ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అవార్డ్స్ ఎక్స్‌పోకి కావ్య వస్తుంది. మరోవైపు నుంచి రాజ్, సుభాష్, స్వప్న, రుద్రాణిలు కూడా వస్తారు. కావ్యని చూసిన సుభాష్ ఎలా ఉన్నావమ్మా అని అడుగుతాడు. కారు పోయి.. కాలి నడకన వస్తుంది అన్నయ్యా.. రాతలు రాజ్యలు ఏలుతుంటే.. బుద్ధులు కుప్పతోటలపై ఉంటే ఎవరేం చేస్తారులే అని రుద్రాణి సెటైర్లు వేస్తుంది. ఇప్పుడు మీ గురించి ఎవరికి కావాలని స్వప్న పంచ్ వేస్తుంది. ఇక్కడికి ఎవరు పిలిచారంట.. అని రాజ్ అంటే.. ఈ బిల్డింగ్ ఎవరు కొన్నారంటే.. నేను ఇక్కడికి వేరే పని మీద వచ్చాను. ఎవర్నీ కలవడానికి రాలేదని కావ్య అంటుంది. ఈ వంకతో మాటి మాటికీ వచ్చి రాజ్ మనసు మార్చాలని చూస్తున్నావా.. నిన్ను ఏ మాత్రం క్షమించడని రుద్రాణి అంటుంది. దీంతో స్వప్న రుద్రాణికి సరిపడగా కౌంటర్ వేస్తుంది.
కావ్య వెళ్తుంటే.. రాజ్ నాకు చాలా అవమానంగా ఉంది. ఈ ఎక్స్‌పోకి కుండలకు రంగులు వేసుకునేవారు కూడా వస్తే ఎలా? అని రుద్రాణి అంటే.. స్థాయిని నిర్ణయించేది కుండలు, రంగులు కాదు రుద్రాణి గారు.. కళ మీద ఉన్న నైపుణ్యం మాత్రమే అని కావ్య అంటుంది. అలాగని కుండలు కొండలతో ఢీ కొంటే పగిలేది కుండలే అని రుద్రాణి అంటే.. ఇప్పుడు ఎవరూ ఇక్కడికి ఢీ కొనడానికి రాలేదని కావ్య అంటుంది. మరి ఇంటికి రమ్మంటే రాకుండా.. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టో అని రాజ్ అంటే.. ఇంటికి రావడానికి నెలకు ఇంత ఖరీదు కట్టే షరాబులు ఇక్కడ ఉండరు అనుకున్నా. తమరు వస్తారని నాకేం తెలుసు అని కావ్య అంటుంది. ఏంటమ్మా ఏంటి అంటున్నావ్? అని సుభాష్ అంటే.. ఏం లేదు డాడ్ అని రాజ్ అంటాడు. ఎందుకు వాదించుకుంటారు.. రాజ్ అవార్డ్ తీసుకుంటే చూడటానికి కావ్య వచ్చిందని స్వప్న అంటే.. ఎక్కడో ఉన్నావు అక్కా.. పుట్టింటికి నేను భారం కాకుండా ఉండటానికి ఏదో ఒక బతుకు తెరువు వెతుక్కుంటున్నా అని కావ్య అంటుంది.
ఇవన్నీ నాటకాలు.. అవార్డు ఫంక్షన్‌కి అందరూ వస్తారని.. మీ అమ్మా.. మా అమ్మ కలసి ఇంటికి తీసుకెళ్తారని కల కన్నట్టు ఉందని రుద్రాణి అంటే.. కాపురాలు కూల్చే మీ లాంటి వారు అక్కడ ఉండగా.. నా కాపురం ఎక్కడ బాగు పడుతుందని కావ్య అంటుంది. ఇక అక్కడి నుంచి రాజ్, రుద్రాణి, స్వప్నలు వెళ్లిపోతారు. నువ్వు వెళ్లిపోయాక నీ గురించి అందరూ బాధ పడుతున్నారని సుభాష్ అంటే.. నాకు తెలుసు.. నా గురించి ఎవరు బాధ పడుతున్నారో.. ఆయన నన్ను ఏమాత్రం అర్థం చేసుకోకపోతే నేను అక్కడ ఉండి ఎందుకు? అని కావ్య అంటుంది.
ఇక లోపలికి వెళ్తున్న రాజ్‌కి.. సామంత్, అనామికలు ఎదురు పడతారు. ఏమీ తెలీనట్టు నువ్వేంటి? ఇక్కడ అని రుద్రాణి అడుగుతుంది. ఆ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఏమీ లేదు. కానీ సామంత్‌తో పెళ్లి ఫిక్స్ అయ్యాక నాకే షేర్ ఇచ్చాడని అనామిక అంటుంది. నేను అనామికను ఏరి కోరి పెళ్లి చేసుకుంటున్నా. రాజ్ ఇప్పటివరకూ.. నీ కంపెనీ మాత్రమే నాకు అడ్డంగా ఉండేది. ఇక నుంచి మా కంపెనీ అడుగడుగునా అడ్డు వస్తుందని సామంత్ అంటాడు. ఈ సారి గెలుపు మాదే అవుతుందని అనామిక అంటుంది. అనామిక నువ్వు ఎందుకు ఏరి కోరి ఇతని దగ్గర చేరావో అర్థమైంది. నా కంపెనీ పతనం ప్రారంభం అయిందని కలలు కంటున్నట్టు ఉన్నావ్.. అదేం జరగదని రాజ్ అంటాడు. అదీ చూద్దాం మిస్టర్ రాజ్.. చూసి చప్పట్లు కొట్టమని అనామిక అంటుంది. తప్పకుండా చప్పట్లు కొడతాం.. నువ్వు ఇంతలా దిగజారిపోయినందుకు అని స్పప్న పంచ్ వేస్తుంది. నన్ను ఇంట్లోంచి పంపించేసి నట్టే కావ్యని కూడా పంపించేశారు అంట కదా.. నెక్ట్స్ క్యూలో నువ్వే ఉన్నావ్.. జాగ్రత్త అని అనామిక అంటుంది. నీకూ.. కావ్యకి పోలిక ఏంటి? పాపం వీడిని చూస్తుంటేనే జాలిగా ఉందని స్వప్న అంటుంది.
మరోవైపు.. రాజ్ అవార్డ్‌కి వస్తుందో లేదో.. చూద్దామని న్యూస్ ఛానెల్ పెట్టమని అపర్ణ అంటుంది. అక్కడ అంతా లైవ్‌లో న్యూస్ వస్తుంది. కావ్యని చూడగానే నా డిజైన్స్ ఎవరికో కావాలి అన్నారు కదా.. ఆ క్లయింట్ ఎవరో పరిచయం చేస్తే.. వెళ్లిపోతానని కావ్య అంటుంది. అందేంటి ఇప్పుడే కదా వచ్చారు.. వెంటనే వెళ్లిపోతారా? అని సురేష్ అంటే.. నాకు ఇక్కడ ఉండటం ఇబ్బందిగా ఉందని కావ్య అంటుంది. మరి అవార్డ్ ఎవరికి వస్తుందో తెలుసుకోరా.. ఎలాగో ఇంత దూరం వచ్చావు కదమ్మా.. కాసేపు వెయిట్ చేయమని సురేష్ అంటే తప్పక కూర్చొంటుంది కావ్య. పక్క నుంచి కావ్యని చూస్తూ ఉంటాడు రాజ్.
ఆ తర్వాత కావ్య దగ్గరకు వచ్చి పక్కకు తీసుకెళ్తుంది స్వప్న. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు.. రాజ్ కోసమే కదా అని అంటుంది. అంత ఆవేశ పడకు అక్కా.. నేను డిజైన్స్ వేయడానికి ఇక్కడ క్లయింట్స్ ఉన్నారంటే వచ్చానని కావ్య అంటుంది. సరే వచ్చావు కదా..నీకు ఇప్పుడు మంచి అవకాశం దొరికింది. నువ్వు ఇక్కడికి వస్తున్నావని తెలుసుకున్న మా అత్త రుద్రాణి.. మీ ఇద్దరినీ విడగొట్టడానికి వచ్చింది. కానీ నువ్వు రివర్స్ అయ్యే విధంగా చేయాలని స్వప్న అంటుంది. అర్థం కాలేదని కావ్య అంటే.. అబ్బా ఈ ఎక్స్‌పోలో ఎలాగైనా రాజ్‌కే కదా అవార్డ్ వస్తుంది. అవార్డ్ తీసుకున్న వెంటనే నువ్వు రాజ్ దగ్గరకు వెళ్లి.. కంగ్రాట్స్ చెప్పు.. అలాగే సారీ కూడా చెప్పు.. ఆ సంతోషంలో నిన్ను ఇంటికి తీసుకొస్తాడని స్వప్న అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్? నేను అస్సలు ఎప్పుడూ సారీ చెప్పలేదని అనుకుంటున్నావా.. నేను ఆయన్ని లక్ష సార్లు క్షమించమని అడిగి ఉంటాను. కానీ ఇక్కడ భార్యాభర్తల మీద ప్రేమ ఉండాలని కావ్య అంటుంది. ఇక ఇవాళ్టితో ఇక్కడి ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..