Brahmamudi, March 23rd episode: రాజ్‌ని వంశ బహిష్కరణ చేసిన అపర్ణ.. కావ్య ఏం చేయనుంది?

బ్రహ్మముడి సీరియల్‌లో బిడ్డ రాకతో మరింత ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఆ బిడ్డ ఎవరు? రాజ్ ఎందుకు ఇంటికి తీసుకొచ్చాడు? అనేది చాలా ఆసక్తికరంగా మారింది. రాజ్ తన బిడ్డే అని స్వయంగా చెబుతున్నా.. కావ్య నమ్మే పరిస్థితిలో లేదు. మరి ఎవర్ని కాపాడటానికి రాజ్ ఈ కొత్త నాటకం మొదలు పెట్టాడో తెలీడం లేదు. ఆ బిడ్డ కోసం మరి రాజ్ ఎలాంటి అవమానాలను ఎదుర్కొంటాడో చూడాలి. ఇప్పటివరకూ రాజ్ రాజులా తిరిగినా.. ఇకపై అది చెల్లుబాటు కాదు. ఇప్పటికే కళ్యాణ్‌ని ఆఫీస్‌కి బాస్ చేద్దాం..

Brahmamudi, March 23rd episode: రాజ్‌ని వంశ బహిష్కరణ చేసిన అపర్ణ.. కావ్య ఏం చేయనుంది?
Brahmamudi

Updated on: Mar 23, 2024 | 11:51 AM

బ్రహ్మముడి సీరియల్‌లో బిడ్డ రాకతో మరింత ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఆ బిడ్డ ఎవరు? రాజ్ ఎందుకు ఇంటికి తీసుకొచ్చాడు? అనేది చాలా ఆసక్తికరంగా మారింది. రాజ్ తన బిడ్డే అని స్వయంగా చెబుతున్నా.. కావ్య నమ్మే పరిస్థితిలో లేదు. మరి ఎవర్ని కాపాడటానికి రాజ్ ఈ కొత్త నాటకం మొదలు పెట్టాడో తెలీడం లేదు. ఆ బిడ్డ కోసం మరి రాజ్ ఎలాంటి అవమానాలను ఎదుర్కొంటాడో చూడాలి. ఇప్పటివరకూ రాజ్ రాజులా తిరిగినా.. ఇకపై అది చెల్లుబాటు కాదు. ఇప్పటికే కళ్యాణ్‌ని ఆఫీస్‌కి బాస్ చేద్దాం అని ఆలోచిస్తున్న అనామిక ఇప్పటికే తన పాములు కదుపుతుంది. అలాగే రుద్రాణికి కూడా మంచి అవకాశం దక్కింది. అయితే తన భర్త మీద ఉన్న నమ్మకంతో.. ఆ బాబు రాజ్ బిడ్డ కాడని.. మరి ఆ బిడ్డ ఎవరు? ఆ బిడ్డను కన్న తల్లి ఎవరు? అని నిజం తెలుసుకునే ప్రయత్నంలో పడింది కావ్య. ఈ క్రమంలోనే బ్రహ్మముడి సీరియల్ మరింత ఇంట్రెస్టింట్‌గా కొనసాగనుంది.

రాజ్‌కి వంశ బహిష్కరణ..

ఇక ఈ రోజు కూడా బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రిలీజ్ చేయలేదు. కేవలం ప్రోమో మాత్రమే రిలీజ్ చేశారు. ఈ ప్రోమోను బట్టి రాజ్ దుగ్గిరాల వంశ బహిష్కరణకు గురైనట్టు తెలుస్తోంది. అది కూడా తన కన్న తల్లే చెప్పడంతో దుష్టచతుష్టయంకు మంచి అవకాశం దక్కింది. రాజ్ పైనుంచి కిందకు హాలులోకి వస్తాడు. ఇక మామూలుగానే రచ్చ మొదలవుతుంది. రాజ్‌ని చూసిన అపర్ణ.. ఈ కుటుంబానికి ఒక పేరుంది. కొన్ని విలువలు ఉన్నాయి. తరతరాలుగా ఈ వంశానికి వాటన్నింటినీ కాదని.. నువ్వు తప్పు చేశావ్. ఆ తప్పు సరిదిద్దు కోవడానికి నీకో అవకాశం ఇస్తున్నా. ఆ బిడ్డను తన కన్న తల్లి దగ్గరే వదిలేసి రా.. ఈ తుఫాను.. బీభత్సం వదిలేసిరా అని అంటుంది. వీడిని తండ్రి లేని అనాథను చేయలేను అని చెప్తాడు రాజ్.

రాజ్ ఎదుర్కోనున్న అవమానాలు ఎన్నో..

అయితే ఈ ఇంట్లో నిన్ను కానీ.. నీ బిడ్డను కానీ ఈ వంశ వారసులుగా ఎవ్వరూ గుర్తించరు. ఏ రక్త బంధం.. ఏ పేగు పాశం.. రాజ్‌ని.. ఆ పసివాడిని ఈ కుటుంబంలో కలుపుకోవడానికి నేనే సమ్మతించను అని చెప్తుంది. దీంతో రాజ్ ఏం చేస్తాడు? ఎవరెవరు? రాజ్‌తో ఎలా ప్రవర్తిస్తారో చూడాలి. రాజ్‌కి ఎలాంటి అవమానాలు ఎదురవుతాయి? వాటిని రాజ్ ఎలా ఎదుర్కొంటాడు? నిజాన్ని బయట పెడతాడా.. లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

 

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో..

రాజ్‌ని నిలదీసిన కావ్య..

అందరూ ఈ బిడ్డ ఎవరు అని మాత్రమే అడుగుతున్నారు. కానీ ఆ బిడ్డను కన్న తల్లి ఎవరు అని కళావతి.. రాజ్‌ని నిలదీస్తుంది. కానీ రాజ్ మాత్రం మౌనంగా ఉండిపోతాడు. మరి రాజ్ ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాడో తెలీదు.

అపర్ణ – కనకంల మధ్య గొడవ..

మరోవైపు కనకంపై నోరు పారేసుకుంటుంది అపర్ణ. నీ కూతురు జేష్ఠ్యా దేవిలాగా మా గడపలో కాలు మోసిన దగ్గర నుంచే ఈ ఇంటికి అరిష్ఠం చుట్టుకుంది. నా కూతురికి ఇంత అన్యాయం జరిగింది. పైగా దాందే తప్పు అంటే మాత్రం మీకు మర్యాదగా ఉండదు అని కనకం కూడా రివర్స్ వార్నింగ్ ఇస్తుంది. నీ కూతురికి అంత కష్టంగా ఉంటే.. ఆ కష్టాన్ని చూసి మీ కన్న పేగు మెలితిరిగిపోతూ ఉంటే.. ఇంకా ఇక్కడే ఎందుకు ఉణ్నారు? తీసుకుని పోండి అని అపర్ణ అంటుంది. పంపించేయండి.. ఇప్పుడే పంపించేయండి అని కనకం కూడా అనేస్తుంది. ఇంతలో కావ్య ఎంట్రీ ఇచ్చి.. అమ్మా అని గట్టిగా అరుస్తుంది.

కావ్య క్లారిటీ..

నేను పుట్టింటికి ఎందుకు రావాలి? ఏం తప్పు చేశానని రావాలి? ఇక్కడ నాకు న్యాయం ఏంటో జరిగేంతవరకూ పుట్టింటికి వచ్చే ప్రసక్తే లేదని చెప్తుంది. ఆ తర్వాత కృష్టుడి దగ్గరకు వెళ్లి తన బాధను చెప్పుకుంటూ బాధ పడుతుంది.