ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అపర్ణను ఇంట్లోంచి వెళ్లిపొమ్మని కావ్య అంటుంది. ఏంటి కనకం ఈ దౌర్జన్యం? నేను పోను అంటే.. నన్నే ఇంటి నుంచి గెంటేసేలా ఉందేంటి? నీ కూతురు అని అపర్ణ అంటే.. నేను నోరు తెరిచి మాట్లాడితే నా ఇంట్లో నుంచే నన్ను గెంటేస్తుందని కనకం అంటుంది. అంటే నేను మీ ఇద్దరి కళ్లకు రాక్షసిలా కనిపిస్తున్నానా అని కావ్య అడిగితే.. అవును అని కనకం అంటుంది. మీకు తెలీదు అత్తయ్యా మీ అబ్బాయి నేనే మిమ్మల్ని విడాకులు ఇమ్మని చెప్పానట.. మొత్తం నా మీద తోసేశారని కావ్య అంటుంది. తెలీదు.. కానీ ఆ తర్వాత వాడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసు. కాస్త కూల్‌గా ఉండు కోడలి పిల్లా.. అని అపర్ణ అంటే.. ఇక ఆపేయండి.. ఇకనైనా మావయ్య గారికి ఫోన్ చేయమని అంటుంది కావ్య. ఇక ఆపు.. ఏం చేయాలో నాకు తెలుసు.. నేవ్వేం కంగారు పడొద్దని అపర్ణ తిట్టి వెళ్తుంది.
మరోవైపు రాజ్ అపర్ణ విడాకుల గురించి ఆలోచిస్తూ.. నేను బ్రతికి ఉండగా ఈ కుటుంబాన్ని ముక్కలు కానివ్వనని అనుకుని.. ఎవరికో ఫోన్ చేసి నేను చెప్పినట్టు పేపర్స్ రెడీ చేశావా అని అడుగుతాడు. అంతా అయియానని అతను అంటే.. సరేనని అంటాడు. ఇక తెల్లవారుతుంది. కావ్య పూజ చేసి హారతి తీసుకోమని.. అపర్ణ ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక అప్పుడే రాజ్ వస్తాడు. అదిగో వచ్చాడు మనల్ని తీసుకెళ్లడానికి అని అపర్ణ అంటే.. ఆయన్ని చూస్తుంటే కొండ దిగి వచ్చిన స్వామిలా లేరు.. ఉగ్ర మూర్తిలా వస్తున్నాడని కావ్య అంటుంది. రాజ్‌ని చూసిన అపర్ణ.. ఎందుకు వచ్చావు? అని అడుగుతుంది. ఎందుకు వచ్చానో నీకు తెలీదా? అని రాజ్ అంటాడు. చదువుతో పాటు సంస్కారం కూడా మర్చిపోయావా అని అపర్ణ అంటుంది. చదువుకునే వచ్చాను.. అంతా అర్థం చేసుకునే వచ్చానని రాజ్ అంటే.. ఏంటి అవి అని అపర్ణ అడిగితే.. నేను కళావతికి ఇవ్వాల్సిన పేపర్స్.. విడాకుల పత్రాలు అని చెప్తాడు. అది విని కావ్య, అపర్ణ, కృష్ణమూర్తి, కనకంలు షాక్ అవుతారు.
రేయ్ రాజ్ ఏం మాట్లాడుతున్నావ్? అని అపర్ణ అడిగుతుంది. నువ్వు ఇక్కడ ఉండి వీళ్ల మాటలు విని నా మీద ఏదో పెద్ద అస్త్రం వదిలేవావు అనుకుంటున్నావేమో.. ఇన్ని అనర్థాలకు మూల కారణం అయినా ఈ కళావతికి.. విడాకులు ఇచ్చి శాశ్వతంగా వదిలించుకుందామని వచ్చానని రాజ్ అంటే.. ఏంట్రా ఆటలుగా ఉందా? నేను చేసిన దానికి మీ నాన్నకు సమాధానం చెప్పగలను. కానీ నువ్వు చేసిన పనికి సమాధానం చెప్పుకోగలవా.. అని అపర్ణ అడిగితే.. నువ్వు చేసిన పని వల్ల ఈ కళావతికి విడాకులు ఇస్తున్నాను. నా భార్య అవడమే ఆవిడ చేసిన పాపం.. అని రాజ్ అంటే.. అపర్ణ కొట్టాలని చేయి ఎత్తి దించేస్తుంది. మమ్మల్ని వదిలేసి కళావతే ముఖ్యమని వచ్చావు కదా.. నువ్వు నడిచిన బాటలోనే నేనూ నడుస్తాను. నువ్వు ఏ పేపర్స్‌ని చూపించి నన్ను బెదిరించాలి అనుకుంటున్నారో.. అదే పద్దతి నేను చేస్తున్నాను. అవన్నీ అనవసరం మమ్మీ.. నువ్వు వెంటనే ఇక్కడికి నాతో వచ్చేయి. లేదంటే.. నువ్వు దేని కోసం ఇదంతా చేస్తున్నావో.. అది అస్సలు నెరవేరదని రాజ్ అంటాడు
నువ్వు మాత్రమే నాతో రావాలి.. ఇంకెవ్వరూ వద్దు.. అది కూడా గుర్తు పెట్టుకో. కావ్య చేతిలో డివోర్స్ పేపర్స్ పెట్టి.. సారీ కళావతి ఇక్కడ నువ్వు మాట్లాడటానికి.. నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి నిర్ణయం లేదు.. ఇది మా అమ్మకు నాకు మధ్య జరిగే యుద్ధం. మమ్మీ నీకు ఐదు నిమిషాలు టైమ్ ఇస్తున్నా.. ఆలోచించి నాతో పాటు వచ్చేయ్ అంటాడు రాజ్. అప్పుడే సీతారామయ్య, ఇందిరా దేవిలు వస్తారు. రాజ్‌కి ఒక్క చెంప దెబ్బ ఇస్తారు. సమయం ఇస్తున్నావా? దేనికి ఇస్తున్నావురా.. నీ పతనానికి ఇంకా టైమ్ ఉందని చెబుతున్నావా.. తొమ్మిది నెలలు మోసి.. ఎప్పుడెప్పుడు నిన్ను కనాలో ఎదురు చూసిన ఆ తల్లికి సమయం ఇస్తున్నావా? నీ జీవితం, కాపురం కోసం.. మహారాణిలా బతికిన మీ అమ్మ.. ఇక్కడ ఇలా ఉంటే.. వెనక్కి రప్పించడం కోసం ఇంతలా దిగజారిపోతావా.. ఒక ఆడపిల్ల కోరికలు, ఆశలు బలి పెడతావా.. ఎక్కడి నుంచి వచ్చింది రా.. భార్య సంహనాన్ని, సంసారాన్ని బలి చేసే హక్కు అని అడుగుతాడు సీతారామయ్య.
నీ చదువు, సంస్కారం ఏమైపోయింది? స్త్రీలో ఉండే సహజమైన మాతృ హృదయాన్ని నీ అహం శిథిలం చేస్తుంది. నా వంశంలో నీ లాంటి బ్రష్టుడు పుడతానని అస్సలు అనుకోలేదని సీతారామయ్య అంటాడు. రేయ్ అసలు కావ్య అంటే నీకు ఎందుకు ఇష్టం లేదో.. దాని కళ్లలో చూసి చెప్పు. ఒక ఆడ పిల్ల పెళ్లి అర్దాంతరంగా ఆగిపోతుందని నీకు ఇచ్చి పెళ్లి చేసి కుటుంబ పరువు నిలబడిందని సంతోష పడ్డాం. కానీ దీని నిండు నూరేళ్ల జీవితం నాశనం చేస్తామని అనుకోలేదు. ఎందుకురా నీకు ఇంత పురుష అహంకారం.. అని ఇందిరా దేవి తిడుతుంది. రేయ్ ఇప్పుడు చెబుతున్నా.. నట్టింట్లో నిలబడి చెబుతున్నా.. కావ్య నాకు భగవంతుడు ఇచ్చిన మనవరాలు.. నా వారసురాలు. ఎప్పటికీ దుగ్గిరాల ఇంట దీపం పెట్టడానికి వచ్చిన శ్రీ మహా లక్ష్మి ప్రతి రూపం. కాబట్టి నీకు నచ్చినా నచ్చకోపోయినా.. కావ్య దుగ్గిరాల వారి ఇంటి కోడలిగా శాశ్వతంగా మన ఇంట్లోనే ఉంటుంది. కాదనే హక్కు నీకు లేదు. పో ఇక్కడి నుంచి అని సీతారామయ్య అంటాడు.
ఇక రాజ్ బయలు దేరి వెళ్తాడు. ఈ ఆ తర్వాత సీతారామయ్య, ఇందిరా దేవిలకు కృతజ్ఞత చెప్తాడు కృష్ణమూర్తి. ఇంటి పెద్దలుగా ఈ మాత్రం చేయకపోతే ఎలా? కోడలి కోసం ఏ అత్తా చేయని పని చేసింది నా కోడలు.. దాని ముందు ఇది ఎంత? అని ఇందిరా దేవి అంటుంది. తాతయ్యా ఏ ధైర్యంతో నేను అక్కడికి రావాలి? అని కావ్య అడిగితే.. వాడి మనసులో నీ మీద ప్రేమ లేకపోతే.. మేమే వేరే వ్యక్తిని చూసి.. పెళ్లి చేసేవాళ్లం. అందుకే మేము కూడా వాడితో పాటు పోరాడుతున్నాం. నువ్వే వాడి అహం అనే పొరను చీల్చాలని సీతారామయ్య అంటాడు. నీ ప్రశ్నలో సందేహం ఉంది. కానీ నువ్వే వాడి మనసు మార్చగలం. నా మనవడి జీవితం తెగిన గాలిపటం అవుతుంది. నమ్మకంతో రా.. నీ నమ్మకాన్ని మేమందరం నిలబడేలా చేస్తామని పెద్దావిడ కూడా హామీ ఇస్తుంది. కావ్య ఇంకా ఆలోచనలో ఉంటే.. ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు.. నీకు జరిగిన అవమానం నాకు తెలుసు. వాడి బదులు నేను నీ కాళ్లు పట్టుకుంటానని సీతారామయ్య అంటాడు.
అయ్యో తాతయ్యా.. ఏం మాట్లాడుతున్నారు? అంత మాట అనకండి.. మీ అందరి సంస్కారం ముందు నేను చాలా చిన్నదాన్ని అయిపోయాను. వస్తాను.. మీరు ఇచ్చిన ఈ స్ఫూర్తితో.. నా కాపురం నిలబెట్టుకోవడానికి నేను తప్పకుండా వస్తానుని కావ్య అంటుంది. దీంతో అందరూ సంతోష పడతారు. ఇక ఇక్కడి ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తి కాగా.. మరో ఎపిసోడ్‌లో.. మరోవైపు కావ్య దుగ్గిరాల ఇంటికి వెళ్లడంతో ధాన్యలక్ష్మి, రుద్రాణిలు రెచ్చిపోతారు. నా కొడుక్కి ఆస్తిలో వాటా ఇవ్వాలని పట్టుపడుతుంది. మీరు నా కోరిక పట్టించుకోకపోతే.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది. దీంతో సీతారామయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..