని డబ్బులు ఏమవుతాయి..?
బ్యాంక్ ఖాతాదారుడు మరణిస్తే.. అతడి అకౌంట్లోని డబ్బులు ఏమవుతాయి..?
'నువ్వు ఆర్టిస్టువా లేక కవయిత్రివా?' UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
'నువ్వు ఆర్టిస్టువా లేక కవయిత్రివా?' UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
ప్రియురాలిని పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ 'గల్లీ బాయ్ భాస్కర్'
ప్రియురాలిని పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ 'గల్లీ బాయ్ భాస్కర్'
100 సార్లు పడిపోయినా.. 101వసారి లేచి నిలబడటమే అసలైన విజయం!
100 సార్లు పడిపోయినా.. 101వసారి లేచి నిలబడటమే అసలైన విజయం!
యూపీపై MDR ఛార్జీలపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
యూపీపై MDR ఛార్జీలపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
WPL 2027: డబ్ల్యూపీఎల్ 2027 రిటెన్షన్ జాబితా విడుదల
WPL 2027: డబ్ల్యూపీఎల్ 2027 రిటెన్షన్ జాబితా విడుదల
పచ్చి చేపలు vs ఎండు చేపలు.. మీ ఆరోగ్యానికి ఏవి మంచివి..?
పచ్చి చేపలు vs ఎండు చేపలు.. మీ ఆరోగ్యానికి ఏవి మంచివి..?
కొత్తిమీరను ఇంట్లోనే ఇలా పెంచితే.. డబ్బు ఆదా చేయడమే కాదు..
కొత్తిమీరను ఇంట్లోనే ఇలా పెంచితే.. డబ్బు ఆదా చేయడమే కాదు..