Brahmamudi, August 23rd Episode: ధాన్య లక్ష్మి, రుద్రాణిలకు షాక్ ఇచ్చిన కావ్య.. అప్పూకి అవమానాలు..

|

Aug 23, 2024 | 12:40 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. పూజకు వెళ్లేందుకు కళ్యాణ్ నిద్రపోకుండా ఆలోచిస్తాడు. అదేంటి? ఇంకా పడుకోలేదని అప్పూ అడుగుతుంది. మా నాన్నమ్మ, తాతయ్య ఎంత కంట్రోల్ చేసినా.. మా అమ్మ, ఆ రుద్రాణి అత్త కలిసి నిన్ను అవమానిస్తారని అంటాడు కళ్యాణ్. అదంతా నేను పట్టించుకోనని అప్పూ అంటుంది. నీ గురించి నాకు తెలుసు. నిన్ను మా అమ్మ అన్నా నాకే బాధ. మా అమ్మని ఏమన్నా నాకే బాధ..

Brahmamudi, August 23rd Episode: ధాన్య లక్ష్మి, రుద్రాణిలకు షాక్ ఇచ్చిన కావ్య.. అప్పూకి అవమానాలు..
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. పూజకు వెళ్లేందుకు కళ్యాణ్ నిద్రపోకుండా ఆలోచిస్తాడు. అదేంటి? ఇంకా పడుకోలేదని అప్పూ అడుగుతుంది. మా నాన్నమ్మ, తాతయ్య ఎంత కంట్రోల్ చేసినా.. మా అమ్మ, ఆ రుద్రాణి అత్త కలిసి నిన్ను అవమానిస్తారని అంటాడు కళ్యాణ్. అదంతా నేను పట్టించుకోనని అప్పూ అంటుంది. నీ గురించి నాకు తెలుసు. నిన్ను మా అమ్మ అన్నా నాకే బాధ. మా అమ్మని ఏమన్నా నాకే బాధ అని కళ్యాణ్ అంటాడు. అక్కడికి వెళ్లిన తర్వాత మీ అమ్మ నన్ను ఏమన్నా నేను అసలు నోరు తెరవను. సైలెంట్‌గా ఉంటాను. అమ్మమ్మ, తాతయ్య వచ్చి పిలిచిన తర్వాత వెళ్లక పోతే మర్యాదగా ఉండదు. నా వల్ల అక్కడ ఏలాంటి గొడవ జరగదని అప్పూ అంటుంది.

అప్పూని అవమానించడానికి స్కెచ్ రెడీ చేసిన ధాన్య లక్ష్మి..

కట్ చేస్తే.. దుగ్గిరాల ఇంట్లో పూజకు అంతా సిద్ధం చేస్తారు. కావ్య అన్నీ ఏర్పాట్లు చేస్తుంది. అదంతా చూసి ధాన్య లక్ష్మి కుళ్లుకుంటుంది. అప్పుడే రుద్రాణి వస్తుంది. కాసేపట్లో ఏం జరుగుతుందో తెలీక వాళ్లు నవ్వుకుంటున్నారు. చెల్లెలికి జరగబోయే అవమానం తెలీక ఆ కావ్య హడావిడి చేస్తుందని అంటుంది ధాన్య లక్ష్మి. అదేమో తెలీదు కానీ.. వీళ్లంతా కలిసి అప్పూని, కళ్యాణ్‌ని ఇంట్లో ఉంచేలా చేస్తారని భయంగా ఉందని రుద్రాణి అంటుంది. ఆ అప్పూ ఈ ఇంటి కోడలిగా పనికి రాదని రుజువు చేస్తానని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పుడే ముత్తైదువులు ఇంటికి వస్తారు. వాళ్లను చూసి అపర్ణ, కావ్య వాళ్లు షాక్ అవుతారు. వీళ్లను ఎవరు పిలిచారో అని అనుకుంటారు.

పబ్‌కో పార్టీకో వెళ్లినట్టు ఇలా రెడీ అయ్యిందేంటి?

ఇక పై నుంచి రాజ్ ఇందిరా దేవిని పిలిచి.. అప్పూ, కళ్యాణ్‌లు బయలు దేరారా? అని అడుగుతాడు రాజ్. మేము వెళ్లి పిలిచిన తర్వాత కూడా రాకుండా ఉంటారా? ఇప్పటికి 10 సార్లు అడిగావని ఇందిరా దేవి అంటుంది. వాళ్లు రావాలి.. ఈ కళావతి తిక్క కుదరాలని రాజ్ అంటాడు. అప్పుడు ఆటోలో కళ్యాణ్, అప్పూలు వస్తారు. వాళ్లను చూసి అందరూ గుమ్మ దగ్గరకు వెళ్తారు. కొత్త జంటకు హారతి ఇవ్వమని ఇందిరా దేవి అంటుంది. నా కొడుక్కి హారతి ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ కోడలు అంటున్న ఆవిడ గారు వ్రతం అని తెలిసిన తర్వాత కూడా ఎలా వచ్చిందో చూశారా? ఏ కోశాన అయినా ఆడతనం ఉందా? అని ధాన్య లక్ష్మి.. పబ్‌కో పార్టీకో వెళ్లినట్టు అలా రావడం ఏంటి? అని రుద్రాణి అంటుంది. ఏంటి ధాన్య లక్ష్మి ఈ అమ్మాయి నీ కోడలా? ఏం చూసి చేసుకున్నాడు నీ కొడుకు? మహాలక్ష్మీలా ఉంటుంది అనుకుంటే.. ఇలా వచ్చిందేంటి? అని సూటి పోటి మాటలు అంటారు.

ఇవి కూడా చదవండి

టెన్షన్‌లో రాజ్.. కాపాడిన కావ్య..

దీంతో రాజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అర్థమైంది.. మీరు అనుకున్నది నెరవేరిందా? ఇక సంతోషంగా సంబరం చేసుకో.. ఇలాంటివి జరుగుతాయనే నేను రాను అన్నాను. కానీ నాన్నమ్మ, తాతయ్య ఇంటికి వచ్చి పిలిచారు అందుకే వచ్చాను. కానీ నాకు రావాలని లేదు. పదా వెళ్లిపోదామని కళ్యాణ్ అంటాడు. రాజ్, ప్రకాశం, అపర్ణ ఎంత మంది నచ్చ చెప్పినా కళ్యాణ్ వినిపించుకోడు. దీంతో కావ్య రంగంలోకి దిగుతుంది. ఆగండి కవి గారు.. కొత్త కోడలు గౌరీ దేవితో సమానం అంటారు. నట్టింట్లోకి వెళ్తే మహా లక్ష్మీ.. పూజలో కూర్చేంటే సరస్వతీ దేవీ అంటారు. ముగ్గురు అమ్మలు ఆ ఒక్క రూపంలోనే ఇంట్లోకి అడుగు పెడుతుంటే.. గుమ్మం నుంచి తిప్పి పంపించడం అరిష్టం. కోపాలు తాపాల కంటే బంధాలు ముఖ్యం. ఇంట్లోంచి కట్టుబట్టలతో బయటకు వెళ్లిన వాళ్లు ఎలా ఉంటారు? వాళ్లకు ఉన్నవి ఏవో వేసుకొచ్చారు. దుగ్గిరాల ఇంట్లో చీరలకు, నగలకు కొదవ లేదని.. హారతి ఇచ్చి లోపలికి రమ్మని కావ్య హారతి ఇస్తుంది.

ఇంట్లోకి అప్పూ..

అప్పూ నాకు ఇప్పుడు మీ అక్క ఎంతో నువ్వు కూడా అంతే. మీ అత్తగారి మాటలను పట్టించుకోకు. ఇది నీ ఇల్లు.. స్వతంత్రంగా ఉండమని అపర్ణ అంటుంది. ఇక కళ్యాణ్, అప్పూలు కొత్త బట్టలు వేసుకుని వస్తారు. అప్పూని రెడీ చేయమని అపర్ణ అంటుంది. అప్పూని గదిలోకి తీసుకొస్తుంది స్వప్న. ఇప్పుడు ఈ చీర కట్టుకోవాలా? అని అప్పూ అంటుంది. నువ్వు ఇప్పుడు ఈ దుగ్గిరాల ఇంటి కోడలివి. నచ్చినా నచ్చకపోయినా కొన్ని పద్దతులు ఫాలో అవ్వాలని స్పప్న చెబుతుంది. కరెక్ట్‌గా చెప్పావు అక్కా అని కావ్య అంటుంది. ముగ్గురు అక్కా చెల్లెళ్లు చేరి నవ్వుకుంటారు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో అప్పూకి అడుగడుగునా ఎన్నో అవమానాలు ఎదురవుతాయి.