Brahmamudi, December 2nd episode: అనామిక, కళ్యాణ్ ల పెళ్లి క్యాన్సిల్.. కనకం కుట్రను కనిపెట్టనున్న రుద్రాణి!

|

Dec 07, 2023 | 11:36 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో అరుణ్ గురించి ఆలోచిస్తూ.. బోర్డు మీద డ్రాయింగ్ గీస్తూ ఏదో చెప్తుంది కావ్య. దానికి రాజ్ సెటైర్లు వేస్తూ ఉంటాడు. అరుణ్ కావాలనే పారిపోయాడు.. తప్పించుకున్నాడు.. ఎస్కేప్ అయ్యాడు అంటూ అంటుంది కావ్య. ఇక రాజ్ కి చిరాకు వచ్చి.. ఇంట్లో అందరూ వాడి గురించి వదిలేసాక నువ్వెందుకు ముగ్గులు గీస్తూ.. ఆలోచిస్తున్నావ్ అని అంటాడు రాజ్. ఎక్కడా లేకుండా.. ఫోన్ పని చేయడం లేదంటే కావాలనే తప్పించుకుని తిరుగుతున్నాడనే కదా అర్థం అని కావ్య అంటే.. వాడి గురించి నువ్వు వదిలేయ వచ్చు కదా..

Brahmamudi, December 2nd episode: అనామిక, కళ్యాణ్ ల పెళ్లి క్యాన్సిల్.. కనకం కుట్రను కనిపెట్టనున్న రుద్రాణి!
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో అరుణ్ గురించి ఆలోచిస్తూ.. బోర్డు మీద డ్రాయింగ్ గీస్తూ ఏదో చెప్తుంది కావ్య. దానికి రాజ్ సెటైర్లు వేస్తూ ఉంటాడు. అరుణ్ కావాలనే పారిపోయాడు.. తప్పించుకున్నాడు.. ఎస్కేప్ అయ్యాడు అంటూ అంటుంది కావ్య. ఇక రాజ్ కి చిరాకు వచ్చి.. ఇంట్లో అందరూ వాడి గురించి వదిలేసాక నువ్వెందుకు ముగ్గులు గీస్తూ.. ఆలోచిస్తున్నావ్ అని అంటాడు రాజ్. ఎక్కడా లేకుండా.. ఫోన్ పని చేయడం లేదంటే కావాలనే తప్పించుకుని తిరుగుతున్నాడనే కదా అర్థం అని కావ్య అంటే.. వాడి గురించి నువ్వు వదిలేయ వచ్చు కదా.. మీ అక్క అన్నీ మర్చిపోయి హ్యాపీగా తన పని తాను చేసుకుంటుంది. అన్ని నిందలు పడ్డా దులిపేసుకుని తిరుగుతుంది. నీకెందుకు ఇవన్నీ అని రాజ్ అంటే.. వదిలేస్తే నింద నిజం అవుతుందండి అని కావ్య అంటే.. వదిలేయక పోతే నాకు మండుతుంది అని రాజ్ అంటాడు.

కావ్య బెట్టుతనం.. రాజ్ చిలిపితనం..

ఇక తన స్టైల్ లో ఓ రేంజ్ లో కావ్య రెచ్చి పోతుంది. నా రక్తం ఉడికి పోతుంది.. సలసలమని మరిగి పోతుందని కావ్య అంటే.. రాజ్ చిరాకుతో ఆపవే నీ రక్త చరిత్ర అని అంటాడు. ఆపను అండి.. మీరేం చేస్తారు అని కావ్య అంటే.. బొమ్మ దగ్గరకు వెళ్లి దీన్ని వదిలేస్తా అని అంటాడు. అయ్యో అది నా పుట్టింటి నుంచి ఇష్టపడి తెచ్చుకున్న బొమ్మ అండి.. ఎంత కసాయి వారెండి మీరు.. ఆ మట్టి బొమ్మ పగలకొడతారా అని కావ్య అంటే.. మరి నువ్వు ఈ విషయాన్ని వదిలేస్తావా లేదా అని అడుగుతాడు రాజ్. వదలను అని కావ్య చెప్తే.. సరే అయితే నేనే వదిలేస్తా అని.. వదిలేసి పట్టుకుంటాడు. మరోసారి నువ్వు అరుణ్ విషయం తీసుకొస్తే.. ఈ సారి నిజంగానే వదిలేస్తా అని అంటాడు రాజ్.

కళ్యాణ్ కాల్ కట్ చేసిన అప్పూ.. ఇరుక్కు పోయిన రుద్రాణి:

ఈ సీన్ కట్ చేస్తే.. కళ్యాణ్.. అప్పూకి కాల్ చేస్తాడు. కానీ అప్పూ కాల్ కట్ చేస్తుంది. ఇదేంటి ఎంగేజ్ మెంట్ గురించి చెబుదాం అనుకుంటే కాల్ కట్ చేసిందని కళ్యాణ్ అనుకుంటాడు. మళ్లీ కళ్యాణ్ కాల్ చేస్తే.. కట్ చేస్తుంది అప్పూ. అప్పుడే కనకం వస్తుంది. ఇక కనకం ఫోన్ తీసుకుని.. అప్పూకి కాల్ చేయబోతాడు కళ్యాణ్. వెంటనే కనకం ఫోన్ లాక్కుని.. వద్దు.. నేను ఇందాకే పిలిచాను. వస్తానని చెప్పింది అని అంటే.. మరి నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని కళ్యాణ్ అంటాడు. ఏమో బాబు నాకు తెలీదు.. వస్తుంది కదా అడగండి అని కనకం అంటుంది. ఇక అక్కడి నుంచి వెళ్లి పోతాడు కళ్యాణ్. ఇక కనకం లోపలికి వెళ్లి.. బట్టలు తెచ్చుకోలేదే.. స్నానం చేయాలంటే ఎలా అని అనుకుంటుంది. అప్పుడే రుద్రాణి గారి చీరలు ఉన్నాయి.. ఇప్పటికి వాటితో సర్దుకుందాం లే అని డోర్ తీస్తే రాదు.

ఇవి కూడా చదవండి

నా గదిలో ఉండటానికి వీల్లేదన్న రుద్రాణి..

ఆ తర్వాత డోర్ కొట్టినా తీయదు రుద్రాణి. అయినా డోర్ ఓపెన్ చేయాలి అంటే తాళమే కావాలా ఏంటి? అని డోర్ తీసి లోపలికి వెళ్తుంది కనకం. ఇక తాళం వేసానని.. కనకం రాదని తెలిసి సంబర పడుతుంది. కాస్త ఆగి వెళ్దాంలే అని రుద్రాణి అనుకుంటుంది. చీరలు దొరకలేదని.. రుద్రాణి నైటీ వేసుకుంటుంది కనకం. సరిగ్గా అప్పుడే రుద్రాణి వస్తుంది. రుద్రాణి వచ్చేసరికి లోపల కనకం.. రుద్రాణి నైటీ వేసుకుని ఉంటుంది. ఏయ్ ఇదేంటి నా పర్మిషన్ లేకుండా నా నైటీ వేసుకున్నావ్ అని రుద్రాణి అడిగితే.. మరి ఏం చేయమంటారు ఉండమన్నారు. నేను బట్టలు తెచ్చుకోలేదు. మీ చీరలు నేను కట్టలేను.. అందుకే ఈ నైటీ వేసుకున్నా అని చెప్తుంది కనకం. నా గదిలో ఉండటానికి వీల్లేదని రుద్రాణి చెప్పేస్తుంది. కానీ పట్టించుకోదు కనకం.

కనకం ప్లాన్.. అప్పూని చేయి పట్టుకుని తీసుకెళ్లిన కళ్యాణ్:

ఇక తెల్లవారుతుంది. రాజ్ ని పిలిచి పంతులు గారు ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది ఇందిరా దేవి. ఇవి అక్కడే ఉన్న కనకం వింటుంది. అప్పుడే అప్పూ ఫోన్ చేస్తుంది. గేటు బయట ఉన్నా.. వచ్చి బట్టలు తీసుకో అని అప్పూ చెప్తుంది. ఇక కనకం బయటకు వచ్చి.. ఇక్కడే ఆగి పోయావేంటి? రా లోపలికి వెళ్దాం అంటుంది. నేను రాను.. ఈ ఇంటికి నాతో సంబంధం ఏంటి? నేను వెళ్తా అని అప్పూ అంటుంది. అప్పుడే కళ్యాణ్ బయటకు వస్తాడు.. కళ్యాణ్ ని చూసిన కనకం.. పిలుస్తుంది. హే బ్రో ఏంటి సర్ ప్రైజ్.. ఇవాళ ఫంక్షన్ కి నువ్వు లేక పోతే ఎలా? అని కళ్యాణ్ అంటే.. ఫంక్షనా ఏంటి? అని అప్పూ అడుగుతుంది. ఇవాళ నాకూ, అనామికకు ముహుర్తాలు పెడుతున్నారు అని చెప్తాడు కళ్యాణ్. ఇది విన్న అప్పూ షాక్ అవుతుంది. నాకెందుకు చెప్పలే.. నేను వచ్చేదాన్ని కాదు కదా అని అప్పూ అంటుంది. అదేంటి అలా అంటుంది.. నువ్వు నా పక్కనే ఉండాలి. లేదంటే నాకు వెల్తిగా ఉంటుందని కళ్యాణ్ అంటాడు.

కనకం బెదిరింపు.. తడబడిన పంతులు:

నాకు పని ఉందని రా అంటే.. అప్పూ రా అని చేయి పట్టుకుని తీసుకెళ్తాడు కళ్యాణ్. అప్పుడే పంతులు వస్తాడు. ఇక కనకం సూసైడ్ లెటర్ గురించి కంగారు పడతాడు. పెళ్లి చేయాలంటే కష్ట పడాలి కానీ.. ఆపాలంటే ఏదో ఒకటి చేయాలని నాకు తెలుసు అంటాడు పంతులు. ఇక అందరూ కళ్యాణ్, అనామికల ముహూర్తం గురించి ఎదురు చూస్తూ ఉంటే.. కనకం మాత్రం లెటర్, పాయిజన్ బాటిల్ చూపించి భయ పెడుతుంది. త్వరలోనే ముహూర్తం పెట్టాలని ఇంట్లోని వారందరూ అంటే.. పంతులు మాత్రం కంగారు పడతారు. ఇక కళ్యాణ్, అనామికల జాతకాలు చూసిన పంతులు గారు.. ముహూర్తం సెట్ కాదని చెప్పేస్తాడు. అమ్మాయి జాతక దోషం వల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్తాడు. ఇక పంతులు గారు కంగారు పడుతూ ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఇద్దరి జాతకాలు పరిశీలించిన తర్వాత.. అబ్బాయి జాతకం అమోఘంగా ఉంది. కానీ అమ్మాయి జాతకంలోనే ఏదో దోషం ఉందని చెప్పబోతాడు పంతులు. ఇక కనకం.. పంతుల్ని చూసిన రుద్రాణి.. ఈ లుక్స్ ఎక్సేంజ్ ఏంటి? అని కనిపెట్టేస్తుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.