
ఈ రోజు బ్రహ్మ ముడి ఎపిసోడ్‌లో.. అపర్ణ కావ్యకు నగలు ఇవ్వకపోవడంపై పంచాయితీ నడుస్తుంది. అపర్ణను, ధాన్య లక్ష్మి, రుద్రాణిలు దెప్పి పొడుస్తూ మాట్లాడతారు. దీంతో అహం దెబ్బతిన్న అపర్ణ.. ధాన్య లక్ష్మీ అని గట్టిగా అరుస్తూ.. నీ పనికిమాలిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన పని నాకు పట్టలేదని కోపంతో లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత ధాన్య లక్ష్మి, రుద్రాణిలకు చివాట్లు పెడుతుంది. అపర్ణతో వాదనతో దిగితే.. పెద్ద కోడలిగా అపర్ణ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఆమె సహనాన్ని మీరు పరీక్షించద్దు అని చెబుతుంది పెద్దావిడ. ఆ తర్వాత గదిలో నుంచి బయటకు వస్తూ.. కావ్యకు నగలు తీసుకొచ్చి ఇస్తుంది అపర్ణ. కావ్యకు నగలు ఇవ్వడంతో రుద్రాణిని మనసులో తిట్టుకుంటుంది ధాన్య లక్ష్మి. అపర్ణ కావ్యకు నగలు ఇస్తూండటంతో.. నాకు ఈ నగలు వద్దు. నగలు ఇస్తేనే మీరు నన్ను కోడలిగా ఒప్పుకున్నట్లు కాదని అపర్ణ అంటుంది. దీంతో బలవంతంగా నగలు ఇస్తుంది అపర్ణ. ఇక లోపలికి వెళ్లిన అపర్ణ.. ఆవేశ పడుతూ ఉంటుంది. లోలోపల కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
అప్పుడే కావ్య అపర్ణ గదిలోకి వస్తుంది. ఎంత ధైర్యం ఉంటే నా గదిలోకి అడుగు పెడతావ్ అని కావ్యపై సీరియస్ అవుతుంది అపర్ణ. దీంతో కావ్య వెళ్లిపోతుంది. ఆగు.. ఎందుకు వచ్చావ్? ఎందుకు వెళ్లిపోతున్నావ్? అని అపర్ణ అడుగుతుంది. నా సమాధానం దొరికింది. ఈ నగలు మీరు నాకు మనస్ఫూర్తిగా ఇచ్చారా లేదా అని అడగటానికి వచ్చాను. కానీ మీరు మీ గదిలోకే నన్ను అడుగు పెట్టనివ్వలేదంటే అర్థం చేసుకున్నాను అని కావ్య అంటుంది. నువ్వు తెలివైనదానివని ఒప్పకుంటున్నా.. ఒక్కటి గుర్తు పెట్టుకో.. నా పెద్దరికం నిలుపుకోవడానికి మాత్రమే ఈ నగలు ఇచ్చాను. అంతే తప్పా.. ఎప్పటికీ నిన్ను నా కోడలిగా ఒప్పుకోను అని అపర్ణ అంటుంది. అంటే మీ దృష్టిలో నేను ఒక మర బొమ్మనా. ఈ నగలు వేసుకోవడానికి నా మనసు అంగీకరించకపోతే అని కావ్య అంటే.. అయినా సరే నువ్వు ఈ నగలు వేసుకుని తీరాలి. లేదంటే నా అహంభావం ఒప్పుకోదు. ఇది నా భాద్యత. వేసుకోవడం నీ కర్తవ్యం. వెళ్లు అని అంటుంది అపర్ణ.
ఈ సీన్ కట్ చేస్తే.. కనకానికి కావ్య ఫోన్ చేస్తుంది. నీకో ముఖ్య విషయం చెప్పడానికి కాల్ చేశాను. ఈ రోజు సాయంత్రం ఇక్కడికి రావాలి అని కావ్య అంటే.. ఎందుకు ఆ స్పప్న ఏమన్నా చేసిందా అని కనకం కంగారుగా అడుగుతుంది. కాదు నా గురించి అని కావ్య అంటుంది. నువ్వేం చేశావ్ అని కనకం అడుగుతుంది. ఎప్పుడూ మేమే ఏదో ఒకటి చేయాలా.. ఇక్కడే ఏదో ఒకటి జరగొచ్చు కదా అని కావ్య చెప్తుంది. అయ్యో మీ పెళ్లి రోజు కదా మర్చిపోయానే.. అయితే మీ పెళ్లి రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలి అనుకుంటున్నారా.. సరేలే అల్లుడి గారిలో ఏమన్నా మార్పు వచ్చిందా అని కనకం అడిగితే.. చాలా మార్పు వచ్చింది. అందుకే మిమ్మల్ని కూడా పిలవమన్నారు. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నారని కావ్య చెప్తుంది. దీంతో కనకం తెగ సంతోష పడుతుంది.
ఆ తర్వాత పూజకు అంతా సిద్ధం చేస్తుంది కావ్య. అక్కడ ధాన్య లక్ష్మి, ప్రకాశం కామెడీ అదిరిపోతుంది. నెక్ట్స్ అపర్ణ కూడా రెడీ అవుతుంది. ఈలోపు ధాన్య లక్ష్మి, రుద్రాణిలు వచ్చి.. అపర్ణకు సెటైర్లు వేస్తారు. రాజ్‌కి ఈ పూజ ఇష్టం లేదోమో.. అందుకే ఇంకా కిందకు రాలేదని ధాన్య లక్ష్మి, రుద్రాణిలు అంటారు.దీంతో వెంటనే వాళ్లిద్దరికీ కౌంటర్స్ వేస్తుంది అపర్ణ. ఇక దాంపత్య వ్రతం మొదలవుతుంది. రాజ్ ఇంకా రాకపోవడంతో టెన్షన్ పడతారు. అంతలోనే రాజ్ వస్తాడు. ఇద్దరూ కలిసి పూజలో కూర్చుంటారు. రాజ్ మనసులో ఏముందని ఇందిరా దేవి, కావ్య ఆందోళన పడతారు. అలా పూజ పూర్తి అవుతుంది. ఆ నెక్ట్ హారతి వెలిగించి.. దానిపై ప్రమాణం చేయమంటారు. కావ్య చేసినా.. రాజ్ మాత్రం చేయడు. ఇంతలో హారతి పల్లెం కింద పడుతుంది. మళ్లీ అపర్ణ వెలిగించే లోపు లేట్ అవుతుందని రాజ్ వెళ్లిపోతాడు. దీంతో కావ్య ఏం జరుగుతుందా అని భయ పడుతుంది.
ఇక రాత్రి అవుతుంది. కావ్య, రాజ్‌ల పెళ్లి రోజు వేడుకలకు అంతా సిద్ధం అవుతుంది. ఇల్లంతా డెకరేషన్ చేస్తారు. కావ్య ఏ చీర కట్టుకోవాలా అని వెతుకుతూ ఉంటుంది. అప్పుడే పెద్దావిడ వచ్చి అన్నీ చూస్తుంది. అమ్మా కావ్య అని పిలుస్తుంది. ఏంటి ఇంకా ఇలానే ఉన్నావ్? రెడీ కాలేదా? ఈ చీరలన్నీ ఏంటి? అని అడుగుతుంది. ఏది కట్టుకోవాలో తెలీడం లేదు. ఏది తట్టుకోవాలో అర్థం కావడం లేదు. ఏదీ తట్టుకునే శక్తి నాలో లేదు. అందుకే కంగారుగా.. దిగులుగా ఉంది. ఏమో.. ఆయన వస్తే ఏం చేస్తారో.. విడాకులు ఇచ్చి విడిపోదాం అంటారో.. కానుకలు ఇచ్చి కలిసి పోదాం అంటారో ఏమీ అర్థం కావడం లేదని కావ్య బాధ పడుతుంది. దీంతో పెద్దావిడ కావ్యకు ధైర్యం చెబుతుంది. ఇక ఈ రోజుతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఇంట్రెస్టింగ్ విషయంతో మళ్లీ కలుద్దాం.