CID Actor: సీఐడీ నటుడికి గుండెపోటు.. పరిస్థితి విషమం.. వెంటిలేటర్ పై చికిత్స..
గత రెండు రోజులుగా ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందుస్తున్నారని.. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నటీనటులు ఆసుపత్రికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. సీఐడీలో దయా పాత్రను పోషించిన దయానంద్ శెట్టి, దినేష్ ఆరోగ్యం గురించి అప్‌డేట్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. దినేష్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుందని అన్నారు. దినేష్ శరీరం చికిత్సకు స్పందిస్తుందని.. దినేష్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని అన్నారు.
బుల్లితెరపై సెన్సెషన్ సృష్టించిన సీరియల్ ‘CID’. ఇందులో ఫ్రెడ్రిక్స్ పాత్రలో నటించిన నటుడు దినేష్ ఫడ్నిస్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం ప్రకారం డిసెంబరు 1న ఆయనకు గుండెపోటు వచ్చిందని.. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు ఆయనను ముంబైలోని ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందుస్తున్నారని.. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నటీనటులు ఆసుపత్రికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. సీఐడీలో దయా పాత్రను పోషించిన దయానంద్ శెట్టి, దినేష్ ఆరోగ్యం గురించి అప్‌డేట్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. దినేష్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుందని అన్నారు. దినేష్ శరీరం చికిత్సకు స్పందిస్తుందని.. దినేష్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని అన్నారు.
‘CID’లో ఫ్రెడరిక్స్ పాత్రను పోషించడం ద్వారా దినేష్ కు మంచి గుర్తింపు వచ్చింది. దాదాపు 20 ఏళ్ల పాటు ఈ షోలో నటించాడు. ACP ప్రద్యుమన్‌గా నటుడు శివాజీ సతమ్ నటించిన ‘CID’ 1998లో ప్రసారమైంది. భారతదేశంలో అత్యధిక కాలం నడిచే టెలివిజన్ షోలలో ఈ సీఐడీ ఒకటి. ‘CID’ కాకుండా హిట్ టీవీ షో ‘తారక్ మెహతా కా ఊల్తా చష్మా’లో కూడా అతిధి పాత్రలో కనిపించాడు దినేష్.
View this post on Instagram
57 ఏళ్ల దినేష్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు. తన షూట్స్ అప్డేట్స్ తోపాటు.. వ్యక్తిగత జీవితం, ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట అభిమానులతో పంచుకుంటారు. అంతకు ముందు దినేష్ తన ఆరోగ్యం, ఫిట్నెస్ గురించి అనేక విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.