Brahmamudi, November 5th Episode: దుగ్గిరాల ఇంటి పరువు తీసేలా అనామిక ప్లాన్.. రెచ్చిపోయిన రుద్రాణి!

దుగ్గిరాల ఫ్యామిలీని రోడ్డు మీదకు లాగడానికి ప్లాన్ చేస్తుంది అనామిక. కళ్యాణ్‌ జీవితాన్ని బయట పెట్టాలని చూస్తుంది. ఇక దీపావళి పండుగను ఇంట్లోని అందరితో జరుపుకోవాలని ఇందిరా దేవి ప్లాన్ వేస్తుంది. ఈ మేరకు వెళ్లి కావ్యని పిలుస్తుంది. మరోవైపు వీళ్ల ఆనందాన్ని చెడగొట్టాలని అనామిక, రుద్రాణి కలిసి మరో ప్లాన్ చేస్తారు..

Brahmamudi, November 5th Episode: దుగ్గిరాల ఇంటి పరువు తీసేలా అనామిక ప్లాన్.. రెచ్చిపోయిన రుద్రాణి!
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Nov 05, 2024 | 12:44 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్‌ మీద డ్యాక్యుమెంటరీ తీయమని అనామిక యాడ్ ఫిల్మ్ డైరెక్టర్‌కి డబ్బులు ఇచ్చి పంపుతుంది. ఆ తర్వాత నీతో కలిసి బిజినెస్‌ని పైకి తీసుకెళ్తానని చెప్పాను.. కానీ అని సామంత్ అంటే ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావ్? అనుకున్నట్టుగానే పదేళ్లుగా రాని అవార్డు మనకు వచ్చింది కదా అని అనామిక అంటే.. ఆ తర్వాత 30 కోట్లు లాస్ చేశావని సామంత్ అంటాడు. సామంత్ కూల్.. ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగాలంటే పెద్ద యుద్ధమే చేయాలని అంటుంది. ఈ యూద్ధంలో నేను చనిపోకుండా ఉంటే చాలని సామంత్ అనుకుంటాడు. ఆ తర్వాత సీతారామయ్య దగ్గరకు వచ్చిన ఇందిరా దేవి.. వెళ్లిపోయిన క్లయింట్స్ అందరూ మళ్లీ వచ్చారట. వారితో కావ్య అగ్రిమెంట్స్ కూడా చేయించుకుందని చెబుతుంది. అవునా పండగ వేళ అంతా మంచే జరిగిందని అంటాడు. అయితే మన గెస్ట్ హౌస్‌లో పండుగకు ఏర్పాట్లు చేసి.. ఉద్యోగులకు బోనస్ ఇద్దాం. అలాగే కావ్య చేత బోనస్‌లు ఇప్పిద్దామని సీతారామయ్య అంటాడు.

రుద్రాణికి.. స్వప్న గడ్డి..

ఈసారి పండుగను మన ఇంట్లోనే చేద్దాం. అవకాశం దొరికినప్పుడు వాడుకోవాలి. ఇప్పుడు ఈ పండగను అడ్డం పెట్టుకుని కావ్యని ఇంటికి తీసుకురమ్మని పిలుద్దామని ఇందిరా దేవి అంటుంది. సరే అని హాలులోకి వస్తారు. ప్రతీ సంవత్సరం ఇచ్చినట్టే ఈసారి కూడా ఉద్యోగస్తులకు బోనస్‌లు ఇద్దామని ఇందిరా దేవి, సీతారామయ్య అంటారు. అసలే కంపెనీ నష్టాల్లో ఉంటే ఇప్పుడు బోనస్‌లు ఇవ్వడం ఎందుకు దండగ అని రుద్రాణి అంటే.. మన ముగ్గురిని ఊరికే ఇంట్లో కూర్చోబెట్టి మేముతున్నారు కదా.. ఇలా ఎంప్లాయిస్‌కి బోనస్‌లు ఇస్తే తప్పేంటి అని స్వప్న గడ్డి పెడుతుంది. ఆ తర్వాత మన కంపెనీకి లాభాలు తీసుకొచ్చిన కావ్య చేత మన ఇంట్లోనే బోనస్‌లు ఇప్పిద్దామని సీతారామయ్య చెబితే.. ఆవిడ ఇప్పుడు ఏం ఘనకార్యం చేసిందని ఇవ్వడానికి.. నాకు ఇష్టం లేదని రుద్రాణి అంటుంది. అవును మావయ్య గారు ఎప్పుడూ ఇచ్చినట్టే మీరు ఇవ్వడమే మంచిదని ధాన్యలక్ష్మి కూడా అంటుంది.

ధాన్య లక్ష్మి ప్రేమ..

కంపెనీకి రూ.15 కోట్ల లాభం తీసుకొచ్చి పెట్టింది. అలాగే వెళ్లిపోయిన క్లయింట్స్ అందర్నీ తీసుకొచ్చి అగ్రిమెంట్ చేయించింది. కాబట్టి తన చేతుల మీదుగా ఇవ్వడమే న్యాయమని సుభాష్ అంటాడు. నా కొడుకు ఇంట్లోంచి వెళ్లి పోయి ఇన్ని రోజులు అయింది. వాడిని తిరిగి ఇంటికి తిరిగి తీసుకు రావాలని ఒక్కైరనా ఆలోచించారా.. పండక్కి తీసుకు రావాలని ఒక్కరైనా అన్నారా అని ధాన్య లక్ష్మి అంటుంది. కళ్యాణ్ ఇంట్లోంచి వెళ్లిపోవడానికి కారణం ఎవరు? నువ్వు.. కానీ కళ్యాణ్‌ని ఇంటికి రప్పించాలని చూసింది ఎవరు? మేమందరం.. కానీ ఇంటికి వచ్చిన వాడిని అవమానించి పంపించింది ఎవరు? నువ్వు.. కాబట్టి వాడిని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత ఎవరికి ఉంది నీకు అని ఇందిరా దేవి చెబుతుంది. కరెక్ట్‌గా చెప్పావు అమ్మా.. నా కొడుకుని, కోడల్ని ఇంటికి తీసుకొస్తాను.. ఎవరు వచ్చినా రాకపోయినా నేను వెళ్తానని ప్రకాశం అంటాడు. ఆగండి.. నేను కూడా వస్తానని ధాన్యలక్ష్మి కూడా వెళ్తుంది.

ఇవి కూడా చదవండి

కావ్య కోసం ఇందిరా దేవి ఆరాటం..

నేను వెళ్తే రానంటుంది. లాటి పెట్టి ఒక్కటి ఇచ్చి తీసుకు రావాల్సి ఉంటుందని అపర్ణ అంటే.. అంత వయెలెన్స్ ఎందుకులే అపర్ణ.. నచ్చజెప్పి తీసుకు రావాలని సుభాష్ అంటే అందుకు అత్తయ్యే వెళ్లాలని అపర్ణ చెబుతుంది. సరే అని ఇందిరా దేవి కావ్య దగ్గరకు వెళ్తుంది. పండగకు నిన్ను ఇంటికి పిలవడానికి వచ్చానని ఇందిరా దేవి అంటుంది. నేనా దీపావళికి వస్తే మీ మనవడి కళ్లలోనే టపాసులు పేలతాయి. అది మీకూ తెలుసు. ఆఫీసు కంటే మీ అందరి బలవంతంగా వెళ్లాను. కానీ ఇంటికి వస్తే మామూలుగా ఆడుకోరని కావ్య అంటుంది. అందుకే ఇంటి కోడలిగా కాదు.. కంపెనీ సిఈవోగా రా.. ప్రతీ సంవత్సరం ఎంప్లాయిస్‌కి బోనస్‌లు ఇస్తూ ఉంటాం. కానీ ఈసారి ఇంటి దగ్గర ఇవ్వాలని ప్లాన్ చేశామని ఇందిరా దేవి అంటుంది. అమ్మమ్మా ఇది మీరూ, అత్తయ్య కలిసి ప్లాన్ చేసారా అని కావ్య అడుగుతుంది. ఏంటి మేము ఎలా కనిపిస్తున్నామని ఇందిరా దేవి సీరియస్ అవుతుంది. మరోవైపు క్యాన్సర్ కనకం కావ్యని తికమక పెడుతూ వస్తుంది. మరోవైపు కావ్యని ఇంటికి వెళ్లమని కృష్ణమూర్తి అంటాడు. ఇక తప్పదు అన్నట్టుగా కావ్య వస్తానని అంటుంది.

కళ్యాణ్ ఇంటికి ధాన్య లక్ష్మి..

మరోవైపు కళ్యాణ్, అప్పూలను పండక్కి పిలవడానికి ప్రకాశం, ధాన్య లక్ష్మిలు కలిసి ఇంటికి వస్తారు. వాళ్లను చూసి కళ్యాణ్, అప్పూ ఎంతో ఆనందిస్తారు. కళ్యాణ్ ఉండే ఇంటిని చూసి ప్రకాశం, ధాన్యం చాలా బాధ పడతారు. నన్ను నేను ఫ్రూవ్ చేసుకోవాలంటే ఇవన్నీ తప్పదని కళ్యాణ్ అంటాడు. సరేలే.. దీపావళి పండక్కి నిన్నూ, అప్పూని పిలవడానికి వచ్చాం. పాపం మీ అమ్మ చాలా బాధ పడుతుందని ప్రకాశం చెప్తాడు. అమ్మ తన నోటితో చెప్పలేదని కళ్యాణ్ అంటే.. ఇక్కడి దాకా వచ్చాను.. కానీ ఆ మాత్రం నీకు అర్థం కాలేదా? అని ధాన్య లక్ష్మి అంటుంది. కేవలం కొడుకుని పిలిచి.. కోడల్ని పిలవడం మర్చిపోయావని కళ్యాణ్ అంటాడు. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..