AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmamudi, March 18th episode: అనామిక పరువు తీసేసిన కళ్యాణ్.. పెద్దావిడను టెన్షన్‌లో పెట్టిన రాజ్..

ఈ రోజు బ్రహ్మముడి సీరియల్‌లో.. దుగ్గిరాల ఇంటికి అనామిక ఫ్రెండ్స్ వస్తారు. ఇంట్లోని అందర్నీ పరిచయం చేస్తుంది అనామిక. ఇక అందరూ సరదాగా మాట్లాడుతూ ఉంటారు. ఇంతకీ మీ వారు ఎక్కడ? అని ఫ్రెండ్స్ అడుగుతారు. చెప్పాను కదా.. మావారు బిజినెస్ మొత్తం చూసుకుంటారు అని.. ఆ బిజీలో ఉన్నట్టున్నారు. సిటీలో మొత్తం 25 బ్రాంచులు ఉన్నాయి కదా.. అన్నింటినీ చూసుకోవాలి అంటే టైమ్ ఎక్కడ ఉంటుంది చెప్పు? అని అనామిక అంటుంది. అనామిక చెప్పిన మాటలకు..

Brahmamudi, March 18th episode: అనామిక పరువు తీసేసిన కళ్యాణ్.. పెద్దావిడను టెన్షన్‌లో పెట్టిన రాజ్..
Brahmamudi
Chinni Enni
|

Updated on: Mar 18, 2024 | 12:12 PM

Share

ఈ రోజు బ్రహ్మముడి సీరియల్‌లో.. దుగ్గిరాల ఇంటికి అనామిక ఫ్రెండ్స్ వస్తారు. ఇంట్లోని అందర్నీ పరిచయం చేస్తుంది అనామిక. ఇక అందరూ సరదాగా మాట్లాడుతూ ఉంటారు. ఇంతకీ మీ వారు ఎక్కడ? అని ఫ్రెండ్స్ అడుగుతారు. చెప్పాను కదా.. మావారు బిజినెస్ మొత్తం చూసుకుంటారు అని.. ఆ బిజీలో ఉన్నట్టున్నారు. సిటీలో మొత్తం 25 బ్రాంచులు ఉన్నాయి కదా.. అన్నింటినీ చూసుకోవాలి అంటే టైమ్ ఎక్కడ ఉంటుంది చెప్పు? అని అనామిక అంటుంది. అనామిక చెప్పిన మాటలకు అపర్ణ, ఇందిరా దేవి, కావ్యా, రుద్రాణి అందరూ షాక్ అవుతారు. మొత్తం అంతా తనే చూసుకోవాలి అంటే చాలా టాలెంట్ కావాలి అని ఫ్రెండ్ పొగుడుతూ ఉంటారు. అనామిక మాటలకు ధాన్యం కూడా సపోర్ట్ చేస్తుంది. మరి కావ్య గారి భర్త ఏం చేస్తారు అని ఫ్రెండ్స్ అడుగుతారు. తను కూడా చేస్తారు. కాకపోతే మా ఆయనకు హెల్ప్ చేస్తారు అని చెప్తుంది అనామిక. హెల్ప్ చేస్తాడా.. ఇది గనుక రాజ్ వింటే పాతేస్తాడు అని రుద్రాణి లోపల అనుకుంటుంది. ఇలా మాట్లాడుతూ ఉండగానే.. కళ్యాణ్ వస్తాడు. అబ్బా ఈయన ఏంటి టైమ్ కి వచ్చారు ఏం చేయాలి.. అని రా కళ్యాణ్ వీళ్లు నా కాలేజ్‌మేట్స్ అని అనామిక అంటుంది.

అనామిక పరువు తీసేసిన కళ్యాణ్..

మీరు చాలా గ్రేట్ అండి.. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉండి ఇలా సింపుల్‌గా ఉన్నారు అని ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. ఏవండీ మీకు ఆఫీస్‌కి టైమ్ అవుతున్నట్టు ఉంది కదా.. వెళ్లండి అని అనామిక అంటుంది. చూడండీ.. నేను ఏ కంపెనీలు చూసుకోవడం లేదు. అవి మొత్తం మా ఆన్నయ్య రాజే చూసుకుంటున్నారు. కంపెనీస్ అన్నీ మాకు ఉన్నాయి కానీ.. అవేమీ నేను చూసుకోను. నేను ఒక రైటర్‌ని చెప్పుకునేంతగా నేనేమీ సాధించలేదు. మీ ముందు నామోషీగా ఉంటుందని అలా చెప్పింది అంతే అని కళ్యాణ్ అంటాడు. దీంతో అనామిక ఫ్రెండ్స్ షాక్ అవుతారు. ఏంటి అనామిక ఇది? లేని పోని గొప్పలు చెప్పుకోవడం ఎందుకు? నువ్వు ఎలా ఉన్నా మా ఫ్రెండేనే? కళ్యాణ్‌ లాంటివాడు దొరకడం మా అదృష్టం. నువ్వు మారిపోయావ్ అనుకున్నాం. ఇంకా ఆ పాత అనామికలానే ఉన్నావు. కనీసం ఇప్పుడైనా మారు అని ఫ్రెండ్స్ చెప్పి వెళ్లిపోతారు. నిమిషం పరిచయంలోనే కళ్యాణ్ గురించి మీ ఫ్రెండ్స్ అర్థం చేసుకున్నారు. కానీ నువ్వే ఇంకా అర్థం చేసుకోలేదని అపర్ణ అంటుంది. కళ్యాణ్ కూడా మీ అబ్బాయిలాగా గొప్పగా బతుకుతుంటే.. గొప్పగా పరిచయం చేసేదాన్ని. ఇలా అబద్దాలు చెప్పాల్సిన కర్మ పట్టేదే కాదు అని అనామిక వెళ్లిపోతుంది.

కళ్యాణ్‌కు వారం గడువు ఇచ్చిన అనామిక..

ఈ సీన్ కట్ చేస్తే.. కళ్యాణ్ దగ్గరకు వచ్చి.. నీకు ఇప్పుడు ప్రశాంతంగా ఉందా కళ్యాణ్? అని అనామిక అంటే.. నాకు కాదు ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉంటుంది. ఇకపై మీ ఫ్రెండ్స్‌కి అబద్దాలు చెప్పాల్సిన పని లేదని కళ్యాణ్ అంటాడు. చాలు ఆపు.. వాళ్ల ఫ్రెండ్స్ ముందు పరువు తీసింది కాక.. ిప్పుడు కవితలు చెప్తున్నావా అని ధాన్య లక్ష్మి అంటుంది. నాకు అక్కర్లేదు.. నేను ఒక మమూలు అమ్మాయిని. అందరి ముందూ గొప్పగా బతకాలని ఆలోచించే సాదాసీదా అమ్మాయిని. నా మొగుడు సంపాదిస్తేనే నాకు సంతోషంగా ఉంటుందని అనామిక అంటే.. అందుకేగా కష్ట పడుతున్నా అని కళ్యాణ్ అంటాడు. నాకు నమ్మకం లేదని అనామిక అంటే.. ఇంత పెద్ద సామ్రాజ్యం తయారు చేయడానికి తాతయ్యకు జీవిత కాలం పట్టింది. అలాగే నాకూ సమయం కావాలి కదా అని కళ్యాణ్ అంటాడు. ఎంత టైమ్ కావాలి? చెప్పు.. అప్పటివరకూ ఎదురు చూస్తాను. వారం రోజుల్లో ఒక చిన్న అవకాశం తెచ్చుకో చాలు అని అనామిక అంటే.. తెచ్చుకుంటా.. అలా తెచ్చుకోకపోతే.. నువ్వు ఏం చెప్తే అది చేస్తాను అని కళ్యాణ్ అంటాడు. సరే ఇదే మాట మీద ఉండు.. ఆంటీ మీరే సాక్షం.. వారం రోజుల్లో ఒక్క అవకాశం తెచ్చుకోకపోతే.. ఆ తర్వాత నేను చెప్పినట్టు చేయాలి అని అనామిక అంటుంది.

ఇవి కూడా చదవండి

రాజ్, కావ్యల పెళ్లి సెలబ్రేషన్స్..

ఈ సీన్ కట్ చేస్తే.. విడాకుల గురించి తలుచుకుంటూ ఉంటుంది. ఈలోపు సీతా రామయ్య.. నీళ్లు ఇమ్మని పిలుస్తాడు. అప్పుడే సరిగ్గా రాజ్ వస్తాడు. హమ్మయ్య అందరూ ఇక్కడే ఉన్నారు. నేను చెప్పాల్సిన విషయం ఇప్పుడే చెప్తాను. నీ కొడుకు చేసిన నిర్వాకం గురించి అని సస్పెన్స్‌లో పెడుతుంది ఇందిరా దేవి. అదే సరిగ్గా వాళ్ల పెళ్లి అయి రేపటికి సంవత్సరం అవుతుందని అంటుంది. అప్పుడే సంవత్సరం అయిందా.. నాకు ఇష్టం లేని మనిషిని సంవత్సరం భరించానా.. వీళ్లు వీడిపోరు. నేను కలిసిపోను. కావ్య నచ్చకపోయినా ధాన్య లక్ష్మి మీద కోపంతో.. కోడలి హోదాను కట్టబెట్టాను అని మనసులో అనుకుంటుంది అపర్ణ. ఆ తర్వాత కావ్య గురించి చెప్తూ పొగుడుతుంది ఇందిరా దేవి. పెద్దావిడ మాటలను సుభాష్ కూడా ఒప్పుకుంటాడు. రాజ్, కావ్యల పెళ్లి రోజును గ్రాండ్‌గా చేయాలని అనుకున్నామని ఇందిరా దేవి అంటుంది. ఇప్పుడు ఈ పార్టీలు, సెలబ్రేషన్స్ అవసరమా.. నా కొడుకు మొహంలో ఆనందమే లేదని అపర్ణ మనసులో తిట్టుకుంటుంది.

అందర్నీ సస్పెన్స్‌లో పెట్టిన రాజ్..

మధ్యలో ధాన్య లక్ష్మి.. పుల్ల విరుపు మాటలకు అపర్ణ కూడా ఓకే అంటుంది. అత్తయ్యా సెలబ్రేషన్స్‌ని ఘనంగా జరిపిద్దాం అని అపర్ణ అంటుంది. ఏరా మనవడా నువ్వేం అంటావ్ అని పెద్దావిడ అడిగితే.. మీరందరూ నచ్చినన్ని ఏర్పాట్లు చేసుకోండి. నేనేమీ అభ్యంతరం చెప్పను. అలానే నేను కూడా మీ అందరికీ ఓ విషయం చెప్పాలి అనుకుంటున్నా. నా జీవితానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నా. అంతకు మించి ఇప్పుడేం చెప్పలేను. రేపే ఎందుకు చెప్పాలి? అందరం ఇక్కడే ఉన్నాం కదా.. అని ఇందిరా దేవి, రుద్రాణి అడుగుతారు. కానీ కళావతి పుట్టింటి వాళ్లు కూడా ఉండాలి అని రాజ్ బాంబ్ పేల్చుతాడు. దీంతో కావ్య, ఇందిరా దేవి కంగారు పడతారు. ఇక రాజ్ గదిలో నిద్రపోతాడు. కావ్య లేపి.. ఉదయం అడిగినదానికి మీ నిర్ణయం చెప్పండి అని కావ్య అడుగుతుంది. కింద చెప్పాను కదా అని రాజ్ అంటే.. కాదు ఇవాళే.. ఇప్పుడే చెప్పండని కావ్య అడుగుతుంది. మన మధ్య బంధం రెండు కుటుంబాలకు సంబంధించి కాదు.. అందరి ముందూ చెప్తాను అని రాజ్ చెప్తాడు. ఈ లోపు రాజ్ అంతరాత్మ బయటకు వచ్చి.. అదేంటో కనీసం నాకైనా చెప్పురా అని అంటుంది. అందరితో పాటూ నువ్వు కూడా రేపే తెలుసుకో అని రాజ్ అంటాడు.

పెద్దావిడ దాంపత్య వ్రతం..

ఇక తెల్లవారుతుంది. ఏ కాలంలో పుట్టాల్సినదానివి ఏ కాలంలో పుట్టావ్? పెళ్లి అయి సంవత్సరం అయినా.. మొగుడిని కొంగున కట్టుకోవడం చేత కాలేదని కావ్యని తిడుతుంది. నీ కంటే ఎక్కువ నేను హడలి పోతున్నాను. ఆ బడవ బాంబ్ పేల్చి పోయినప్పటి నుంచి నాకు కాళ్లూ చేతులు ఆడటం లేదు. నువ్వు వద్దూ వద్దూ అని చెప్పినా వినకుండా నేనే విడాకులు పత్రాలు పంపించి తప్పు చేశానా అని నేనే తిట్టుకుంటున్నా అని పెద్దావిడ అంటుంది. మరి ఇప్పుడే ఏంట చేద్దాం అని కావ్య అంటుంది. ఇవాళ మీతో దాంపత్య వ్రతం చేయిద్దాం అనుకుంటున్నా. అందులో నీతోనే జీవితాంతం చేయి పట్టుకుని ఉంటానని ప్రమాణం చేయిస్తా అని పెద్దావిడ చెప్తుంది. ప్రమాణం చేస్తే మాట మీద నిలబెడతాడు అని ఇందిరా దేవి అంటుంది. అనుకునట్టుగానే అందరికీ ఈ వ్రతం గురించి చెప్తుంది ఇందిరా దేవి. ఇప్పుడు ఎందుకు? తర్వాత చేయిద్దాం అని అపర్ణ అంటే.. ఈలోపు రుద్రాణి, ధాన్య లక్ష్మిలు పుల్లలు పెడతారు. దీంతో వ్రతానికి ఒప్పుకుంటుంది అపర్ణ. ఆ తర్వాత నగల గురించి పంచాయితీ పెడుతుంది రుద్రాణి. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.