AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: రతికా పాప రిటర్న్స్‌.. శివాజీ కాళ్లు మొక్కి మరీ సారీ చెప్పిన బ్యూటీ.. వీడియో చూశారా?

రతికా పాప బిగ్‌ బాస్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది.  కళ తప్పిన హౌజ్ కు మళ్లీ వెలుగులు తెచ్చింది. మూడు వారాల కన్నా ఎక్కువ హౌస్‌లో ఉండి ఎలిమినేట్ అయిన ముగ్గురిలో ఒకరు హౌజ్‌లో రీ ఎంట్రీ ఇవ్వచ్చని నాగార్జున బంపరాఫర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎవరు రావాలో హౌజ్‌మేట్స్‌ స్వయంగా ఓట్లేసి చెప్పాలని ఛాన్స్‌ ఇచ్చారు.

Bigg Boss 7 Telugu: రతికా పాప రిటర్న్స్‌.. శివాజీ కాళ్లు మొక్కి మరీ సారీ చెప్పిన బ్యూటీ.. వీడియో చూశారా?
Bigg Boss 7 Telugu
Basha Shek
|

Updated on: Oct 23, 2023 | 9:39 AM

Share

రతికా పాప బిగ్‌ బాస్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది.  కళ తప్పిన హౌజ్ కు మళ్లీ వెలుగులు తెచ్చింది. మూడు వారాల కన్నా ఎక్కువ హౌస్‌లో ఉండి ఎలిమినేట్ అయిన ముగ్గురిలో ఒకరు హౌజ్‌లో రీ ఎంట్రీ ఇవ్వచ్చని నాగార్జున బంపరాఫర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎవరు రావాలో హౌజ్‌మేట్స్‌ స్వయంగా ఓట్లేసి చెప్పాలని ఛాన్స్‌ ఇచ్చారు. అయితే చివరిలో బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు నాగ్‌. తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లని హౌస్‌ మేట్‌గా పంపిస్తానన్నారు. దీంతో రతికా పాపే హౌజ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. లాంగ్ ఫ్రాక్‌లో స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చేసిన ఆమెక నాగార్జున గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది రతిక. అయితే సెకెండ్‌ ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని, మొదటి సారి చేసిన తప్పులు మళ్లీ చేయకని నాగ్‌ ఆమెకు సలహా ఇచ్చారు. ఆల్‌ ది బెస్ట్ చెప్పి హౌజ్‌లోకి పంపించేశారు.

ఇక బిగ్‌ బాస్‌ డోర్ ఓపెన్‌ చేయగానే మొదట రతికకు పెద్దన్న శివాజీనే కనిపించాడు. దీంతో నా టైమ్ బావుంది.. మొదట మీరే కనిపించారు అంటూ శివాజీని హగ్‌ చేసుకుంది. అతను కూడా రా బిడ్డా.. రా అంటూ ఆమెను ఆప్యాయంగా పలకరించాడు. ఆ తర్వాత మిగిలిన కంటెస్టెంట్లు కూడా ఒక్కొక్కరు కూడా రతికకి స్వాగతం పలికారు. టేస్టీ తేజా అయితే ఎదురెళ్లి మరీ ఆలూ కూర కలిపి అన్నం ముద్దలు పెట్టాడు. ఇక ప్రిన్స్‌ యావర్‌కి గట్టిగా హగ్‌ ఇచ్చిన రతిక కొత్త కంటెస్టెంట్లను పరిచయం చేసుకుంది. దీని తర్వాత వీఐపీ రూమ్‌కు వచ్చిన ఈ బ్యూటీ చటుక్కున శివాజీ కాళ్ల మీద పడిపోయింది. దీంతో ‘ఏంది బిడ్డా ఇది.. లే’ అంటూ శివాజీ హత్తుకున్నాడు. ‘అన్నా నేను చాలా తప్పులు చేసినా.. నన్ను క్షమించు.. నీ బిడ్డనే అనుకో’ అంటూ మళ్లీ ఎమోషనలైంది రతిక.

ఇవి కూడా చదవండి

రతికకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన హౌజ్ మేట్స్..

‘అన్నా నేను చాలా తప్పులు చేసినా.. నన్నుక్షమించు.. నీ బిడ్డనే అనుకో.. ఎలిమినేట్ అయినప్పుడు నీ గురించి స్టేజ్ మీద ఏం చెప్పలేకపోయినా.. ఎందుకంటే ఏమైనా మాట్లాడితే నాకు ఏడుపొచ్చేసేది . అందుకే ఏడవకూడదనే నీ గురించి ఏం చెప్పలేదు’ అని ఏడ్చేసింది. ‘ అలా ఏం లేదులేరా బిడ్డా.. ఇక్కడ పర్సనల్ ఈగోలు ఏం ఉండవు.. ఇక్కడ గేమ్ ఆడేందుకు వచ్చాం. దాని మీద దృష్టి పెట్టు.. బాగా ఆడు.. ఈ క్షమాపణలు ఎందుకు. తప్పు తెలుసుకున్నావ్ అది చాలు’ అని శివాజీ రతికను ఓదార్చాడు. మరి తన విచిత్ర ప్రవర్తనతో ఎలిమినేట్అయిన రతిక రీఎంట్రీలోనైనా అదరగొడుతుందా? లేదా? అన్నది చూడాలి.

చాలా తప్పులు చేసినా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే
ఆ రైతులు కాలర్ ఎగరేస్తున్నారు.. ఏకంగా టన్ను రూ. 2 లక్షలు..
ఆ రైతులు కాలర్ ఎగరేస్తున్నారు.. ఏకంగా టన్ను రూ. 2 లక్షలు..
ఆ హీరో నమ్మకమే నా కెరీర్ అంటున్న అనిల్ రావిపూడి
ఆ హీరో నమ్మకమే నా కెరీర్ అంటున్న అనిల్ రావిపూడి
కొంటె చూపులతో కట్టిపడేస్తు్న్న ముద్దుగుమ్మ.. అనికా స్టన్నింగ్..
కొంటె చూపులతో కట్టిపడేస్తు్న్న ముద్దుగుమ్మ.. అనికా స్టన్నింగ్..
టీమిండియాకు గుడ్ న్యూస్.. రీఎంట్రీకి సిద్ధమైన తెలుగబ్బాయ్..?
టీమిండియాకు గుడ్ న్యూస్.. రీఎంట్రీకి సిద్ధమైన తెలుగబ్బాయ్..?