Brahmamudi, August 15th Episode: మేమేంటో నిరూపించుకున్నాకే ఇంటికి వస్తాం.. కావ్యపై రాజ్ కోపం..

|

Aug 15, 2024 | 12:40 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసో‌డ్‌లో.. కళ్యాణ్, అప్పూలను ఇంటికి తీసుకు రమ్మని ధాన్య లక్ష్మి చెబుతుంది. దీంతో వాళ్లిద్దర్నీ తీసుకు రమ్మని రాజ్.. కావ్యని పిలుస్తాడు. కానీ కావ్య రానని చెబుతుంది. ఏ? ఎందుకు రావు? అని కళావతిని నిలదీస్తాడు రాజ్. దాని కారణాలు దానికి ఉన్నాయి. ఈవిడ ఇంత సడెన్‌గా ఎందుకు తీసుకు రమ్మంటుంది. అప్పూని తీసుకొచ్చాక.. మళ్లీ కావ్యని వంక పెట్టి తిట్టడానికి స్వప్న అంటుంది. అయినా రాజ్ కాంప్రమైజ్ కాకుండా కళ్యాణ్‌ని ఇంటికి తీసుకు రావడానికి కావ్యని రాజ్ ఫోర్స్..

Brahmamudi, August 15th Episode: మేమేంటో నిరూపించుకున్నాకే ఇంటికి వస్తాం.. కావ్యపై రాజ్ కోపం..
Brahmamudi
Image Credit source: disneyhotstar
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసో‌డ్‌లో.. కళ్యాణ్, అప్పూలను ఇంటికి తీసుకు రమ్మని ధాన్య లక్ష్మి చెబుతుంది. దీంతో వాళ్లిద్దర్నీ తీసుకు రమ్మని రాజ్.. కావ్యని పిలుస్తాడు. కానీ కావ్య రానని చెబుతుంది. ఏ? ఎందుకు రావు? అని కళావతిని నిలదీస్తాడు రాజ్. దాని కారణాలు దానికి ఉన్నాయి. ఈవిడ ఇంత సడెన్‌గా ఎందుకు తీసుకు రమ్మంటుంది. అప్పూని తీసుకొచ్చాక.. మళ్లీ కావ్యని వంక పెట్టి తిట్టడానికి స్వప్న అంటుంది. అయినా రాజ్ కాంప్రమైజ్ కాకుండా కళ్యాణ్‌ని ఇంటికి తీసుకు రావడానికి కావ్యని రాజ్ ఫోర్స్ చేస్తాడు. రాజ్ స్వప్న చెప్పింది నీకు అర్థం కాలేదా? రేపు ప్రతీ చిన్న విషయానికి కావ్యని బాధ్యురాలిని చేస్తారు. అందుకే తను రానంటుందని అపర్ణ అంటుంది. నా గురించి నాకు బాధ లేదు అత్తయ్యా.. ఇంకేదో గూడు పుటాని చేస్తున్నారు. రాత్రికి రాత్రే చిన్న అత్తయ్య మనసు మార్చుకుందంటే ఇంకేదో బలమైన కారణం ఉందని కావ్య మనసులో అనుకుంటుంది.

కోడలికి అత్తగారి సపోర్ట్..

ఎందుకు రాజ్ నువ్వు ఏ ధైర్యంతో తాళి వాడి చేతికి ఇచ్చి కట్టమన్నావో అదే ధైర్యంతో పిలవమని ధాన్య లక్ష్మి అంటుంది. ఎందుకు రాదు? కారణం చెప్పాలని రాజ్ అంటే.. దయ చేసి నన్ను బలవంతం చేయకండి. మీరూ మీరూ రక్త సంబంధం. కవి గారెకి మీద ధైర్యం ఉంది. మీరు వెళ్లి పిలిస్తే వస్తారని కావ్య అంటుంది. అయినా రాజ్ కదలకుండా.. నువ్వు ఎందుకు రావో చెప్పు అని నిలదీస్తాడు. ఏ నీ మీద అంత నమ్మకం లేదా? ఎందుకు కావ్య రానంటున్నా బలవంతం చేస్తావు? వెళ్లు నువ్వు వెళ్లి కళ్యాణ్‌ని పిలువు. వస్తాడో రాడో ఆ తర్వాత చూద్దామని అపర్ణ అంటుంది. పర్వాలేదు మమ్మీ వాళ్లిద్దర్నీ తీసుకుని వస్తానని రాజ్ వెళ్తాడు.

ఇంటికి క్లీన్ చేసుకున్న అప్పూ, కళ్యాణ్‌లు..

కట్ చేస్తే.. గదిలోకి వచ్చిన అప్పూ, కళ్యాణ్ అంతా చూస్తారు ఇల్లు చాలా నీటిగా ఉంచావురా.. అని అంటారు. సరే క్లీన్ చేద్దామని అప్పూ అంటే.. బంటీ పారిపోతాడు. సరే నువ్వు బయటకు వెళ్లు.. ఇదంతా క్లీన్ చేయాలంటే సమయం పడుతుందని అప్పూ అంటే.. నేను కూడా సహాయం చేస్తానని కళ్యాణ్ కూడా హెల్ప్ చేస్తాడు. నువ్వు ఏ కష్టం పడకుండా రాజకుమారుడిలా పెరిగావు. నువ్వు ఈ పనులు చేయలేవని అప్పూ అంటుంది. ఇక ఇద్దరూ కలిసి మొత్తం ఇంటికి క్లీన్ చేస్తారు. సరిగ్గా అప్పుడే అప్పూ ఫ్రెండ్స్ వస్తారు.

ఇవి కూడా చదవండి

కావ్య ప్రవర్తన అర్థం కావడం లేదన్న అపర్ణ..

ఆ తర్వాత అపర్ణ కిచెన్‌లో ఉండి పర ధాన్యంలో పడుతుంది. ఏంటి ఏం ఆలోచిస్తున్నావ్? అని ఇందిరా దేవి అంటే.. కావ్య గురించి అత్తయ్యా.. కావ్య ప్రవర్తన నాకు అర్థం కావడం లేదు. ఒకప్పుడు కళ్యాణ్‌ని ఎవరైనా ఒక్క మాట అన్నా సపోర్ట్ చేసి మాట్లాడేది. అలాంటిది ఈ పెళ్లి జరిగిన తర్వాత ఎందుకు అంత కఠినంగా ఉందో అర్థం కావడం లేదని అపర్ణ అంటుంది. తాను ఏం చేస్తుందో అర్థం కానప్పుడు ఎలా సపోర్ట్ చేసి మాట్లాడావు? అని ఇందిరా దేవి అడుగుతుంది. ఒకప్పుడు కావ్య ఏం చేసినా అపార్థం చేసుకునేదాన్ని.. కానీ తను ఏం చేసినా ఇంటి మంచి కోసమే అని అనుకున్నాను. కానీ కావ్య ఎందుకో కళ్యాణ్ విషయంలో తప్పు చేసిందని అనుకుంటున్నా అని అపర్ణ అంటే.. కావ్య ఏం చేస్తుందో తెలీదు కానీ.. ఏదో బలమైన కారణం ఉంటే తప్ప ఇలా ప్రవర్తించదు. ఒక మనిషిని అకారణంగా బాధ పెట్టదు. ఇలాంటి సమయంలో అత్తగా నువ్వు తోడుగా నిలబడటం మంచి విషయమే అని ఇందిరా దేవి అంటుంది.

నేను పిజ్జా డెలివరీకి వెళ్తాను..

ఆ తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేస్తారు అప్పూ, కవిలు. ఇక నుంచి నేను పిజ్జా డెలివరీకి వెళ్తానని అప్పూ అంటుంది. వద్దు నువ్వు నా కోసం కష్ట పడటం నాకు ఇష్టం లేదని అంటాడు కళ్యాణ్. అప్పుడే.. ఏంటి కవి సర్.. ఇదేనా మీ ఫ్రెండ్స్ గెస్ట్ హౌస్ అని అడుగుతారు. బంటి గాడే మీ ఫ్రెండ్ అని ముందే ఎందుకు చెప్పలేదని జోక్ చేస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదని వచ్చేశామని అప్పూ అంటుంది. మీ పెళ్లికి మేము ఇచ్చే గిఫ్ట్స్ అని వస్తువులు ఇస్తారు. ఎందుకు ఇవన్నీ అవసరమా ఇప్పుడు అని అప్పూ అంటుంది. అప్పుడే రాజ్ వస్తాడు. ఏంటిరా ఇది.. ఇక్కడ ఉంటారా? అని రాజ్ అంటే.. మా ఇద్దరికీ సరిపోతుందని కళ్యాణ్ అంటాడు.

మన ఇంటికి వచ్చేయండి..

ఏం జరిగినా.. మొత్తానికి మీ పెళ్లి అయ్యింది. ఇకపై మీరు ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు పడాల్సిన పని లేదు. పిన్నీ మీ ఇద్దర్నీ తీసుకు రమ్మని చెప్పింది. అందుకే ధైర్యంగా ఇక్కడికి వచ్చాను.. పదండి మన ఇంటికి వెళ్దామని రాజ్ అంటాడు. సారీ అన్నయ్యా నేను ఇంటికి రాలేనని అంటాడు కళ్యాణ్. రాజ్ నచ్చజెప్పాలని ట్రై చేసినా కళ్యాణ్ నమ్మడు. మా అమ్మ నా మీద ప్రేమతో అప్పూని ఇంటికి రావడానికి ఒప్పుకుంది. అది కూడా ముందు నన్ను ఒక్కడినే తీసుకు రమ్మని చెప్పి ఉంటుంది. కానీ మీరందరూ గొడవ చేసి ఉంటే.. అప్పుడు అప్పూని కూడా తీసుకురమ్మని చెప్పి ఉంటుందని కళ్యాణ్ కని పెట్టేస్తాడు. మా అమ్మ గురించి నాకు తెలీదా? వదిన కాబట్టి ఓపిక పట్టింది. కానీ అప్పూకి ఆ మాటలు నచ్చవు. అక్కడ ఎలాంటి మర్యాదలు దక్కుతాయో నాకు తెలుసని కళ్యాణ్ చెప్తాడు. అంటే మీరు నాతో రారా? అని రాజ్ అంటే.. రాము అన్నయ్యా అని కళ్యాణ్ చెప్తాడు. ఇప్పుడు రారా.. ఎప్పటికీ రారా అని రాజ్ అడుగుతాడు.

మేము ఏంటో నిరూపించుకున్నాకే ఇంటికి వస్తాం..

వస్తాము.. కానీ ఎప్పుడో.. వదినతో సహా అందరికీ నేను అప్పూని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. కాబట్టి ముందు మా కాళ్ల మీద మేము నిలబడి.. మేమే ఏంటో నిరూపించుకున్నాక అప్పుడు ఇంటికి వస్తామని కళ్యాణ్ అంటాడు. అప్పూ నీ అభిప్రాయం ఏంటి? అని రాజ్ అంటే.. అప్పూ కూడా కాదని అంటుంది. మరో వైపు రాజ్ కోసం దుగ్గిరాల ఫ్యామిలీ సభ్యులు అందరూ ఎదురు చూస్తారు. ఇంతలో రాజ్ ఇంటికి వస్తాడు. రాజ్ ఇంటికి రాగానే.. కళ్యాణ్ ఏడిరా.. వాళ్లిద్దరూ రాలేదా? ఏమైందని ప్రకాశంతో పాటు అందరూ అడుగుతారు. కళ్యాణ్ ఇంటికి రానన్నాడు. ఏ ఎందుకు రాలేదని ధాన్య లక్ష్మి అంటే.. వాళ్లిద్దర్నీ ఇంటికి పిలిచావంటే కళ్యాణ్ నమ్మడం లేదు పిన్నీ.. కేవలం కళ్యాణ్ కోసమే ఇంటికి పిలుస్తున్నావ్? అని అనుకుంటున్నాడని రాజ్ అంటాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.