Brahmamudi, July 24th Episode: అప్పూ పెళ్లికి అంతా సెట్.. కళ్యాణ్ మనసులో ప్రేమ బయట పడుతుందా..

|

Jul 24, 2024 | 3:09 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అప్పూ పై రాసిన కవితను చూస్తూ ఉంటాడు కళ్యాణ్. తనని అప్పూ కలవద్దని చెప్పిన తర్వాత కూడా ఇలాంటి సమయంలో తన మనసులోని మాటను ఇప్పుడు చెప్పడం అస్సలు కరెక్ట్ కాదని.. ఆ కవితను మడిచి పక్కన పడేస్తాడు. అప్పుడే మెట్లు ఎక్కుతూ వచ్చిన రాజ్ అది చూస్తాడు. ఆ కాగితం ఏంటా అని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో అప్పూపై కవితను చూస్తాడు. అప్పూపై ఇంత ప్రేమ పెట్టుకుని లేనట్లు ఇంత కాలం నటిస్తావా..

Brahmamudi, July 24th Episode: అప్పూ పెళ్లికి అంతా సెట్.. కళ్యాణ్ మనసులో ప్రేమ బయట పడుతుందా..
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అప్పూ పై రాసిన కవితను చూస్తూ ఉంటాడు కళ్యాణ్. తనని అప్పూ కలవద్దని చెప్పిన తర్వాత కూడా ఇలాంటి సమయంలో తన మనసులోని మాటను ఇప్పుడు చెప్పడం అస్సలు కరెక్ట్ కాదని.. ఆ కవితను మడిచి పక్కన పడేస్తాడు. అప్పుడే మెట్లు ఎక్కుతూ వచ్చిన రాజ్ అది చూస్తాడు. ఆ కాగితం ఏంటా అని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో అప్పూపై కవితను చూస్తాడు. అప్పూపై ఇంత ప్రేమ పెట్టుకుని లేనట్లు ఇంత కాలం నటిస్తావా.. ఎలాగైనా నీ ప్రేమని నేను గెలిపిస్తాను అని అంటాడు రాజ్. మరోవైపు కనకానికి ఫోన్ వస్తుంది. కృష్ణమూర్తి రాగానే కానిస్టేబుల్ సంబంధం అట. ఇల్లు కూడా ఉందట. అప్పూకి ఇంత కంటే మంచి సంబంధం దొరకదని చెబుతుంది. అది అంతా అప్పూ వింటుంది.

ఇక మీ నిర్ణయమే నా నిర్ణయం..

సరే అంతా విన్నావు కదా.. పెద్దమ్మ నీకు మంచి సంబంధం తీసుకొచ్చింది. అబ్బాయి కానిస్టేబుల్ అట.. ఇల్లు కూడా ఉందట.. నిన్ను చూసుకోవడానికి ఇవాళ వస్తున్నారు. ఏమంటావ్ అని కనకం అంటే.. జీవితంలో ప్రతీదీ నేనే నిర్ణయం తీసుకోవాలి అనుకున్నాను. కానీ నా నిర్ణయాల వల్ల అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. ఇప్పటి దాకా మీరు కూడా చాలా బాధ పడ్డారు. ఇక నేను ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకోవడం లేదు. కాబట్టి మీ ఇష్టమే నా ఇష్టం అని చెబుతుంది అప్పూ. దీంతో కనకం ఎంతో సంతోష పడుతుంది. కానీ ఇది తప్పు అనిపిస్తుందని కృష్ణమూర్తి అంటాడు. సరేలే నువ్వు కావ్య, స్వప్నకి ఫోన్ చేసి కలిసి నిర్ణయం తీసుకుందాం. వాళ్లకు ఫోన్ చేసి ఇంటికి రమ్మను అని కృష్ణ మూర్తి అంటాడు.

మనకు పిల్లలు పుడితే ఆ పేర్లు పెట్టండి..

కట్ చేస్తే.. కావ్య, రాజ్‌లు ఇద్దరూ బెడ్ రూమ్‌లో ఉంటారు. కావ్య రెడీ అవుతూ ఉంటుంది. రాజ్ మూతి ముడుచుకుని కూర్చొని ఉంటాడు. ఏంటండీ ఇలా చూస్తున్నారు. ఏంటండీ అలా అమాయకంగా, ఏం తెలీని సుద్దపూసలా చూస్తున్నారేంటి? ఈ రెండు వేళ్లు పట్టుకోమని అంటుంది. ఎందుకని రాజ్ అంటే.. మనకు పుట్టబోయేది ఆడ పిల్ల, మగ పిల్లాడో తెలుసుకుందామని అడిగాను. రాత్రే శోభనం జరిగింది. అప్పుడే పిల్లల దాకా వెళ్లావా? అని రాజ్ అంటాడు. అదేంటండీ శోభనం జరిగితే.. పుట్టబోయేది బిడ్డలే కదా.. ఎవరు పుడితే ఏ పేరు పెట్టాలి? అసలు ఏ ఆస్పత్రిలో పురుడు పోసుకోవాలి? బారసాల మా ఇంట్లోనా.. మీ ఇంట్లోనా అని ఆలోచించాలి కదా.. ఆ.. అన్న ప్రాసణ మాత్రం కాశీలోని అన్నపూర్ణ గుడిలోనే చేయాలి. అక్షరాభ్యాసం.. బాసర సరస్వతి ఆలయంలోనే చేయాలని కావ్య వరుసగా లిస్ట్ చెబుతూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రాజ్‌కి షాక్ ఇచ్చిన కనకం..

మరి పెళ్లి ఎక్కడ చేయాలి? అని రాజ్ అడిగితే. జైపూర్‌లో ఒక కోట బుక్ చేసి అక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్ చేద్దామని కావ్య అంటుంది. మరి శోభనం ఎక్కడ అని రాజ్ అంటే.. మన బూత్ బంగ్లా ఉంది కదా.. పైగా మనకు బాగా అచ్చు వచ్చిందని కావ్య అంటుంది. నీ బొంద అప్పుడే అంత దూరం వెళ్లిపోయావేంటే అని రాజ్ అంటే కావ్య నవ్వుతుంది. అయినా ఇంట్లో అందరికీ మన శోభనం విషయం చెప్పి నా పరువు తీసేశావని రాజ్ అంటాడు. అయ్యో ఈ నిజం అత్తయ్య, అమ్మమ్మ గారికి తప్ప ఎవరికీ తెలీదని కావ్య అంటుంది. ఇంతో కావ్యకి ఫోన్ వస్తుంది. ఎవరు అని రాజ్ అంటే.. కాబోయే అమ్మమ్మ అని కావ్య అంటుంది. దీంతో పిల్లో విసురుతాడు రాజ్. ఫోన్ ఎత్తి అమ్మమ్మా అంటుంది కావ్య. అమ్మమ్మనా ఎవరే అని కనకం అంటే.. ఏం లేదులే అమ్మా చెప్పు అని కావ్య అంటే.. అప్పూకి మంచి సంబంధం కుదిరిందే. నువ్వు, స్పప్న ఇద్దరూ రండి. అల్లుడి గారికి కూడా చెప్పి రమ్మను అని కనకం అంటుంది. మీకు గుడ్ న్యూస్ అండి.. అప్పూకి మంచి సంబంధం ఫిక్స్ అయింది. మిమ్మల్ని కూడా రమ్మని మా అమ్మ ఫోన్ చేసిందని కావ్య అంటుంది. దానికి రాజ్ షాక్ అయి.. నాకు వేరే పని ఉంది మీరు వెళ్లమని అంటాడు.

నువ్వు కళ్యాణ్‌ని పెళ్లి చేసుకుంటే మంచిది..

ఆ తర్వాత అప్పూ దగ్గరకు వచ్చిన బంటీ.. నువ్వు కళ్యాణ్‌ని పెళ్లి చేసుకుంటే మంచిదని అంటాడు. దీంతో అప్పూ షాక్ అవుతుంది. వాడు నన్ను కేవలం ఫ్రెండ్‌లానే చూశాడు. నా ప్రేమ ముగిసిపోయిన గతం. ఇప్పటికే నా వల్ల అమ్మానాన్నలు చాలా బాధ పడ్డారు. కనీసం వాళ్లకు నచ్చినట్టు అయినా పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లిపోతానని అప్పూ అంటుంది. అప్పుడే స్వప్న, కావ్యలు కలిసి కనకం ఇంటికి వస్తారు. అది చూసి కనకం, కృష్ణమూర్తిలు ఎంతో సంతోష పడతారు. ఇక లోపలికి వెళ్లగానే అప్పూ కావ్య, స్వప్నలను చూసి సంతోష పడుతుంది. ఏంటే కానిస్టేబుల్ అవుతానని అన్నావు.. ఇప్పుడు కోడలివి అవుతున్నావా అని కావ్య అంటే.. దీనిలో ఏ యాంగిల్‌లో అయినా ఇంటి కోడలు అని అనిపించుకునే లక్షణం ఉందా అని స్వప్న అంటుంది. ఇక స్వప్న, కావ్యలు ఇద్దరూ కలిసి అప్పూని తయారు చేస్తారు.

అప్పూపై కళ్యాణ్ ప్రేమ బయట పడుతుందా..

మరోవైపు కళ్యాణ్‌లో అప్పూపై ఉన్న ప్రేమను బయటకు తీయడానికి ట్రై చేస్తాడు రాజ్. మొత్తానికి ముగ్గురు అక్కా చెల్లెళ్ల కథ సుఖాంతం అవుతుంది. ఇప్పుడు అప్పూ కథ మొదలైంది. ఏంట్రా నీకు ఈ విషయం తెలీదా? కళావతి, స్వప్న ఆ విషయం నీకేం చెప్పలేదా? అప్పూ కూడా ఫోన్ చేసి ఏమీ చెప్పలేదా? అని అడుగుతాడు రాజ్. లేదు అన్నయ్యా.. అసలు ఏం జరిగింది? అని కళ్యాణ్ టెన్షన్ పడుతూ అడుగుతాడు. ఎవ్వరూ ఏమీ చెప్పలేనప్పుడు నేను చెప్తే ఏం బాగుంటుంది. వద్దులే అని లేచి వెళ్లిపోతాడు రాజ్. ఇంతలా టెన్షన్ పెట్టి ఏమీ చెప్పకుండా వెళ్లిపోతావేంటి? అసలు విషయం చెప్పు అని కళ్యాణ్ అడుగుతాడు. అదేరా అప్పూకి మంచి సంబంధం వచ్చింది. పెళ్లి కొడుకు కూడా బాగున్నాడట అని రాజ్ చెప్పగానే కళ్యాణ్ షాక్ అవుతాడు. ఇప్పుడు ఈ పెళ్లితో మీ ఇద్దరి మధ్య ఏమీ లేదని అర్థం చేసుకుంటారు. అప్పూ లైఫ్ కూడా సెట్ అయిపోతుంది. అప్పూకి పెళ్లి అనగానే కళ్యాణ్ ఎంతో బాధపడతాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.