ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావాలనే ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది రుద్రాణి. కావాలంటే రెండు కోట్ల చెక్ మీద రాజ్ చేత సంతకం చేయాలని సవాల్ విసురుతుంది. ఇక రుద్రాణి మాటలకు రెచ్చిపోయిన తింగరి ధాన్యలక్ష్మి.. రాజ్ ముందు చెక్ పెడుతుంది. ఏంటి అది అని ప్రకాశం అడుగుతాడు. మీకు కూడా తెలుసు అది చెక్ బుక్ అని.. సంతకం పెట్టడానికికే ఇక్కడ పెట్టానని అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇప్పుడు నీకు డబ్బులు ఎందుకు అవసరం అని ప్రకాశం అడిగితే.. నాకు కాదు రాహుల్‌కి అవసరం అంట.. బిజినెస్ చేసుకుంటాడని అంటుంది ధాన్యలక్ష్మి. ఆ తల్లీ కొడుకులకు గడ్డి పెట్టి పంపించాం కదా.. నిన్ను కూడా మేసి రమ్మని పంపించారా అని ప్రకాశం అడుగుతాడు. అసమర్థులను నీలాగా పెంచి పోషించాల్సిన అవసరం నీలా నాకు లేదమ్మా.. వాళ్లను ఇంట్లో పెట్టుకుని తిండి పెట్టడమే ఎక్కువ. పైగా రెండు కోట్లు అడుగుతున్నాడు. ఆ నోట్లు తీసి తల్లి లెక్క పెట్టేలోపే కొడుకు మాయం చేస్తాడు. నీ కొడుకు మీద నీకు నమ్మకం ఉండొచ్చు.. కానీ మాకు లేదు. వాడికి బాగుపడే ఆలోచన ఉంటే ముందు నిజాయితీగా కష్ట పడమని చెప్పు అని సుభాష్ అంటాడు.
అదీ ధాన్యలక్ష్మి విషయం.. ఇదే జరుగుతుంది ఇక్కడ.. ఈ ఇంట్లో నా మాటకే కాదు.. నీ మాటకు కూడా విలువ లేదు. నువ్వు ఉరి వేసుకుని చచ్చినా.. నీకూ. నీ కొడుక్కి ఎలాంటి న్యాయం చేయలేరని రుద్రాణి అంటుంది. నీ వల్ల కుదడం లేదని.. మరో నోరు అరువు తెచ్చుకున్నావా అని అపర్ణ అడుగుతుంది. కళ్యాణ్ పెళ్లిలో అనామిక తల్లిదండ్రుల అప్పులు తీర్చడానికి రెండు కోట్లు ఇచ్చావు కదా.. అలానే ఇవ్వు రాజ్ అని ధాన్యలక్ష్మి అంటే.. ఆ రెండు కోట్లు నా తమ్ముడు పెళ్లి ఆగిపోకూడదని ఇచ్చాను పిన్ని. ఆ డబ్బు నీకు లేదా కళ్యాణ్ కోసమో అడిగి ఉంటే వద్దనేవారు ఎవరూ లేరు. కానీ నువ్వు అపాత్రాధానం చేస్తున్నావు. ఆ డబ్బును వాడునిలుపుకోలేడు. మరి కాస్త చెడిపోవడానికి మార్గాలు వెతుక్కుంటాడని రాజ్ అంటాడు.
అవును.. నేను ఎలా మిమ్మల్ని అమాయకంగా నమ్మి మోసపోతున్నానో రుద్రాణి చెప్పింది. ఇప్పుడు నేను పంతానికి అడుగుతున్నా.. మీ అందరికీ హక్కు ఉన్నట్టే.. నాకూ ఉంది. ఆ హక్కుతోనే అడుగుతున్నా.. నా వాటా నాకు పంచమని ధాన్యలక్ష్మి.. తిరిగి తిరిగి అక్కడికే వస్తావేంటి? ఆ గొడవ లేవనెత్తినందుకే కదా మా నాన్న ఆస్పత్రి పాలయ్యింది.. ఆయన తిరిగి వచ్చాక చూసుకుంటారని సుభాష్ అంటాడు. శభాష్ అన్నయ్యా.. నాన్న సాకు పెట్టుకుని తప్పించుకోవాలని చూస్తున్నారు. ఒక వేళ నాన్న తిరిగి రాకపోతే అని రుద్రాణి అంటే.. అప్పుడే ఇందిరా దేవి వచ్చి.. ఏమన్నావే అంటూ ఓ చెంప దెబ్బ కొడుతుంది. నీకు అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చిన ఆయన చావు కోరుకుంటున్నావా.. అసలు నువ్వు మనిషివేనా.. అసలు నీకు ఆస్తిలో హక్కే లేదని ఇందిరా దేవి అంటుంది.
అసలు నిన్ను నాన్న ఎలా చూసుకున్నాడు.. ఆ విశ్వాసం కూడా నీకు లేదా.. ఆస్తి కోసం నాన్న చావును కోరుకుంటున్నావా అని సుభాష్ అడుగుతాడు. నీకూ, నీ కొడుక్కి ఎలాంటి సంబంధం లేదు.. వెళ్లి దిక్కు ఉన్న చోట చెప్పుకోమని ప్రకాశం అంటాడు. చాలు ఆపండి.. దిక్కు ఉన్న చోట చెప్పుకోవాల్సిన పని నాకు లేదు. మిమ్మల్ని ఎదురించి నిలిచే దమ్ము నాకు ఉంది. నేను సొంత కూతుర్ని కాదని పదే పదే ఎందుకు అంటున్నారో ఆ మాత్రం నాకు తెలీదు అనుకుంటున్నారా.. ఆస్తిలో నాకు హక్కు లేదని అందుకే కదా మా నాన్న కూతురికి కూడా ఆస్తిలో హక్క ఉందని చెప్పాడు. ధాన్యలక్ష్మితో పాటు ఇప్పుడు నేనూ అడుగుతున్నా.. ఆస్తి పంచాల్సిందేనని రుద్రాణి డిమాండ్ చేస్తుంది. ఈ ఇంటి నుంచి నాన్న ఏదన్నా ఇవ్వాలి అనుకుంటే.. మేము కాదనం. కానీ నాన్న ఇప్పుడు ఇక్కడ లేకపోయినా.. మానవత్వం లేకుండా ఆస్తి కోసం గొడవ చేస్తున్నారని ఏం చేయాలో నాకు తెలుసని సుభాష్ అంటాడు.
నువ్వు ఆగు రుద్రాణి.. వాటాల విషయం ఎత్తినప్పుడల్లా వీళ్లు ఇలా ఎదురు తిరుగుతున్నారంటే.. నాకూ నా కొడుక్కి ఏమీ ఇవ్వరని.. రాజ్‌కి మాత్రమే పట్టం కట్టాలని చూస్తున్నారని అర్థమైపోయింది. నా నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారు. అది తెలిసి పోతుంది. ఇది నేను సహించను. ఎంత దూరం అయినా వెళ్తాను. కోర్టుకు ఈడ్చి నా హక్కుల్ని నేను సాధిస్తానని ధాన్యలక్ష్మి అంటుంది. ధాన్యలక్ష్మి వత్తాసు పలుకుతుంది రుద్రాణి. అదీ ఆ పని చేయండి.. మీకు చిప్ప కూడా మిగలదని ప్రకాశం అంటాడు. ఇక ప్రకాశం, ధాన్యలక్ష్మిలు ఇద్దరూ గొడవ పడుతూనే ఉంటారు. అదంతా విని విసుగెత్తిపోయిన సుభాష్.. ఆపండి.. ఇంత వరకూ వచ్చాక ఇక ఇలాంటి వాళ్లతో ఉండటం అంత మంచిది కాదు. ఆస్తిని పంచేస్తానని సుభాష్ అంటాడు. దీంతో రుద్రాణి, ధాన్యలక్ష్మిలు సంతోష పడుతుంది. ఇక ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు సుభాష్. మావయ్య దగ్గరకు వచ్చిన కావ్య.. ఆస్తి పంచేస్తానని చెప్పడంలో మీరు తప్పు చేశారు.. ఇల్లు ముక్కలైపోతుందని కావ్య అంటే.. ఇక చేసేది ఏమీ లేదు అమ్మా.. నా సహనం నశించింది. ఇలాంటి కలుపు మొక్కల్ని తీసి పారేయాలని సుభాష్ అంటాడు.
ఇక గదిలో ఉన్న రాజ దగ్గరకు వెళ్తుంది కావ్య. రాజ్ తన వర్క్ తాను చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ నేను ఒక్కదాన్ని ఉన్నాన్న విషయం మీకు తెలుసా? అని కావ్య అంటుంది. ఓ నువ్వు ఎప్పుడు వచ్చావు? ఆఫీసు వర్క్‌లో పట్టించుకోలేదని రాజ్ అంటాడు. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు అర్థం అవుతుందా అని కావ్య అడిగితే.. ఉదయాన్నే అందరూ టిఫిన్ చేస్తారు.. మధ్యాహ్నం భోజనం చేస్తారని చెబుతూ ఉంటాడు. హలో.. నేను అడిగేది టైమ్ టేబుల్ గురించి కాదు.. ఉదయం జరిగిన పంచాయితీ గురించి అని కావ్య అడుగుతుంది. నేను దాన్ని పట్టించుకోలేదని రాజ్ అంటాడు. ఎందుకు ఇల్లు ముక్కలు అవడం, ఆస్తి పంచుకోవడం మీకు ఇష్టమా.. ఇది తాతయ్య గారికి ఏమాత్రం ఇష్టం లేదు. ఇంట్లో ఉండే మీ నాన్నమ్మ గారి పరిస్థితి ఏంటి? మావయ్య గారిని ఆస్తి పంచొద్దని చెప్పినా పట్టించుకోలేదు. కనీసం మీరైనా చెప్పి చూడమని కావ్య అంటుంది. ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసి.. నేను చేతులు ఎత్తేశాను. నాన్న తీసుకున్న నిర్ణయమే మంచిదని రాజ్ అంటాడు. ఇక ఈ రోజుతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌లో అందరికీ షాక్ ఇస్తూ సీతారామయ్య నిర్ణయం తీసుకుంటాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..