Brahmamudi, November 6th Episode: మారని మొగుడు.. ఆటో బాంబ్ పేల్చేందుకు అంతా సిద్ధం!

దీపావళి పండుగ పేరు చెప్పి కావ్యని ఇంటికి తీసుకొస్తారు. కానీ అప్పటికే కావ్య ఉన్నట్టు ఇమేజేషన్‌లో ఉంటాడు రాజ్. కావ్య నిజంగా వచ్చినా రాలేదనుకుంటాడు. ఇక్కడికి ఎవరు నువ్వు? అని అడుగుతాడు. సిఈవోని ఇంటికి పిలిచారని అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఇంట్లో ఆటో బాంబ్ పేల్చడానికి రుద్రాణి, అనామిక ప్లాన్ చేస్తారు..

Brahmamudi, November 6th Episode: మారని మొగుడు.. ఆటో బాంబ్ పేల్చేందుకు అంతా సిద్ధం!
BrahmamudiImage Credit source: Disney Hot star
Follow us

|

Updated on: Nov 06, 2024 | 12:39 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్‌ని పండగకు రమ్మని ప్రకాశం, ధాన్యలక్ష్మిలు పిలుస్తారు. సరే ఆలోచిస్తానని కళ్యాణ్ అంటాడు. ఏంటండీ ఇలా అంటున్నారని ధాన్య లక్ష్మి అంటే.. కొడుకుని పిలిచి కోడల్ని పిలవడం మర్చిపోయావని కళ్యాణ్ అంటాడు. ఇంత దూరం వచ్చి నిన్ను మాత్రమే పిలిస్తే రావని నాకు తెలుసు. అందుకే పండక్కి నిన్ను రమ్మని పిలవడానికి వచ్చానని ధాన్యలక్ష్మి అంటుంది. రేయ్ ఇంకా అర్థం కాలేదా? మీ ఇద్దర్నీ పిలవడానికే వచ్చామని ప్రకాశం అంటాడు. సరే అని కళ్యాణ్, అప్పూలు అంటారు. ఇక తెల్లవారుతుంది. ఇందిరా దేవి వచ్చి చూసేసరికి రాజ్ పడుకుని ఉంటాడు. ఇక రాజ్‌ని లేపుతుంది. అయినా రాజ్ లేవడు. దీంతో నీళ్లు కొట్టి లేపుతుంది ఇందిరా దేవి. ఏంటి నువ్వు చేసిన పని.. పండగ పూట మీకు పని ఉంటుంది. కానీ మాకు పనేంటి? అని రాజ్ అంటే.. ఇంతకు ముందు నీ పెళ్లాం ఇంట్లో పని అంతా చేసేది. కానీ తమరు ఎగ్జిట్ పాస్ ఇచ్చి పంపేశారు కదా.. అందుకే చాలా పని ఉంది లే అని ఇందిరా దేవి అంటుంది. ఇంట్లో అంత మంది ఉన్నారు కదా.. నేనే చేయాలా? అని రాజ్ అంటాడు.

రాజ్ ఇమేజషన్‌లో కావ్య..

ఇంట్లో అంత మంద ఉన్నా.. వయసు మళ్లి.. మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు నాన్నా.. నువ్వు తప్ప మాకు మరో దిక్కు లేదు. గంటలో పూజ చేయాలి. ఈలోపు ఇంట్లో డెకరేషన్ మొత్తం అయిపోవాలని ఇందిరా దేవి ఆర్డర్ వేసి వెళ్తుంది. ఆ కళావతే చేసినప్పుడు నేను చేయలేనా? అని రాజ్ లేస్తాడు. ఇక ఇంట్లో డెకరేషన్ చేస్తూ ఉంటాడు. ఎలా ఉండేవాళ్లం.. బిలియనర్‌లా ఉండేవాళ్లం బికారిని చేశారని రాజ్ తిట్టుకుంటాడు. అప్పుడే కల కంటూ ఉంటాడు. ఇంటి గుమ్మం దగ్గర కళావతి పూల దండ కడుతుండగా అందదు. అప్పుడే వచ్చిన రాజ్ ఏంటి ఆకాశానికి ఎగురుతున్నావా అని అడుగుతాడు. కాదు.. సహాయం చేయాలి. ఏంటి నక్షత్రాలు తీసుకు రావాలా అని రాజ్ అడిగితే.. కావ్య అర్థం లేని సమాధానం ఇస్తుంది. రాజ్ కూడా గుమ్మానికి పూల దండ కడుతుంటే అందదు. మిస్టర్ హస్బెండ్ మీ వల్ల కాదు కానీ.. నన్ను ఎత్తుకోండి కడతానని కావ్య అంటే.. నిన్నా నేనా నో అని రాజ్ అంటాడు. సరే నేనే మిమ్మల్ని ఎత్తుకుంటానని ఎత్తుకుంటుంది కావ్య. అప్పుడే రాజ్ పడిపోతుండగా.. కావ్య పట్టుకుని ఇద్దరూ కళ్లలో కళ్లు పెట్టుకుని చూసుకుంటారు. అదంతా కల.. అని పనిలో నిమగ్నం అవ్వాలని రాజ్ అనుకుంటూనే ఏవండీ అని కావ్య పిలుస్తుంది.

చెంబు ఫేస్ వేసుకుని ఇక్కడికీ వచ్చేశారా..

ఈ డెకరేషన్ పని అంతా చేసి నడుము డ్యాన్స్ ఆడుతుంది. కొద్దిగా హెల్ప్ చేయమని కావ్య అంటే.. నేనా నీకా ఇక్కడ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఎండీ అని అంటాడు. అప్పుడే రాజ్ వెళ్తుండగా ఏవండీ బొద్దింక అని కావ్య అరుస్తుంది. దీంతో రాజ్ కావ్య చంక ఎక్కుతాడు. కాక్‌రోచ్‌కి ఇంత భయ పడతారు అని తెలిస్తే.. మీ మీదకు రోజుకో ఒకటి వదులుతాను కదా.. అని కావ్య అంటుంది. అలా రాజ్ కల కంటూ ఉంటాడు. అప్పుడే కావ్య ఆటోలో నుంచి దిగుతుంది. ఇదేంటి మళ్లీ నా ఇమేజనేషన్‌లోకి వస్తుందని రాజ్ అనుకుంటాడు. అప్పుడే కావ్యకి తాను వెళ్లిన విషయం గుర్తుకు వస్తుంది. నా ఇమేజనేషన్‌లోకి కూడా వీళ్లు చేరారేంటి? ఇస్తా వాళ్లకు అంటూ కావ్య చుట్టూ తిరుగుతాడు రాజ్. అపర్ణ, ఇందిరా దేవిలు మాట్లాడబోతుండగా.. మీరు ఆగండి.. ఇది నా ఇమేజనేషన్.. ఇందులో మీకు మాటలు లేవని రాజ్ అంటాడు. ఏంటి అలా చూస్తున్నావ్? ఈ అత్తాకోడళ్లతో చేరే సరికి తెగ ధైర్యం వచ్చేసింది కదా.. ఆఫీసులో ఎలాగో తమ చెంబు ఫేసే చూస్తున్నాం కదా.. మళ్లీ ఇక్కడికి ఏంటి? ఈ సన్నివేశానికి ఫుల్ రైట్స్ నావే అంటూ రాజ్ అంటాడు.

ఇవి కూడా చదవండి

దీపావళి పూజకు సిఈవో వచ్చారు..

ఒక్క నిమిషం అంటూ కావ్య గట్టిగా రాజ్‌ని గిల్లుతుంది. ఇదేంటే తేలు కుట్టినట్టు ఉంది. రాక్షసి అంటూ తిడతాడు. ఊహలో కూడా నీ డ్యామినేషనే అంటూ రాజ్ వెళ్లిపోతాడు. ఇదీ వరస.. ఊహలో కూడా ఆయన నా డ్యామినేషన్ భరించలేకపోతున్నారు. ఇక ఇప్పుడు ఇంటికి పిలిచారు.. ఆయన్ని రెచ్చగొట్టినట్టే కదా అని కావ్య అంటుంది. ఇక రాజ్ వెళ్తూ ఆగి.. ఏంటి ఇది నిజంగానే వచ్చినట్టు ఉంది. ఏయ్ ఎవరు నువ్వు? అని రాజ్ అంటాడు. మన కంపెనీ సిఈవోని దీపావళి పూజకు రమ్మని చైర్మన్ గారు పిలిచారని అపర్ణ అంటే.. అంటే ఇదెక్కడి ఆచారం.. పిలిచారని వెంటనే వచ్చేయడమేనా అని రాజ్ అంటే.. ముందు వెళ్లి స్నానం చేయమని కావ్య అంటుంది. మిగతావన్నీ మేము చూసుకుంటాం కానీ.. నువ్వు రా అని ఇంట్లోకి తీసుకెళ్తారు.

యుద్ధం చేయడానికి సిద్ధమే..

ఆ తర్వాత రుద్రాణికి అనామిక ఫోన్ చేస్తుంది. నేను చెప్పిందానికి సిద్ధంగా ఉన్నారా అని అనామిక అంటే.. నేను ఎప్పుడూ యుద్ధానికి సిద్ధమే.. ఇంతకీ ఆ బాంబ్ ఏంటని రుద్రాణి అడిగితే.. ఆటో బాంబ్ అని అనామిక అంటుంది. నా మాజీ మొగుడు కళ్యాణ్ ఆటో నడుపుతున్నాడు. అది న్యూస్‌లో టెలికాస్ట్ అయ్యేలా మొత్తం ప్లాన్ చేసి పెట్టాను. కానీ అది టెలికాస్ట్ అయ్యే సమయానికి అందరూ టీవీ చూసేలా మీరే చేయాలని అనామిక చెబుతుంది. ఇంత మంచి అవకాశం వస్తే వదులుకుంటానా? అది చూసి ధాన్య లక్ష్మి రెచ్చిపోతుంది. ఆ అగ్నికి ఆజ్యం పోసి మొత్తం తగులబెట్టేస్తానని రుద్రాణి అంటుంది. అలా చేసే అవకాశం ఉంది కాబట్టే మీకు చెప్పానని అనామిక అంటుంది. అప్పుడే పక్క నుంచి బాంబ్ పేలుస్తుంది స్వప్న. దానికి రుద్రాణి బయపడి చస్తుంది. కొంపలు కూల్చేసే మీకు ఈ సర్ ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నా హ్యాపీ దివాలి అని స్వప్న చెబుతుంది. నీ బొందలా ఉంది అవతలకు పో అని రుద్రాణి అంటుంది.

కోడలి చిలిపి చేష్టలు..

ఆ తర్వాత సుభాష్‌కి పాయసం తీసుకొచ్చి ఇస్తుంది అపర్ణ. చేతులు ఖాళీ లేదు నువ్వే తినిపించమని సుభాష్ అంటాడు. నేనా సరేలే అని పెట్టబోతుండగా.. కావ్య వస్తుంది. సూపర్‌గా ఉంది.. ఏది ఫొటో తీస్తానని కావ్య ఆట పట్టిస్తుంది. ఏయ్ పిల్లా.. అడక్కుండగానే లోపలికి వచ్చిందే కాకుండా.. ఫొటో తీస్తావా? ఏది కర్ర ఏది అని అపర్ణ అంటుంది. కావ్య తిరిగి ఇంటికి వచ్చేస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది కదా అని సుభాష్ అంటే.. కావ్య చుట్టం చూపుగా రావడం నాకూ నచ్చలేదు. రాజ్ మనసు మారి కావ్యని ఉండిపోమ్మంటే బాగుండు అని అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఇందిరా దేవి వచ్చి బోనస్‌లు ఇస్తుంది. నువ్వే ఇవ్వాలని అన్నీ చూసుకోమని చెబుతుంది. ఇక ఇక్కడితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..