AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmamudi, October 23rd episode: పని మనిషి విషయంలో మరోసారి ఇంట్లో రచ్చ.. కావ్యకి సపోర్ట్ గా నిలిచిన రాజ్!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కనకం చీరలు కట్ చేస్తుంది రుద్రాణి. ఆ చీరలు కుట్టింది.. ఎలుక అని అబద్ధం చెప్తుంది. దీంతో ఎలుక వంక పెట్టుకుని రుద్రాణిని ఒక రేంజ్ లో ఏసుకుంటుంది. ఆ ఎలుక కనిపించేంత వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని మంచం మీద కూర్చుంటుంది కనకం. ఇక కంటిన్యూగా తిడుతూనే ఉంటుంది. కనకం తిట్లు భరించలేక అక్కడి నుంచి వెళ్లి పోతుంది రుద్రాణి. ఆ తర్వాత స్వప్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటుంది. ట్యాబ్లెట్లు వేసుకోమని చెబుతూ స్వప్నని..

Brahmamudi, October 23rd episode: పని మనిషి విషయంలో మరోసారి ఇంట్లో రచ్చ.. కావ్యకి సపోర్ట్ గా నిలిచిన రాజ్!
Brahmamudi
Chinni Enni
|

Updated on: Oct 23, 2023 | 11:19 AM

Share

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కనకం చీరలు కట్ చేస్తుంది రుద్రాణి. ఆ చీరలు కుట్టింది.. ఎలుక అని అబద్ధం చెప్తుంది. దీంతో ఎలుక వంక పెట్టుకుని రుద్రాణిని ఒక రేంజ్ లో ఏసుకుంటుంది. ఆ ఎలుక కనిపించేంత వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని మంచం మీద కూర్చుంటుంది కనకం. ఇక కంటిన్యూగా తిడుతూనే ఉంటుంది. కనకం తిట్లు భరించలేక అక్కడి నుంచి వెళ్లి పోతుంది రుద్రాణి. ఆ తర్వాత స్వప్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటుంది. ట్యాబ్లెట్లు వేసుకోమని చెబుతూ స్వప్నని తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడే పై నుంచి వచ్చిన కావ్య వస్తుంది. ఇది గమనించిన స్వప్న.. జ్యూస్ తీసుకురావే అని చెప్తుంది. ఇది విన్న కనకం.. అమ్మా తల్లీ నువ్వేమీ జనాలతో కిక్కిరిసిపోయిన సిటీ బస్సువి కాదు. నిదానంగా నడవడానికి.. సీమంతానికి, ప్రసవానికి మధ్య ఇంకా చాలా టైమ్ ఉంది. ఇప్పటి నుంచే కాలు కదప కుండా కూర్చుంటే.. అప్పుడు ఒళ్లు కూడా కదపలేనంత లావు అయిపోతావ్. ఇప్పుడు ఎంత పని చేస్తే.. అప్పుడు సులువుగా ప్రసవం అవుతుంది. కావ్యకి పని చెప్పకు.. నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు. ఒక్కచోటే ఉప్పు బస్తాలా కూర్చోకుండా అటూ ఇటూ తిరుగు అని స్వప్నకి క్లాస్ పీకుతుంది కనకం.

‘కడుపు ఉంటేనే కదా ప్రసవం అవడానికి’ నోరు జారిన కావ్య:

ఇక అప్పుడే జ్యూస్ తీసుకొస్తూ కావ్య పొరపాటున కడుపు ఉంటే కదమ్మా ప్రసవం అవడానికి అని అనేస్తుంది. ఇది విన్న కనకం, స్వప్న షాక్ అవుతారు. ఏయ్ ఏంటే అలా అన్నావ్ అని కనకం అంటుంది. అంటే నేను కేర్ లెస్ గా ఉంటున్నాను కదా.. 9 నెలలు వరకూ బిడ్డను మోస్తానో లేదో అని అలా అంది అని స్వప్న కవర్ చేస్తుంది. శుభమా అని సీమంతం జరుపుకోబోతుంటే దాన్ని అంత మాట అంటావా.. అని కనకం, కావ్యని అడుగుతుంది. తొందర పడి నోరు జారింది ఏం అవుతుందో ఏమో.. ఎలా మాట్లాడాలో దానికి చెప్పు అని స్వప్న అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఎప్పుడూ లేనిది అలా నోరు జారావేంటి అని కనకం కావ్య బాధ పడుతుంది.

ఇవి కూడా చదవండి

బాధతో గుండె బద్ధలైన అప్పూ గుండె:

ఇక ఫొటో షూట్ కోసం అనామిక, కళ్యాణ్, అప్పూలు వస్తారు. ఇక ముందు ఫొటో షూట్ కోసం అనామిక, కళ్యాణ్ లు నిల్చుంటారు. ఏంటి మనం రేషన్ కార్డు కోసం ఫోటో తీసుకుంటున్నామా.. మరి అదేంటి? అని కళ్యాణ్ అడుగుతాడు. దీంతో అనామిక, కళ్యాణ్ లు ఇద్దరూ మంచి రొమాంటిక్ కపుల్ గా ఫొటోలు దిగుతారు. వాళ్లను ఫొటోలు తీస్తూ అప్పూ బాధ పడుతుంది. ఆ తర్వాత కళ్యాణ్, అనామికలు సరదాగా కొట్టుకుంటారు. ఇదంతా చూసిన అప్పూ ఒక చోట దిగాలుగా కూర్చుండిపోయి బాధ పడుతుంది.

ఇంట్లోకి పని మనిషి శాంత రావడంతో మొదలైన రచ్చ:

ఇక వంట గదిలో పని మనిషి శాంతను చూసిన కావ్య.. శాంతాను ఎవరు పిలిచారు. ఇప్పుడు అత్తయ్య చూస్తే ఎంత గొడవ జరుగుతుందో.. ఏంటో.. అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత కిందకు వచ్చిన అపర్ణ.. ఏయ్ అంటూ కావ్యని పిలుస్తుంది. అపర్ణ అరుపుకు శాంత కూడా భయ పడుతుంది. శాంతను పిలిచింది ఎవరు? అని గట్టిగా అరుస్తుంది. దీంతో ఇంట్లోని వారందరూ బయటకు వస్తారు. నిన్ను పని లోనుంచి తీసేసిన తర్వాత.. ఎవరు రమ్మన్నారు? మళ్లీ నిన్ను ఎవరు పనిలోకి రప్పించారు.. కావ్యేనా? అని అపర్ణ దేవి అడుగుతుంది. మంచి సినిమా మిస్ కాకు.. ఇప్పుడు నేను డైరెక్ట్ చేస్తాను చూడు అని రుద్రాణి అంటుంది. ఏమీ తెలీనట్టు శాంత ఏంటి నువ్విక్కడ? అని అడుగుతుంది రుద్రాణి. నువ్వేనా? నువ్వు పని మనుషులను అపాయింట్ చేసేంత స్థాయికి ఎదిగిపోయావా? అని కావ్యను చూసి అపర్ణ అడుగుతుంటే.. కాదమ్మా.. కావ్య అమ్మ నన్ను పిలవలేదు అని శాంత సమాధానం చెప్తుంది. మరి ఇంకెవరు? అని అపర్ణ దేవి అరుస్తుంది.

రాజ్ కి, అపర్ణాకు చిచ్చు పెట్టిన రుద్రాణి:

నేనే పిలిపించాను అని రాజ్ చెప్తాడు. నువ్వా.. నీకు ఒకప్పుడు ఇంట్లో ఏం జరిగిందో తెలుసు. ఎంత రచ్చ జరిగిందో తెలుసు.. మీ అమ్మే పని మనిషిని ఇంట్లో నుంచి తీసేసిందని తెలుసు. అన్నీ తెలుసి.. అంతా చూసి మళ్లీ మని మనిషిని ఎందుకు తీసుకొచ్చావ్ అంటే మీ అమ్మకి ఈ ఇంట్లో విలువే లేదా.. అని రుద్రాణి పుల్లలు పెడుతుంది. ఇప్పుడేం జరిగింది అత్తా.. అడిగిందే అడిగి మా అమ్మని రెచ్చ గొడుతున్నావ్? అని రాజ్ అంటాడు. చూశావా వదినా నీ కొడుకు ఏం అంటున్నాడో.. నీ పర్మిషన్ తీసుకోకుండా.. నీతో ఒక్క మాట కూడా చెప్పకుండా పని మనిషి అని అపర్ణను రెచ్చ గొడుతుంది రుద్రాణి. మాకు నీ ఓవరాక్షన్ కనిపిస్తుంది అని ధాన్య లక్ష్మి అంటుంది. కొంచెం మర్యాదగా మాట్లాడు అని రుద్రాణి అంటే.. నీకు మర్యాద బాగానే ఇస్తున్నాం.. నువ్వే నిలుపుకోవడం లేదు అని ధాన్య లక్ష్మి సమాధానం చెప్తుంది.

కావ్యకి, పని మనిషికి ఇచ్చే విలువ కూడా నీ కొడుకు నీకు ఇవ్వడం లేదు వదినా: రుద్రాణి

రుద్రాణి అసలు జరుగుతున్నది ఏంటి? మాట్లాడుతున్నది ఏంటి? అని ప్రకాష్.. రుద్రాణిని అడుగుతాడు. ఆపండి అంటూ రుద్రాణి గట్టిగా అరుస్తుంది. అసలు నేను శాంతను ఎందుకు పనిలోనుంచి తీసేశాను? తెలుసా అని అపర్ణ.. రాజ్ ని అడుగుతుంది. తెలుసు మమ్మీ.. అందులో శాంతా తప్పు లేద.. కళావతి తప్పు కూడా లేదు. నువ్వు ఆ ఇద్దర్నీ అర్థం చేసుకోలేక పోయాం అని రాజ్ అంటాడు. వదినా వింటున్నావా.. ఎవరి తప్పూ లేదట. నీకు నీ కొడుకు విలువ ఇవ్వడం లేదు అని రుద్రాణి మరోసారి పుల్లలు పెట్టేందుకు ట్రై చేస్తుంది. ఆ తర్వాత ఇది మా అమ్మకి, నాకు మధ్య జరుగుతున్న విషయం.. నువ్వు ఇన్వాల్స్ అవ్వకు అని చెప్తాడు రాజ్. అవుతాను అని చెప్తుంది రుద్రాణి.

కళావతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పిన రాజ్:

అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావ్ రాజ్ అని అపర్ణ అడగ్గా.. కళావతి కోసం. ఈ ఇంట్లో ఒకరు కాఫీ అడుగుతారు. మరొకరు టీ, గ్రీన్ టీ. ఒకరికి నచ్చిన కూర మరొకరికి నచ్చదు. ఇంటిల్ల పాదికి అన్నీ సమకూర్చి ఇంటెడు చాకిరి మొత్తం తనే చేస్తుంది. అప్పుడు ఇంకో పని మనిషిని పెట్టుకోవచ్చు కదా.. శాంతానే ఎందుకు అని అపర్ణ అడుగుతుంది. శాంతాకు ఎవరికి ఏం కావాలో తెలుసు. కొత్త పని మనిషికి ఏమీ తెలీదు. అన్నీ చెప్పాలి. శాంతా అయితే అవన్నీ చేసుకుని వెళ్తుంది. అలాగే తాతయ్యకి ఏ టైమ్ లో ఏం మందులు ఇవ్వాలో కూడా కళావతికి మాత్రమే తెలుసు. ఈ పనుల్లో బిజీగా ఉండి తాతయ్యను సంగతి మర్చిపోవడమే.. ఆలస్యం చేయడమో జరుగుతుంది. అందుకే ఇంకో మనిషి కావాలనుకున్నా అని రాజ్ చెప్తాడు. ఇక ఆ తర్వాత ఇందిరా దేవి కూడా రాజ్ కే సపోర్ట్ చేస్తుంది. రాత్రి పనంతా అయ్యి.. తన గదికి వెళ్లడానికి 11 అవుతుంది. అలాగే తెల్లవారు జామున 5 గంటలకే లేచి.. అందరికీ సమకూరుస్తుంది. ఇలా అన్ని పనులు తన నెత్తిన వేసుకుని చేస్తుంది. తన భార్య కష్ట పడటం చూడలేక పాత మనిషినే రప్పించాడు. దీనికి ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారు అని నిలదీస్తుంది ఇందిరాదేవి.