Brahmamudi, July 1st Episode: అనామికతో కళ్యాణ్ విడాకులు.. నీ మొగుడు పరువు నువ్వే తీస్తున్నావ్!

|

Jul 01, 2024 | 1:24 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్‌ని తన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని అనామిక మీడియాలో చర్చ మొదలు పెడుతుంది. తనకు జరిగిన అన్యాయాన్ని అన్ని న్యూస్ ఛానెల్స్‌కి చెప్పి దొంగ ఏడుపులు చేస్తుంది. మీడియా కూడా అనామికకు జరిగిన అన్యాయాన్ని పెద్దదిగా చేసి చెబుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీ అనామికను ఇబ్బంది పెట్టారని, జీవితాన్ని నాశనం చేసింది. అనామిక ఇలా అవడానికి కారణం.. కళ్యాణే కారణమని, తను అప్పూ తో సంబంధం పెట్టుకుని, అనామికకు అన్యాయం చేశాడని..

Brahmamudi, July 1st Episode: అనామికతో కళ్యాణ్ విడాకులు.. నీ మొగుడు పరువు నువ్వే తీస్తున్నావ్!
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్‌ని తన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని అనామిక మీడియాలో చర్చ మొదలు పెడుతుంది. తనకు జరిగిన అన్యాయాన్ని అన్ని న్యూస్ ఛానెల్స్‌కి చెప్పి దొంగ ఏడుపులు చేస్తుంది. మీడియా కూడా అనామికకు జరిగిన అన్యాయాన్ని పెద్దదిగా చేసి చెబుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీ అనామికను ఇబ్బంది పెట్టారని, జీవితాన్ని నాశనం చేసింది. అనామిక ఇలా అవడానికి కారణం.. కళ్యాణే కారణమని, తను అప్పూ తో సంబంధం పెట్టుకుని, అనామికకు అన్యాయం చేశాడని చెబుతోంది. ప్రస్తుతం అనామికతో పాటు మన స్టూడియోలో ఉమెన్స్ వెల్ఫేర్ సంస్థ సభ్యురాలు శ్రీమతి ఝాన్సీ గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు. అనామిక జీవితం గురించి వారు ఏం అంటారో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం అని చెబుతోంది. ఇప్పుడు టీవీలో జరిగేది అంతా దుగ్గిరాల ఫ్యామిలీ ఇంట్లో టీవీలో చూస్తూ ఉంటుంది. రుద్రాణి అయితే ఎంతో సంతోషంగా చూస్తుంది. మరోవైపు కనకం, అప్పూ, కృష్ణ మూర్తిలు కూడా ఇంట్లో చూస్తూ ఉంటారు.

దుగ్గిరాల ఫ్యామిలీ పరువు పోయిందిగా..

అనామిక గారు మీ ప్రాబ్లమ్‌ని చెప్పండని యాంకర్ అంటే.. కళ్యాణ్ గొప్పింటి వాడు. కానీ సంస్కారం తెలియదు. వాళ్లకు ఎన్ని కంపెనీలు ఉన్నా ఉద్యోగం మాత్రం అస్సలు చేయడు. అప్పూతో కలిసి తిరుగుతూ ఉంటాడు. వాళ్లిద్దరూ కలిసి హోటల్‌లో దొరికినా సరే.. తప్పు అంతా నాదే అంటూ నిందలు వేశాడు. అతనికి తన ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది. బెడ్‌ రూమ్‌లో కళ్యాణ్ నాకు నరకం చూపించేవాడు. ఈ విషయం ఇంట్లో ఎవరికీ నమ్మేవారు కాదు. పైగా విడాకులు కావాలని ఈ మధ్య నాకు టార్చర్ మొదలు పెట్టాడు. డివోర్స్ పేపర్స్‌పై సంతకం చేయాలని ఒత్తిడి చేశారు. ఆ ఇంట్లో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. దుగ్గిరాల ఫ్యామిలీ అంటే ఎంతో గొప్ప ఫ్యామిలీ అంటారు కానీ.. నాకు రక్షణ లేదు. ఇదిగోండి విడాకుల పత్రాలు అని చూపిస్తుంది అనామిక. ఇప్పుడు నా సమస్య ఎవరు తీర్చుతారు? నాకు న్యాయం ఎవరు చేస్తారు మీరే చెప్పండి అని అనామిక బాధ పడుతుంది.

యాంకర్‌కి ఝలక్..

అనామిక మాట్లాడిన తర్వాత మహిళా నాయకురాలు ఝాన్సీ మాట్లాడుతుంది. నేను ఎవర్నీ ఏమీ అనను. నేను ఎమైనా అనాలంటే.. మిమ్మల్నే అనాలి. మీరే మన్నా దుగ్గిరాల కుటుంబ సభ్యులా.. అని యాంకర్‌ని అడుగుతుంది ఝాన్సీ. అయ్యో కాదని యాంకర్ అంటే.. మరి మొత్తం మీరే అక్కడ ఉండి చూసినట్టు అలా ఎలా చెప్తారు. అప్పూ మాయలో పడి అనామికతో విడిపోవాలని కళ్యాణ్ అనుకున్నట్లు మీరు ఎలా డిసైడ్ చేస్తారు? మీకు ఎవరు ఇచ్చారు ఆ అధికారం? అనామిక.. అప్పూ వల్ల తన కాపురం పాడై పోతుందని ఆరోపిస్తున్నట్టు చెప్పాలి. ఆ ఆరోపణల్లో నిజం ఎంత ఉందో చెప్పాలి. నేను మిమ్మల్ని కానీ.. ఈ ఛానెల్‌ని కానీ.. మాట్లాడటం లేదు. కేవలం అనామిక సమస్యని విశ్లేషిస్తూ మాట్లాడుతున్నా.

ఇవి కూడా చదవండి

అనామికను ఏకి పారేసిన మహిళా నాయకురాలు..

ఏమ్మా అనామిక నీకు పెళ్లి అయ్యి ఎన్ని ఏళ్లు అవుతుందని అడుగుతుంది. నాలుగు నెలలు అయ్యిందని అనామిక చెబుతుంది. మీరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారా.. అరేంజ్‌డ్ మ్యారేజా? అని ఝాన్సీ అడిగితే.. ముందు మేము లవ్ చేసుకున్నాం. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని అనామిక చెబుతుంది. మరి ప్రేమించినప్పుడు తెలీదా.. అతను ఏ పనీ చేయడని అని ఝాన్సీ అడిగితే.. అతను కవిత్వం రాస్తాడు. అది నచ్చే నేనూ ప్రేమించానని అనామిక అంటుంది. ఆ తర్వాత అతని పని నచ్చలేదా? అతను నచ్చలేదా.. కవిత్వం ఒక కళ మాత్రమే కాదు.. అదొక విద్య. బిజినెస్ చూసుకోవడానికి ఎవరూ లేరా? అని ఝాన్సీ అడిగితే.. ఉన్నారు.. కానీ అతను చూసుకోడని అంటుంది. ఎలా చూసుకుంటాడు. అతను కవిత్వం రాస్తున్నాడు కదా.. ప్రేమించుకునే ముందు తెలీదా? అని ఝాన్సీ అంటుంది. మేడమ్ నేను ఇప్పుడు నా కాపురం గురించి మాట్లాడినికే వచ్చాను. నా భర్త అప్పూతో జరిపే ప్రేమాయణం గురించి మాట్లాడితే బావుంటుందని అనామిక అంటుంది.

అనామిక తరపున పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం..

నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకొనేటప్పుడు.. అప్పూ గురించి మీకు తెలీదా? వాళ్లిద్దరూ ముందే ప్రేమించుకోలేదా? అని ఝాన్సీ అడగితే.. అప్పటి నుంచి వాళ్లిద్దరి మధ్య వ్యవహారం జరుగుతూనే ఉందని అనామిక అంటుంది. ఎలా తెలిసిందని ఝాన్సీ అడిగితే.. వాళ్లిద్దరూ హోటల్‌లో దొరికారు. పెళ్లి తర్వాత కూడా కళ్యాణ్‌.. అప్పూతో సంబంధం పెట్టుకోవడం ఏంటి? ఇదే ఛానెల్ కూడా ఆ న్యూస్‌ని కవరేజ్ చేసిందని అనామిక చెబుతుంది. ఆ విజువల్స్ చూసిన ఝాన్సీ.. ఇది అయితే ఆలోచించాల్సిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు.. తను తప్పు చేసింది కాగా.. విడాకులు కావాలని ఒత్తిడి తీసుకురావడం నేరం. కాబట్టి మేము అనామిక తరపున పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని ఝాన్సీ అంటుంది.

నీ భర్త పరువు నువ్వే తీస్తున్నావ్..

ఈ సీన్ కట్ చేస్తే.. అనామిక బయటకు వస్తుంది. అనామికను చూసిన పేరెంట్స్.. అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా బేబీ. అని సుబ్రమణ్యం అడుగుతాడు. తెలిసే అంతా చేస్తున్నా డాడ్.. ఇప్పుడే కరెక్ట్‌గా చేస్తున్నా అని అనామిక అంటే.. లేదు నువ్వు తప్పు చేస్తున్నావ్ బేబీ.. నీ మొగుడు పరువు నువ్వే తస్తున్నావ్ అని సుబ్రమణ్యం అంటే.. నువ్వే కావాలనే అల్లుడి గారిని ఇరికించావి తల్లి శైలు కూడా మందలిస్తుంది. కానీ వినిపించుకోను పొగరు బోతు అనామిక.. ఎలాగైనా కళ్యాణ్‌ని నా కాళ్ల దగ్గరకు తీసుకొస్తానని అంటుంది. నీ హస్పెండ్‌ని నీ గుప్పింట్లో పెట్టుకోవాలని చెప్పాం కానీ.. బానిసగా చేసుకోమని కాదమ్మా అని తండ్రి అంటే.. నా గుప్పింట్లో ఉండటం లేదు డాడ్.. అందుకే బానిసలా చేస్తాను అని అనామిక అంటుంది. వాళ్లు సొసైటీలో ఎంతో పేరు ఉన్నవాళ్లు. మీడియాలో వచ్చినంత మాత్రాన భయపడి పోతారు అనుకుంటున్నావా? నువ్వు చేసిన పనికి కోపం తెచ్చుకుంటారమ్మా అని తల్లి, తండ్రి అంటే.. ఈ విషయం ఇక్కడితో ఆగను మామ్.. ఇంకా చాలా ఉందని అనామిక నవ్వుతుంది.

అనామికతో కళ్యాణ్ విడాకులు.. ఇంటికి పోలీసులు..

ఈ సీన్ కట్ చేస్తే.. అనామిక చేసిన పనికి.. దుగ్గిరాల ఇంట్లో కళ్యాణ్, రాజ్‌, కావ్య, ధాన్య లక్ష్మి అందరూ ఆలోచనలో పడతారు. రుద్రాణి, రాహుల్‌లు మాత్రం ఆనం పడతారు. ఇక తెల్లవారుతుంది. కళ్యాణ్‌ విడాకులు తీసుకోవడానికి నేను ఒప్పుకుంటున్నా అని రాజ్ చెప్తాడు. ఏవండీ తొందర పడి నిర్ణయం తీసుకోకండి అని కావ్య అంటుంది. ఇంత గొడవ చేసింది.. విడాకులు అడిగితే ఇచ్చేస్తుందా అని రుద్రాణి అంటే.. ఇచ్చేలా నేను చేస్తానని రాజ్ అంటాడు. కానీ ఇందుకు అంగీకరించాల్సింది పిన్నీ, బాబాయ్. నువ్వు చెప్పు పిన్నీ ఏం చేద్దామని రాజ్ అంటే.. ఇంత గొడవ జరిగిన తర్వాత.. దాన్ని కోడలిగా ఎలా ఒప్పుకుంటానని ధాన్య లక్ష్మి అంటుంది. ఇక అప్పుడే పోలీసులు వచ్చి.. కళ్యాణ్‌‌ని అరెస్ట్ చేయాలి అంటారు. ఎందుకు అని రాజ్ అంటే.. విడాకుల కోసం మీ తమ్ముడు టార్చర్ చేస్తున్నారని అనామిక గారు కేసు పెట్టారని చెప్తారు. వెంటనే ధాన్య లక్ష్మి అనామికకు ఫోన్ చేయాలని చూస్తే.. పిన్నీ ఇదంతా అనామిక కావాలనే చేస్తుంది. ఏం చేయాలో నేను చూసుకుంటానని రాజ్ అంటాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.