Brahmamudi, November 18th Episode: కావ్య డిజైన్స్ దొంగిలించనున్న రాజ్.. ధాన్యలక్ష్మి వేరే కుంపటి!
డిజైన్స్ వేయడానికి రాజ్ చాలా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ మంచిగా డిజైన్స్ గీయలేక పోతాడు. ఈ క్రమంలోనే కావ్య వేసిన డిజైన్స్ కొట్టేద్దామని ఫిక్స్ అవుతాడు. మరో వైపు ధాన్యలక్ష్మి ఇంట్లో వేరే కుపంటి పెడుతుంది..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్య ఇంట్లో డిజైన్స్ వేస్తూ ఉంటుంది. అప్పుడు రాజ్ ఆఫీసులో నడుము పట్టుకోవడం, పడిబోతుండగా పడిపోవడం గుర్తుకు వస్తాయి. వెంటనే అలెర్ట్ అయి.. అమ్మో ఏంటి ఇవన్నీ గుర్తుకు వస్తున్నాయి? మనకు డిజైన్స్ తప్ప ఇంకేం గుర్తుకు రాకూడదని అనుకుంటుంది. ఆ తర్వాత బయట కృష్ణమూర్తి పని చేస్తుండగా.. కింద ఏదో పడి పోతుంది. వెంటనే కనకం వచ్చి.. మీకు బుద్ధి ఉందా? కావ్య డిజైన్స్ వేస్తుంది కదా.. అసలే కోట్ల రూపాయలవి.. అని అంటుంది. కావ్య గదిలో ఉంది కదే.. ఈ చిన్న సౌండ్‌కే డిస్టర్బ్ అవుతుందా? అని కృష్ణమూర్తి అంటాడు. మెల్లగా మాట్లాడండి.. డిజైన్స్ వేయడం అంటే.. మట్టి కుండల మీద వేయడం అనుకుంటున్నారా.. అది ఒక తపస్సు అని అంటుంది. అయినా ఇప్పుడు ఈ పాత టేపు రికార్డర్ రిపేర్ చేయకపోతే ఇప్పుడు నష్టమా అని అడుగుతుంది. ఆ తర్వాత కావ్య గదిలోకి నెమ్మదిగా వెళ్లి.. భోజనం పెడుతుంది. ఏంటమ్మా గదిలోకి తీసుకొచ్చాం.. నేను కూడా మీతో పాటు తినేదాన్ని కదా అని కావ్య అంటుంది. బయటకు వస్తే నీకు ముచ్చట్లు ఎక్కువ అవుతాయి.. నీకు ఇప్పుడు వేరే ఆలోచన రాకూడదని కనకం అంటుంది.
డిజైన్స్ కోసం రాజ్ పాట్లు..
కట్ చేస్తే.. రాజ్ కూడా డిజైన్స్ గురించి ఆలోచిస్తూ ఉండగా.. కావ్యని పట్టుకున్న సంగతి గుర్తుకు వచ్చి నవ్వుకుంటాడు. నాకు ఆ ఆలోచనలు గుర్తుకు రావడం ఏంటి? అంటూ పని చూసుకుంటాడు. అప్పుడే అంతరాత్మ బయటకు వచ్చి రాజ్‌పై కుండీ ఎత్తుతాడు. రేయ్ ఏంట్రా ఇది అని రాజ్ భయపడతాడు. హత్యాప్రయత్నం.. ఏరా కనీసం ఊహలోకి కూడా పెళ్లాన్ని రానివ్వవా.. అని అడుగుతుంది. రేయ్ ఏంటి ఈ ఎంట్రీలు ఆపవా? నేను అబద్ధాలు చెప్పను.. కళావతి విషయంలో నా నిర్ణయం మారదని రాజ్ అంటాడు. మారావా నువ్వు.. అయితే చూడు ఈ అంతరాత్మ ప్రేతాత్మగా మారి నిన్ను పీక్కు తింటాను. వెంటాడి వేధిస్తానని బెదిరిస్తుంది. రేయ్ నువ్వు నాతోనే ఉంటూ నన్ను వెన్ను పోటు పొడుస్తావా? పో అని రాజ్ అంటాడు. పొమ్మంటే పుట్టింటికి పోవడానికి నేనేమన్నా నీ పెళ్లాన్నా.. అంతరాత్మని.. నిన్ను ఓడించేదాకా నిద్రపోనని అంతరాత్మ అంటుంది. రేయ్ నేను ఓడిపోతే కళావతి గెలుస్తుంది రా అని రాజ్ అంటే.. అంతర్మాత ఊహల్లోకి వెళ్తుంది. ఇక రాజ్ బెదిరించి అంతరాత్మని పంపించేస్తాడు.
ధాన్యలక్ష్మికి అపర్ణ ఓదార్పు..
ఆ తర్వాత ధాన్యలక్ష్మి బయట కూర్చొని బాధ పడుతూ ఉంటుంది. అది చూసిన అపర్ణ.. ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్తుంది. నాకు తెలుసు.. నీకు మా అందరి మీద కోపంగా ఉంది. నీకు ఏం చెప్పినా ఇప్పుడు నీకు అర్థం కాదని అంటుంది. అర్థమైంది కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. తోడబుట్టకపోయినా.. మనం అక్కాచెళ్లెలానే ఉంటున్నాం కదా.. నువ్వు తిండి మానేసి బాధ పడుతుంటే నాకు బాధగా ఉంటుంది కదా అని అపర్ణ అంటే.. నా సమస్యను పరిష్కరిస్తేనే కదా తీరుతుందని ధాన్యలక్ష్మి అంటుంది. నా మాట విను ప్రశాంతంగా ఉండమని అపర్ణ అంటే.. మావయ్య గారు పెట్టిన పరీక్షలో రాజ్ గెలిస్తే కంపెనీకి సిఈవో అవుతాడు. నీ కోడలు గెలిస్తే ఇంటికి వస్తుంది. కానీ దీని వల్ల నాకు వచ్చిన లాభం ఏంటని ధాన్యలక్ష్మి అడుగుతుంది. రాజ్, కావ్యలు కలిస్తే.. కళ్యాణ్‌ని ఇంటికి తీసుకొస్తారు కదా.. వాడు అలా బయట పని చేస్తుంటే మాకు కూడా బాధగానే ఉంటుందని అపర్ణ అంటుంది. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుంది నువ్వు బాధ పడకు అని అపర్ణ అంటుంది. వెనుక నుంచి అంతా వింటుంది రుద్రాణి.
ధాన్యలక్ష్మిని వదిలి పెట్టని రుద్రాణి..
అపర్ణ వెళ్లిపోయాక.. మా వదిన చెప్పిన కళ్లబుల్లి మాటలు విని నమ్మేశావా.. అసలు సమస్య నీది.. నీగురించి పట్టించుకోవడం మానేసి.. వాళ్లను కలపడం ఇప్పుడు అంత అవసరమా.. ఆలోచించు.. నువ్వు కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోతే.. కళ్యాణ్‌ని ఎవరూ పట్టించుకోరని రుద్రాణి అంటుంది. ధాన్యలక్ష్మి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. కట్ చేస్తే.. రాజ్ ఆఫీసుకు వచ్చి డిజైన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మూర్తి అనే ఉద్యోగి వస్తాడు. సార్ ఇందాకటి నుంచి నిల్చున్నా.. ఆ డిజైన్ చెబితే.. గీస్తానని అంటాడు. ఇక రాజ్ ఆలోచించి.. డిజైన్స్ గురించి చెబుతూ ఉంటాడు. మూర్తి గీస్తాడు.. కానీ అవి సరిగా రావు. ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు డిజైన్స్ చెబుతాడు. కానీ ఒక్కటి కూడా సరిగా రావు. చివరికి.. సర్ మీరు ఏమీ అనుకోకపోతే.. కావ్య మేడమ్ వేసే డిజైన్స్.. కలర్స్ చాలా బాగుంటాయని అంటాడు. రేయ్ పని చేయడం రాదు కానీ.. ఎదుటి వాళ్లను పొగుడుతావా అని సీరియస్ అవుతాడు సరేలే ఇక వెళ్లు అని అంటాడు రాజ్. ఆ తర్వాత తన డిజైన్స్ చూసి అబ్బా ఏంటీ ఇలా ఉన్నాయి? వాడు చెప్పింది కూడా నిజమే.. కళావతి వేసిన డిజైన్స్ బాగుంటాయని అనుకుంటాడు. ఛీ ఛీ నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా.. సరేలే కానీ.. ఎలాగైనా కళావతి వేసిన డిజైన్స్ నొక్కేసి.. మా డిజైన్స్‌లా క్లయింట్‌ని మెప్పించి.. ఈ పందెంలో గెలవాలని రాజ్ అనుకుంటాడు.
ధాన్యలక్ష్మి వేరే కుంపటి..
ఆ తర్వాత ఇంట్లో ధాన్యలక్ష్మి ఇంట్లో వంట చేసుకుంటుంది. అక్కడకు వచ్చిన అపర్ణ, ఇందిరా దేవిలు.. అదేంటి? నువ్వు చేస్తున్నావ్? పని మనిషి చేసింది కదా అని అడుగుతారు. మన ఆలోచనలే కలవనప్పుడు.. ఇక వంటలు ఏం నచ్చుతాయి? నాకు నచ్చింది నేను వండుకుంటున్నానని అంటుంది. అంటే వేరే కుంపటి పెడుతున్నావా అని అపర్ణ అంటే.. వేరే కాపురం పెట్టలేదు సంతోషించమని అంటుంది ధాన్యలక్ష్మి. దీంతో గట్టిగా అరుస్తుంది ఇందిరా దేవి. అరవకండి.. ఏం నిర్ణయం తీసుకోకపోతే వేరే కుంపటి కాదు.. ఇల్లే వదిలేసి వెళ్లిపోతానని అంటుంది ధాన్యలక్ష్మి. ఇది దీని పని కాదు.. ఆ రుద్రాణి పని.. తినడానికి వస్తుంది కదా.. దాని పని అప్పుడు చెప్తానని ఇందిరా దేవి అంటుంది. ఇక ఆఫీసులో అందరూ వెళ్లిపోయిన తర్వాత రాజ్ కావ్య ఛాంబర్‌లో ఏం చేస్తుందా అని చూస్తాడు రాజ్. అక్కడ కావ్య, శ్రుతిలు మాట్లాడుకునేది వింటాడు. ఇక వాళ్లు ఇంటికి బయలు దేరతారు. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..