
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. చిత్రతో రాజ్ పెళ్లికి కావ్య ఒప్పుకుంటూ నో అబ్జెక్షన్ పేపర్స్‌పై సంతకం పెడుతుంది. నువ్వు డబ్బు కోసమే ఈ ఇంట్లో ఉంటున్నావ్. నీకు భర్త అవసరమే లేదు అంటూ కావ్యని అసహ్యించుకుంటుంది అపర్ణ. ఇంతలో గుడికి వెళ్లి ఇందిరా దేవి వస్తుంది. బాగా చెప్పావ్.. నీ భర్తకు వేరే అమ్మాయితో పెళ్లి జరిగినా నాకేం అభ్యంతరం లేదని సంతకం చేశావా? అని కావ్యకి లాగి పెట్టి ఒక చెంప దెబ్బ ఇస్తుంది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ సంతకం చేసి ఏం సాధించావ్? నీకు నీ అత్త ఏం కిరీటం పెట్టింది. ఎవరి కోసం చేశావ్ ఈ త్యాగం. ఎందుకు చేశావ్ ఈ సాహసం.. ఛీ నువ్వు అన్నీ తెలిసిన దానివి అనుకున్నా. కానీ నీ జీవితాన్ని నువ్వే సర్వస్వం నాశనం చేసుకునే పిచ్చి దానివి అని అర్థంమైంది.
నీ కాపురం బాగుండాలని.. నీ బ్రతుకు నిలబడాలని నేను ఎంత తపించానో తెలుసా? ఇక్కడ ఇంత మంది ఉన్నారు? ఈ గొర్రెల మందలో ఒక్కరైనా నీ తరుపున నిలబడ్డారా? అదిగో తప్పు చేసిన నీ భర్త కూడా ఈ మందలోనే ఉన్నాడు కదా.. వాడైనా నిన్ను ఆపాడా? తండ్రి తర్వాత తండ్రి స్థానంలో నిలబడాల్సిన నీ మామ.. భార్య మాటకు తలవంచి ఒక అసమర్థుడిగా నిల్చున్నాడే వీళ్ల గురించా నువ్వు ఆలోచించేది? జీవితంలో ఏ ఆడది అయినా చూస్తూ సవతిని తెచ్చుకుంటుందా? ఇక్కడ ఆడావళ్లు ఎవరూ లేరా? ఇంత అన్యాయం జరుగుతుంటే ఆపలేక పోయారా? ఎందుకే ఎందుకు అలా చేశావ్? ఇంకా ఎన్ని కష్టాలు అనుభవించాలని ఈ సంతకం చేశావ్? అని ఇందిరా దేవి బాధ పడుతుంది.
అత్తయ్య గారూ కావ్య సంతకం పెడితేనే కదా.. ఈ సమస్యకు పరిష్కారం దొరికేది అని అపర్ణ అంటే.. ఛీ నోరు మూయ్.. నీతో మాట్లాడాలి అంటేనే కంపరంగా ఉంది. పెద్ద కోడలిగా అధికారం ఇచ్చాను కదా అని.. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటావా.. భార్యనీ భర్తనీ విడదీయడం అంటేనే పరిష్కారం అంటే.. అనామికను వదిలేస్తాను అంటే కళ్యాణ్‌ని ఎందుకు కోపపడ్డావు చెప్పు.. అన్ని నేరాలు చేసిన రాహుల్ ని వదిలేయమని ఎందుకు స్వప్నతో చెప్పలేదు. ఏం ధాన్య లక్ష్మి నువ్వూ సాటి ఆడదానివే కదా.. మరి నీ కోడలి లాంటి కావ్యకి అన్యాయం జరుగుతుంటే ఎందుకు అపర్ణని అడ్డుకోలేక పోయావ్? అని పెద్దావిడ నిలదీస్తుంది. అత్తయ్య గారూ నేను చెప్పేది వినండి అని అపర్ణ అంటే.. వినను.. ఇకపై నువ్వు ఏం చెప్పినా వినను. నువ్వు ఆ అర్హత పోగొట్టుకున్నావ్ అపర్ణా.. కావ్యకి ఏ అండా లేదని, అడిగే దిక్కు లేదని ఇంత పెద్ద శిక్ష వేశావే.. ఏదో ఒక రోజు కావ్యకి అన్యాయం చేసినందుకు పశ్చాతాపంతో కుమిలి పోతావ్. ఆ రోజు నీ కోడలు క్షమించినా.. నేను మాత్రం క్షమించనని చెప్పి ఇందిరా దేవి వెళ్తుంది.
ఈ సీన్ కట్ చేస్తే.. కావ్య ఒంటరిగా బయట కూర్చుని ఉంటుంది. అక్కడికి కళ్యాణ్ వస్తాడు. అయ్యో ఏంటి వదినా అశోక వనంలో కూర్చొన్నారు. లంకలో రాక్షసులు ఉన్నారనా.. రేపు అన్నయ్యతో మాయకు పెళ్లి జరిగితే.. మీకు చోట ఉండదని.. ఇప్పటి నుంచే చోటు చేసుకున్నారు. మీ కాపురాన్ని మీరు ముక్కలు చేయడంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇంత తెలివిగా అన్నయ్య పెళ్లికి అభ్యంతరం లేదని మిమ్మల్ని చూసి గర్వపడాలని ఉంది. దీంతో కావ్య లేచి వెళ్లి పోతుంటే.. మిమ్మల్ని దెప్పిపొడుస్తున్నానని నా మీద కోపం వచ్చిందా? ఈ ఇంట్లో మీకు ఏం దక్కింది? ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీకు ఓ వ్యక్తిత్వం ఉంటుంది కదా.. మీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. భర్తనే పంచి అపర దాన గుణం చూపించారు అర్థమవుతుందా మీకు అని కళ్యాణ్ అంటే.. బాగా అర్థమైంది. నా గురించి మేలు కోరే వాళ్లలో మీరు ముందున్నారని.. మీరే నా జీవితం గురించి ఇంత ఆలోచిస్తే.. మరి నేను ఇంకెంత ఆలోచిస్తాను చెప్పండి. చూద్దాం ఇంకా సమయం మిగిలే ఉంది కదా అని కావ్య అంటే.. కళ్యాణ్ నవ్వుతాడు.
ఆ తర్వాత.. రుద్రాణి, చిత్ర, రాహుల్‌లు ఒక చోటే చేరి.. సంతోష పడుతూ ఉంటారు. వీళ్ల పెళ్లి అయిపోతే ఇంకా సంతోషంగా ఉంటాను. ఇప్పుడు అసలు ఘట్టం ముందు ఉంది. సరే కానీ నాకు కాస్త భయంగా ఉంది. రేపు ఎప్పుడైనా రాజ్‌కి నిజం తెలిసి నన్ను వదిలేస్తే పరిస్థితి ఏంటి? అని చిత్ర అడిగితే.. నీకు ఆ భయం ఏమాత్రం అవసరం లేదు. రాజ్‌కు ఓ క్యారెక్టర్ ఉంది. దాని మీదనే నిలబడి ఉంటాడు అని రాహుల్ చెప్తాడు. అయితే సరే నాకు ఎలాంటి భయం లేదని చిత్ర అంటుంది. ఈ ఇంట్లో నీకు ఈ ఇంట్లో వాళ్ల నుంచి ఎలాంటి సమస్యా రాదు. వస్తే గిస్తే నాతోనే వస్తుంది. ఆ కావ్యని కూడా నీ లాగే ఇరికించి పెళ్లి చేశాను. మిడిల్ క్లాస్ మనిషి కదా.. చెప్పినట్టు పడి ఉంటుందని అనుకున్నా. కానీ అదే నాకు ఎదురు తిరిగి ఉంది. అందుకే నిన్న రప్పించాను అని రుద్రాణి అంటే.. అది అమాయకురాలు కాబట్టి.. ఇంట్లో నుంచి పంపించేస్తున్నాను. కానీ నిన్ను అయితే పైకే పంపించేస్తానని రుద్రాణి అంటుంది. దీంతో భయ పడిన చిత్ర.. ఎవరు ఏం చెప్పినా నేను మీ వైపే ఉంటానని అంటుంది.
ఆ నెక్ట్స్.. రాజ్, సుభాష్, కావ్యలు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. మమ్మీ చేసిన దానిలో తప్పు లేదని రాజ్ అంటే.. కావ్యకి అన్యాయం చేయడం న్యాయామా అని సుభాష్ నిలదీస్తాడు. బిడ్డ తల్లిని తీసుకొస్తానని.. నాకో భార్యని తీసుకొచ్చింది. కాబట్టి తననే అడగండి. నేను విడాకులు ఇవ్వను అన్నదానివి.. నేను పెళ్లి చేసుకోవచ్చని ఎందుకు అన్నావు. నేను సంతకం పెట్టను అంటే.. మనకు కాస్త సమయం అయినా దొరికేది. ఇప్పుడు ఊబిలోకి దింపేశావని రాజ్ అంటాడు. ఇందులో మీ తప్పు లేదు.. నా వల్లే ఇలా జరుగుతుంది. ఇక చాలు,, నేను వెళ్లి నిజం చెప్పేస్తాను. మరి ఈ పెళ్లి ఎలా ఆపుతారని సుభాష్ అంటాడు. ఈ పెళ్లి జరగదు మావయ్య గారూ.. నేను చూసుకుంటానని కావ్య అంటుంది. నాకు ఆ నమ్మకం లేదని రాజ్ అంటాడు.
ఈ సీన్ కట్ చేస్తే.. మాయ గురించి అంతా ఎంక్వైరీ చేస్తుంది అప్పూ. ఎవ్వరూ తెలీదని చెబుతూ ఉంటారు. చివరికి ఓ షాపు దగ్గర ఆగి మంచినీళ్లు తాగుతుంది. ఏంటమ్మా అటూ ఇటూ తిరుగుతున్నావ్? ఎందుకు అని అడుగుతుంది. అక్కడ కనిపిస్తున్న మాయ గురించి అడుగుతుంది. దీంతో ఆ షాపు ఆవిడ ఇంటి అడ్రెస్ చెబుతుంది. దీంతో వెళ్తుంది అప్పూ. ఆ తర్వాత పెద్దావిడకు కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది కావ్య. కానీ ఇందిరా దేవి తీసుకోదు. నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావో తెలీదు. నీ మీద ఎక్కువ నమ్మకం పెట్టున్నందుకు బాగా బుద్ధి చెప్పావు అని తిడుతుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.