Brahmamudi, October 15th Episode: అపర్ణ ప్లాన్ సక్సెస్.. రుద్రాణి మాస్టర్ ప్లాన్.. బయటపడిన నిజం!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. మా అక్క పుట్టింటికి వచ్చేసింది. నువ్వేమో నన్ను పెళ్లి చేసుకుని బయటకు వచ్చేశావు. మరి ఇలాంటి సమయంలో మా అమ్మ ఇంత గ్రాండ్‌గా ఎందుకు పెళ్లి రోజు చేసుకుంటుందో నాకు అర్థం కావడం లేదని అప్పూ అంటుంది. అది నాకెలా తెలుస్తుంది. వెళ్లి మీ అమ్మని అడగమని కళ్యాణ్ అంటాడు. వెళ్లి కడిగి పారేస్తానని వెళ్తుంది అప్పూ. కట్ చేస్తే.. రాజ్ ఆఫీస్‌కి వస్తాడు. మేనేజర్ దగ్గరకు వెళ్లి చెప్పు..

Brahmamudi, October 15th Episode: అపర్ణ ప్లాన్ సక్సెస్.. రుద్రాణి మాస్టర్ ప్లాన్.. బయటపడిన నిజం!
BrahmamudiImage Credit source: Disney Hotstar
Follow us

|

Updated on: Oct 15, 2024 | 2:42 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. మా అక్క పుట్టింటికి వచ్చేసింది. నువ్వేమో నన్ను పెళ్లి చేసుకుని బయటకు వచ్చేశావు. మరి ఇలాంటి సమయంలో మా అమ్మ ఇంత గ్రాండ్‌గా ఎందుకు పెళ్లి రోజు చేసుకుంటుందో నాకు అర్థం కావడం లేదని అప్పూ అంటుంది. అది నాకెలా తెలుస్తుంది. వెళ్లి మీ అమ్మని అడగమని కళ్యాణ్ అంటాడు. వెళ్లి కడిగి పారేస్తానని వెళ్తుంది అప్పూ. కట్ చేస్తే.. రాజ్ ఆఫీస్‌కి వస్తాడు. మేనేజర్ దగ్గరకు వెళ్లి చెప్పు.. ఎందుకు ఫోన్ చేశావని అడుగుతాడు. నేను ఫోన్ చేయడం ఏంటి సర్? మీరు ఈ రోజు బిజీగా ఉన్నారంటే.. మన క్లయింట్స్‌తో మాట్లాడి అపాయిట్మెంట్స్ చేంజ్ చేస్తున్నాని అంటాడు. మరి ఈ నెంబర్ నుంచి ఎవరు ఫోన్ చేశారని రాజ్ అడుగుతాడు. అది నా నెంబర్ కాదని మేనేజర్ అంటాడు. ఏయ్ ఏంటి నాటకాలు ఆడుతున్నావా? అని రాజ్ అంటే.. మీరు ఏదో టెన్షన్‌లో ఉన్నట్టు ఉన్నారని మేనేజర్ అంటాడు. దీంతో రాజ్ ఆలోచనలో పడతాడు. నాకు ఎవరు కాల్ చేశారు? అని అనుకుంటాడు.

కనకంపై అప్పూ అనుమానం..

ఆ తర్వాత అప్పూ లోపలికి రాగానే కనకం కళ్ల జోడు పెట్టుకుని కొబ్బరి బొండం తాగుతూ ఉంటుంది. కొబ్బరి బొండం చాలా.. ఇంకేమన్నా తెప్పించనా అని అప్పూ అంటే.. మా పెళ్లి రోజు సందర్భంగా ఏం ఇచ్చినా తాగుతానని కనకం అంటే.. సరే ఎలకల మందు ఇస్తానులే అని అప్పూ అంటుంది. అదేంటని కనకం ఉలిక్కి పడుతుంది. మరి ఏంటి? ఇప్పుడున్న గొడవల మధ్య నువ్వు పెళ్లి రోజు చేసుకోవడం అంత అవసరమా? అని అడుగుతుంది అప్పూ. ఇవన్నీ నేను ఏర్పాటు చేయలేదు.. మీ బావగారు చేస్తున్నారని కనకం అంటుంది. దీంతో అప్పూ షాక్ అవుతుంది.. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? అని అడుగుతుంది. ఇక్కడ ఏదో జరుగుతుందని అంటుంది. ఇక్కడ జరగడానికి కర్త, ఖర్మ మొత్తం పెద్దమ్మే.. వెనక నుంచి అన్నీ చేస్తుందని అంటాడు బంటీ. ఏంటని అప్పూ అడిగితే.. కనకం చెప్పనివ్వదు. అప్పుడే కృష్ణమూర్తి వస్తాడు. అన్నీ సక్రమంగా జరిగితే నిన్నే పండగకు పిలిచి చీర సారె పెట్టాలి. అల్లుడు గారు ఏరని కృష్ణమూర్తి అడిగితే.. బయట ఉన్నారని అప్పూ చెబుతుంది. దీంతో కృష్ణమూర్తి బయటకు వెళ్తాడు.

ఫాలో అవుతున్న రుద్రాణి.. మాస్టర్ ప్లాన్..

ఆ తర్వాత అపర్ణ, ఇందిరా దేవిలు మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ల వెనుక రుద్రాణి ఫాలో అవుతుంది. ఎవరో ఉన్నారని పక్కకు వెళ్తారు. వీళ్లు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఎక్కడికి వెళ్లిపోయారని రుద్రాణి అనుకుంటుంది. ఇంతలో రాహుల్ వస్తాడు.. ఎందుకు మామ్ టెన్షన్ పడుతున్నావ్? అని అడుగుతాడు. ఏదో జరుగుతుందిరా.. ఇక్కడికి రాజ్ ఎందుకు తీసుకొచ్చారు? రాజ్ ఏం చెప్తే ఒప్పుకున్నాడు? కనకం ఏదో గ్యాబ్లింగ్ చేసిందని రుద్రాణి అనుకుంటుంది. నువ్వు స్వప్నను కూడా కనిపెడుతూ ఉండు.. ఏదో ఒకటి చేసి.. ఈ ఫంక్షన్‌ చివరిలో పెంట పెట్టాలని రుద్రాణి అంటుంది.

ఇవి కూడా చదవండి

రాజ్‌కు కావ్య విలువ తెలిసేలా చేసిన అపర్ణ..

ఆ తర్వాత.. రాజ్ కోసం అపర్ణ, ఇందిరా దేవిలు, కనకం వెయిట్ చేస్తారు. రాజ్ రాగానే కనకాన్ని లోపలికి వెళ్లమంటుంది. వెళ్లిన పని ఏమైందని ఇందిరా దేవి అడిగితే.. ఏమీ లేదని రాజ్ లోపలికి వెళ్తాడు. అసలు మేనేజర్ నీకు ఫోనే చేయలేదు అనుకుంటా అని అపర్ణ అంటే.. నీకెలా తెలుసు మమ్మీ అని రాజ్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ ఫోన్ చేయించింది నేను. ఆఫీస్ నుంచి నీకు ఫోన్ వస్తే నువ్వెలా వదిలి వెళ్లావో.. ఆ రోజు కావ్య కూడా అలానే వెళ్లింది.. కానీ నా అనుమతి తీసుకుని వెళ్లింది. నీకు ఉన్న బాధ్యతే.. కావ్యకు కూడా ఉంది. మనది అనుకున్నది కాబట్టే.. కావ్య ఆ రోజు బాధ్యత తీసుకుంది. కావ్య అదే మాట చెప్తే.. మై ఫుట్ అన్నావు కదరా.. ఇప్పుడు ఆ పదం వెనక్కి తీసుకోగలవా.. మేనేజర్‌తో మేము ఫోన్ చేయించినట్టే.. కావ్యకు కూడా ఎవరో ఫోన్ చేయించినట్టే కదా అని పెద్దావిడ అంటుంది.

మారిన రాజ్.. పుల్ల వేసిన రుద్రాణి..

నా కోడలితో నేను ఇంతకు ముందు ఎంత కఠినంగా ఉన్నానో నీకు తెలుసు కదా.. ఇప్పుడు అదే నేను నీ భార్య గురించి మంచిగా చెబుతున్నాను. నా కోడలి ఎలాంటిదో నా అనుభవం నేర్పింది. ఈ సంఘటన నీకు కూడా నేర్పిస్తుంది అనుకుంటున్నా అని అపర్ణ అంటుంది. అప్పుడే రాజ్ కావ్య చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. ఈ మాటలు విన్న రాజ్.. పువ్వులు పెట్టేందుకు ఇబ్బంది పడుతున్న కావ్యని ఎత్తుకుంటాడు. అది చూసి కనకం, అపర్ణ, ఇందిరా దేవిలు సంతోష పడగా.. రుద్రాణి వచ్చి షాక్ అవుతుంది. ఏంటిది కిందకు దించమని కావ్య అంటుంది. దింపడానికి కాదు ఎత్తుకుంది.. త్వరగా కట్టు.. మోయలేకపోతున్నా అని అంటాడు రాజ్. అప్పుడే కావ్య పూల దండ పెడుతుండగా మళ్లీ కిందకు వచ్చి వీళ్లద్దరి మెడలో పడుతుంది. రుద్రాణిని చూడగానే ఆ దండ తీసి పక్కకు వేస్తాడు రాజ్. ఆ తర్వాత కనకం, కృష్ణమూర్తిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చొబెడతారు. కావ్య, రాజ్‌లు కలిసి పూల దండలు ఇస్తారు. కనకం వాళ్లు మార్చుకుంటారు. ఆ తర్వాత కేక్ కట్ చేయిస్తారు. అందరూ ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు? కట్ చేస్తే.. ఇలా మారిపోయిన స్టార్
చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు? కట్ చేస్తే.. ఇలా మారిపోయిన స్టార్
TGPSC గ్రూప్‌ 1 మెయిన్స్‌కు లైన్ క్లియర్‌.. హైకోర్టు సంచలన తీర్పు
TGPSC గ్రూప్‌ 1 మెయిన్స్‌కు లైన్ క్లియర్‌.. హైకోర్టు సంచలన తీర్పు
పచ్చి మిర్చితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
పచ్చి మిర్చితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
గుట్టలా మారిన పొట్టకు ఛూమంత్రం.. ఈ జ్యూస్‌ తాగితే హాంఫట్..
గుట్టలా మారిన పొట్టకు ఛూమంత్రం.. ఈ జ్యూస్‌ తాగితే హాంఫట్..
జగ్గారెడ్డి వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి.? పోటీ చేయనని ఎందుకన్నారు
జగ్గారెడ్డి వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి.? పోటీ చేయనని ఎందుకన్నారు
అమెరికాలో ఉండే తెలుగు విద్యార్థుల కోసం ఆహా సరికొత్త నిర్ణయం..
అమెరికాలో ఉండే తెలుగు విద్యార్థుల కోసం ఆహా సరికొత్త నిర్ణయం..
మీ కాలి రెండో బొటనవేలు పెద్దదా.? వ్యక్తిత్వం ఇదే
మీ కాలి రెండో బొటనవేలు పెద్దదా.? వ్యక్తిత్వం ఇదే
బాబోయ్‌.. గోతులు తీసే పామును ఎప్పుడైనా చూశారా..? షాకింగ్‌ వీడియో
బాబోయ్‌.. గోతులు తీసే పామును ఎప్పుడైనా చూశారా..? షాకింగ్‌ వీడియో
రవి నీచత్వంతో ఆ రాశుల వారికి కొత్త సమస్యలు.. పరిహారాలు ఇవే..
రవి నీచత్వంతో ఆ రాశుల వారికి కొత్త సమస్యలు.. పరిహారాలు ఇవే..
లక్కీ ఛాన్స్ అంటే వీళ్లదే గురూ..! భార్యభర్తలకు ఆరు మద్యం దుకాణాలు
లక్కీ ఛాన్స్ అంటే వీళ్లదే గురూ..! భార్యభర్తలకు ఆరు మద్యం దుకాణాలు
చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు? కట్ చేస్తే.. ఇలా మారిపోయిన స్టార్
చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు? కట్ చేస్తే.. ఇలా మారిపోయిన స్టార్
ఆ ఊరిపై పాములు పగబట్టాయా.? ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పాములే.
ఆ ఊరిపై పాములు పగబట్టాయా.? ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పాములే.
వీడిని కొడుకు అంటారా.? తండ్రిని భిక్షమెత్తుకునేలా చేసిన వ్యక్తి..
వీడిని కొడుకు అంటారా.? తండ్రిని భిక్షమెత్తుకునేలా చేసిన వ్యక్తి..
గుడిలో శ్లోకాలు చదువుతున్న మహిళలు.. చేతివాటం చూపించిన దొంగ
గుడిలో శ్లోకాలు చదువుతున్న మహిళలు.. చేతివాటం చూపించిన దొంగ
దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీకి మరో గండం
దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీకి మరో గండం
తీవ్ర విషాదం.. దాహం తీర్చాల్సిన నీరే.. ప్రాణం తీసింది.. ఎక్కడంటే
తీవ్ర విషాదం.. దాహం తీర్చాల్సిన నీరే.. ప్రాణం తీసింది.. ఎక్కడంటే
స‌ల్మాన్ తో సాన్నిహిత్యమే.. సిద్ధిఖీ హ‌త్య‌కు దారి తీసిందా ??
స‌ల్మాన్ తో సాన్నిహిత్యమే.. సిద్ధిఖీ హ‌త్య‌కు దారి తీసిందా ??
ఇక్కడ ఆటో సర్వీస్‌ లాగే.. అక్కడ విమాన సర్వీసులు..
ఇక్కడ ఆటో సర్వీస్‌ లాగే.. అక్కడ విమాన సర్వీసులు..
బంగారు సింహాసనంపై.. బొబ్బిలి రాజుగారు..
బంగారు సింహాసనంపై.. బొబ్బిలి రాజుగారు..
గర్ల్‌ఫ్రెండ్‌ను డ్రైవ్‌‌కి తీసుకెళ్లాలంటే.. కారు కొట్టేయాలా !!
గర్ల్‌ఫ్రెండ్‌ను డ్రైవ్‌‌కి తీసుకెళ్లాలంటే.. కారు కొట్టేయాలా !!