
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఉదయాన్నే స్వప్న మోడలింగ్‌కి రెడీ అవుతూ ఉంటుంది. స్వప్నను చూసి రుద్రాణి, రాహుల్‌లు.. చూశావా మామ్.. నువ్వు వద్దు అన్నా.. పొగరుగా ఎలా రెడీ అవుతుందో అని రాహుల్ అంటాడు. రేయ్ పిచ్చోడా.. ఇప్పుడు ఆపితే ఏం వస్తుంది? దాన్ని రెడీ కానివ్వు.. అలాగే అది మోడలింగ్ చేయడం నీకు ఇష్టమే అని రెచ్చ గొట్టు. కింది దాకా పంపించు చాలు.. ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను అని రుద్రాణి అంటుంది. రుద్రాణి చెప్పినట్టుగానే రాహుల్.. స్వప్న దగ్గరకు వెళ్లిన రాహుల్.. నువ్వు మోడలింగ్ చేయడం నాకు ఇష్టమే అన్నట్టు చెప్తాడు. నువ్వు మోడలింగ్ చేయడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని రాహుల్ అంటే.. నువ్వు నన్ను ఎంత పొగిడినా.. నాకు వచ్చే సంపాదనలో ఒక్క రూపాయి కూడా ఇవ్వను. నేను సంపాదిస్తూ ఉంటే.. నువ్వు కూర్చుని తింటావా అని రాహుల్ పై అరిచి.. కిందకు వెళ్తుంది స్వప్న. నువ్వు కిందుకు వెళ్లు.. మా మమ్మీ కాచుకుని కూర్చుంది అని రాహుల్ మనసులో అనుకుంటాడు.
ఇక కింద హాలులో అపర్ణ, సుభాష్, ధాన్య లక్ష్మి, ప్రకాష్, అనామిక, రుద్రాణి, పెద్దావిడ కూర్చుని ఉంటారు. కావ్య అందరికీ కాఫీ ఇస్తుంది. అప్పుడే స్వప్న కిందుకు వస్తుంది. ఎక్కడికీ అని రుద్రాణి అడుగుతుంది. ఒక యాడ్ కంపెనీ.. బికినీ యాడ్ ఉంది చేయడానికి వెళ్తున్నా అని స్వప్న సమాధానం ఇస్తుంది. ఏంటి? బికినీ వేసుకుంటావా అని రుద్రాణి గట్టిగా అరుస్తుంది. అవును లేకపోతే మీరు వేసుకుంటారా.. నా బిడ్డ గురించి నేను చూసుకోవాలి కదా అని స్వప్న అనేసి వెళ్తుంది. ఆగమ్మా.. అని అప్పుడే సీతారామయ్య ఎంట్రీ ఇస్తాడు. గర్భిణీగా ఉన్నప్పుడు నువ్వు నీ బిడ్డ కోసం కష్ట పడాల్సిన పని లేదు. ఇది మా స్థిరాస్థిలో ఒకటి. అడిడ్స్‌లో ఓ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. దానికి అద్దె లక్షల్లో వస్తుంది. అయితే ఈ ఆస్తి అమ్మడానికి వీల్లేదు అని పెద్దాయన చెప్తాడు. ఇదిగో తీసుకోమ్మా అని స్వప్నకు ఇస్తాడు సీతారామయ్య. అది చూసిన ధాన్య లక్ష్మి.. స్వప్నకు అంత ఆస్తిని అలా ఎలా ఇస్తారు మావయ్యా.. ఆస్తి కేవలం ఈ ఇంటి వారసులకు మాత్రమే చెందుతుంది. రుద్రాణి కోడలికి మీరు ఆస్తి దానం చేయడం ఏంటి? అని అడుగుతుంది. ఇందులో నీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? నువ్వు సంపాదించావా లేక నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చిందా.. నా భర్త స్వయంగా సంపాదించుకున్న ఆస్తి అని పెద్దావిడ చెప్తుంది. మా నాన్న నిర్ణయాన్నే ధిక్కరించి మాట్లాడుతున్నావా.. నీకేమైనా మతి పోయిందా.. ఆయన అన్నీ ఆలోచించి.. దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటారని తెలుసు కదా.. అని ప్రకాష్ అంటాడు.
చూడమ్మా ధాన్య లక్ష్మి.. రుద్రాణి ఈ ఇంటి ఆడపడుచు. కూతురు మనడికి ఆస్తి ఇచ్చే తప్పేంటి? అని సీతా రామయ్య అంటాడు. నీ అసలు రంగు ఇప్పుడు బయట పడింది. శత కోటి లింగాల్లో.. ఓ బోడి లింగాన్ని ఇస్తుంటే తట్టుకోలేకపోతున్నావా.. అని రుద్రాణి అంటుంది. మా అత్తయ్య అన్నదాంట్లో తప్పేంటి? మీరు ఈ ఇంటి కూతురు కాదు కదా అని అనామిక అంటుంది. అనామికా నీ అనుభవం ఎంత? మా అత్తయ్య రిలేషన్ గురించి నువ్వు మాట్లాడుతున్నావ్ ఏంటి? ఏం హక్కు ఉంది అని కళ్యాణ్ సీరియస్ అవుతాడు. మీ అమ్మ కన్నా.. మీ ఆవిడ నాలుగు ఆకులు ఎక్కువే చదివింది. వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చి తలకు బొబ్బి కట్టింది. అయినా నువ్వెంతే పిల్ల కాకి.. తాతయ్య గారి నిర్ణయాన్ని తప్పు పడుతున్నావా.. అని స్వప్న అంటుంది. స్వప్న మాటలకు ధాన్య లక్ష్మి రియాక్ట్ అవుతుంది.
స్వప్నకు అవసరాలు ఏమైనా వస్తే.. అతని భర్త, అత్తా ఉన్నారు చూసుకుంటారు. కానీ మన ఆస్తులు రాసి ఇవ్వడం ఏంటి? దానం చేసే ఉదార స్వభావం మా మావయ్య గారికి ఉన్నా.. అది తీసుకునే అర్హత మీ అత్తాకోడళ్లకు లేదు అని ధాన్యం అంటుంది. చూడమ్మా.. ధాన్యలక్ష్మి ఒక చిన్న స్థిరాస్తి కోసం.. బంధాలను, బంధుత్వాలను వేరు చేసి మాట్లాడటం సరి కాదని సీతారామయ్య అంటాడు. చూడ ధాన్య లక్ష్మి నేను ఇంటికి వచ్చిన నాలుగేళ్లకు నువ్వు కోడలిగా వచ్చావ్.. నీకు వయసూ సరిపోదు.. అనుభవమూ సరిపోదు.. కాబట్టి నువ్వు నోరు మూసుకుని ఉంటే మంచిదని అపర్ణ అంటుంది. నా భర్తను ధిక్కరిస్తే.. అందరూ వీధిన పడతారు గుర్తు పెట్టుకోండి అని ఇందిరా దేవి అంటుంది.
రేయ్ ప్రకాశం.. నీ భార్య.. కోడలు నాన్న నిర్ణయాన్నే ప్రశ్నిస్తున్నారు. నువ్వు చవట అయితేనే ఇలాంటివి అన్నీ జరుగుతాయి. తీసుకుని వెళ్లు ఇక్కడి నుంచి అని సుభాష్ సీరియస్ అవుతాడు. హేయ్.. లోపలికి నడవ్వే.. అని ధాన్య లక్ష్మిని లోపలికి తీసుకెళ్తాడు ప్రకాష్. మా అమ్మకే అడిగే హక్కు లేదు నువ్వేంటి? వెళ్లు లోపలికి అనామికా అని సీరియస్ అవుతాడు కళ్యాణ్. ఇక అవమానంతో రగిలిపోతూ ఉంటుంది అనామిక. అప్పుడే వాళ్ల అమ్మ శైలు కాల్ చేస్తుంది. ఏంటే ఏంటి పరిస్థితి.. అని అడుగుతుంది. ఏముంది నేను ఒకటి అనుకుంటే.. ఇంకొకటి జరుగుతుందని అనామిక అంటుంది. మరి మీ అత్త ఏం చేస్తుంది? అని అడుగుతుంది. ఆవిడ విలన్‌కి తక్కువ.. కమెడియన్‌కి ఎక్కువ అని చెప్తుంది. మరి నీ భర్త సంగతి ఏంటి నీ మాట వింటున్నాడా అని అడుగుతుంది శైలు. ఆయన వింటే ఇంకెందుకు? ఆయన బయట నేను లోపల పడుకుంటున్నాం అని చెప్తుంది అనామిక. అలా దూరంగా పడుకుంటే.. నీ కాపురం కూడా అలాగే ఉంటుంది. గొడవ వల్ల పని జరగనప్పుడు.. ప్రేమగా ఉంటున్నట్టు దగ్గరికి తీసుకుకో అని తల్లి సలహా ఇస్తుంది. దీంతో ఓకే అంటుంది అనామిక.
మరోవైపు భాస్కర్ ఇంట్లో లేడని సంతోషంగా ఉంటాడు రాజ్. అదే ఆనందంలో కాఫీ తీసుకు రమ్మంటాడు. దీంతో రాజ్‌కి షాక్ ఇద్దామని అంటుంది ఇందిరా దేవి. ప్లాన్ ప్రకారం రాజ్‌కి కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది కావ్య. ప్రోటీన్ షేక్ ఎవరికి.. మీ బావ ఇంట్లో లేడు కదా అని రాజ్ అడుగుతాడు. ఇది మా బావ కోసమే.. గార్డెన్‌లో ఉన్నాడు అని కావ్య చెప్తుంది. దీంతో రాజ్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. వెనుకే వచ్చిన ఇందిరా దేవి.. అతనికి కాలు కాలిందంట కదా.. ఇక్కడ అందరం ఉంటాం కదా చూసుకుంటారు అని నేనే పిలిపించాను రా అని ఇందిరా దేవి అంటుంది. దీంతో రాజ్ బేల ముఖం వేస్తాడు. ఇక కళావతి ప్రోటీన్ షేక్ తీసుకెళ్లి.. వాళ్ల బావకు ఇస్తుంది. ఇక వాళ్లిద్దరూ నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో రాజ్ అంతరాత్మ వచ్చి.. చూడ కళావతి ముఖం ఎంత వెలిగిపోతుందో.. నీ మొహం ఏంట్రా వెలవెల బోతుంది అని అడుగుతాడు. ఏమీ లేదని చెప్తాడు రాజ్. నువ్వు ఇలాగే ఊరుకుంటే.. ఆ బావగాడు కళావతిని ఎప్పుడో ఒకసారి ఎగరేసుకుపోతాడు అని అంతరాత్మ అంటుంది. దీంతో ఆలోచనలో పడతాడు రాజ్. ఇక ఇవాళ్టితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.