Brahmamudi, October 5th episode: అమ్మో అనామిక తక్కువేం కాదు.. అప్పూలో కడుపు మంట! కావ్యకు తెలవనున్న నిజం!

|

Oct 05, 2023 | 11:09 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో స్వప్న, రాహుల్ లు కలిసి బాణం గురి చూసి కొడతారు. కానీ అది తగలదు. దీంతో స్వప్న చాలా నిరాశకు గురి అవుతంది. ఆ తర్వాత కళ్యాణ్.. బాణం కొట్టడానికి అప్పూని పిలుస్తాడు. నువ్వు పక్కనుంటే నేను తప్పకుండా గెలుస్తా.. రా అని పిలుస్తాడు. అయితే ఈలోపు అనామిక వెళ్లి.. మీరు కలిసి రోజూ కబడ్డీ ఆడుతూనే ఉంటారు కదా.. కళ్యాణ్ గారు చెప్పారు. మరి ఇందులో కూడా నువ్వెందుకు బ్రో.. పైగా ఇక్కడంతా జంటలు జంటలుగా ఆడుతున్నారు. నేనూ, కళ్యాణ్ గారూ ఆడటమే కరెక్ట్ కదా అని అంటుంది. దీంతో అప్పు అవును.. నిజం చెప్పినావ్.. నేను మీ మధ్యకు రాకుండా..

Brahmamudi, October 5th episode: అమ్మో అనామిక తక్కువేం కాదు.. అప్పూలో కడుపు మంట! కావ్యకు తెలవనున్న నిజం!
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో స్వప్న, రాహుల్ లు కలిసి బాణం గురి చూసి కొడతారు. కానీ అది తగలదు. దీంతో స్వప్న చాలా నిరాశకు గురి అవుతంది. ఆ తర్వాత కళ్యాణ్.. బాణం కొట్టడానికి అప్పూని పిలుస్తాడు. నువ్వు పక్కనుంటే నేను తప్పకుండా గెలుస్తా.. రా అని పిలుస్తాడు. అయితే ఈలోపు అనామిక వెళ్లి.. మీరు కలిసి రోజూ కబడ్డీ ఆడుతూనే ఉంటారు కదా.. కళ్యాణ్ గారు చెప్పారు. మరి ఇందులో కూడా నువ్వెందుకు బ్రో.. పైగా ఇక్కడంతా జంటలు జంటలుగా ఆడుతున్నారు. నేనూ, కళ్యాణ్ గారూ ఆడటమే కరెక్ట్ కదా అని అంటుంది. దీంతో అప్పు అవును.. నిజం చెప్పినావ్.. నేను మీ మధ్యకు రాకుండా ఉండటమే మంచిది అంటూ వెళ్లి పోతుంది.

కాబోయే వైఫ్ ని పక్కన పెట్టుకుని.. మీ ఫ్రెండ్ ని పిలుస్తారా:

ఏంటి కవి గారూ ఇది.. కాబోయే వైఫ్ ని పక్కన పెట్టుకుని మీ ఫ్రెండ్ ని పిలుస్తారా అని అనామిక అనగా.. అప్పుడే జలసీ మొదలైందా అని కళ్యాణ్ అంటాడు. హా.. ఇప్పుడు గురి చూసి కొట్టకపోతే అప్పుడు నిజంగానే మొదలవుతుంది జలసీ అని అనామిక అంటుంది. ఈలోపు సీతా రామయ్య రేయ్ కళ్యాణ్ మాట్లాడింది చాలులే.. ముందు ఆడు అని అంటాడు. మరోవైపు అప్పు తెగ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక కళ్యాణ్, అనామికలు బాణం గురి చూసి కొట్టలేరు. దీంతో అనామిక చాలా డిస్పాయింట్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

గెలిచిన రాజ్, కావ్యలు.. జలసీలో అనామిక:

ఆ తర్వాత రాజ్, కావ్యలు వెళ్తారు. ఈలోపు కళ్యాణ్.. రాజ్ కి ఆల్ ది బెస్ట్ చెప్తాడు. ఏంటి కవి గారు మీ అన్నయ్యకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.. గెలవలేదన్న ఫీలింగ్ లేదా మీకు అని అనామిక అనగా.. ఎవరు గెలిస్తే ఏంటి? సరదాగా ఆడుతున్నాం కదా అని కళ్యాణ్ అంటాడు. మనం గెలిచి ఉంటే మనమే పూజ చేసేవాళ్లం కదా.. మిస్ చేసారు అని అనామిక జలసీగా ఫీల్ అవుతుంది. ఇక రాజ్, కావ్యలు కలిసి గురి చూసి బాణం కొడతారు. దీంతో అనామిక తప్ప అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక సంతోషంతో రాజ్ ని కౌగిలించుకుంటుంది కావ్య. ఇక కావ్య, రాజ్ లను అందరూ పొగుడుతారు. మరో వైపు అనామిక మాత్రం.. ఆ పొగడ్తలన్నీ మనకు రావాల్సింది అని జలసీ ఫీల్ అవుతుంది.

ఏంటి అప్పూ అలా ఉన్నావ్ అని అడిగిన ధాన్య లక్ష్మి:

ఈ గేమ్ లో గెలిచిన రాజ్, కావ్యలే పూజ చేస్తారు అని సీతా రామయ్య అంటాడు. ఇక కావ్య నవ్వుతూ ఇదే మంచి టైమ్.. వెళ్లి ఆ చీటీని దొంగిలించాలి అని కావ్య అక్కడి నుంచి జారుకుని దేవుడి విగ్రహం వద్దకు వెళ్తుంది. మెల్లిగా అక్కడ చీటీ తీసుకుని వచ్చేస్తుంది. ఇక డైనింగ్ టేబుల్ వద్ద ఒంటరిగా కూర్చుని, ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అప్పూ. అది చూసిన ధాన్యం ఏమైంది అప్పూ అలా ఉన్నావ్? అని అడుగుతుంది. నాకేంటి ఆంటీ నేను బాగానే ఉన్నాను.. మీరే కొంచెం టైడ్ అయినట్టు ఉన్నారు అని అంటుంది. అవును పండగ కదా.. పనుల వల్ల అలసిపోయాను అంటుంది ధాన్య లక్ష్మి. ఈ పూలు కొంచెం తీసుకెళ్లి గుమ్మం దగ్గర కట్టమ్మా అని ధాన్య లక్ష్మి చెప్పగా.. సరే ఆంటీ అని వెళ్లి కడుతుంది అప్పు. ఇంతలో కళ్యాణ్ వచ్చి ఏమైంది అప్పు.. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? అనామిక వాళ్లు మా ఇంటికి వస్తున్నారన్న ఇంపార్ట్ విషయం చెప్పడానికి కాల్ చేశాను అని చెప్తాడు. నేనేమన్నా నీ అసిస్టెంట్ నా.. నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు లిఫ్ట్ చేయడానికి అని చిరాకు పడుతుంది అప్పు. కొంచెం స్లోగా మాట్లాడు బ్రో ఎవరైనా వింటారు అని కళ్యాణ్ చెప్పగా.. అవును నేను మాట్లాడితే నీకు అలాగే ఉంటుంది. ముందు వెళ్లు నీ అనామిక నీకు దక్కిందిగా ఇక నా అవసరం లేదు పో అని అనగా.. ఈలోపు అనామిక పిలిస్తే వెళ్తాడు కళ్యాణ్.

కలిసి పూజ చేసిన రాజ్, కావ్యలు:

అమ్మా కావ్య.. ఇప్పటికే లేట్ అయిపోయింది.. త్వరగా పూజ చేయండి అని ఇందిరా దేవి చెప్పగా.. రాజ్, కావ్యలు కలిసి పూజ చేస్తారు. ఇక కావ్య పైకి వెళ్లి ఇంటి డాక్యుమెంట్స్ ని తీసుకొచ్చి రాజ్ ని ఇవ్వాలని చెప్తుంది. కానీ రాజ్ మాత్రం ఇవ్వను అంటాడు. ఇక ధాన్య లక్ష్మి ఏంటి రాజ్ మండపం దగ్గర కూడా మీ ముచ్చట్లు ఆగవా అని ఆట పట్టిస్తుంది. అదేం లేదు చిన్న అత్తయ్యా.. ఇంటి డాక్యుమెంట్స్ ఆయన చేత ఇప్పిస్తా అని అన్నాను అదే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం అని కావ్య అంటుంది. ఆ తర్వాత కనకం, కృష్ణ మూర్తిలకు ఇంటి డాక్యుమెంట్స్ ని ఇస్తాడు. దీంతో కనకం, కృష్ణమూర్తిలు ఎంతో ఆనంద పడతారు.

కనకం, కృష్ణ మూర్తిలకు డాక్యుమెంట్స్ ఇచ్చిన రాజ్:

దేవుడిలా మీరు మాకు అండగా ఉండగా.. మాకు ఏ సమస్యలూ రావు బాబు అని అంటాడు. అయ్యే పెద్ద వాళ్ల చేతులు ఆశీర్వదించాలే కానీ.. ఇలా మొక్కడానికి కాదండి అని అంటాడు రాజ్. ఇటువంటి రోజు ఒకటి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు బాబూ. కానీ విధి ఆడిన నాటకంలో నా కూతుళ్లు ఇద్దరూ ఈ ఇంటికి వచ్చి చేరారు. మొదట్లో ఓ తండ్రిగా వాళ్ల జీవితాలు ఏం అవుతాయా అని చాలా భయపడ్డా. ఇప్పుడు మిమ్మల్ని కావ్యని చూస్తుంటే.. చాలా సంతోషంగా ఉంది అని కృష్ణ మూర్తి అంటాడు. అవును ఒకప్పుడు నా కూతురు జీవితానికి, ఇప్పుడు నా కూతురు జీవితానికి చాలా తేడా ఉంది. మీరెప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండండి అని కనకం అంటూ బాధ పడుతుంది. ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తైయింది. మరో ఎపిసోడ్ తో రేపు మళ్లీ కలుద్దాం.