ఈ రోజు బ్రహ్మ ముడి ఎపిసోడ్ లో దుగ్గిరాల ఇంటి నుంచి కనకం, కృష్ణ మూర్తి ఇంటికి వస్తారు. ఏందే మొగుడు, పెళ్లం ఇంత పొద్దున్నా షికారుకు పోయినారా అని అప్పు అడుగుతుంది. కాదు పేరంటానికి పోయాం అని కనకం అంటుంది. ఈ మధ్య పేరంటానికి మగవాళ్లను కూడా పిలుస్తున్నారా? మా నాయినని కూడా తోలుకుపోయినావ్ అని అడుగుతుంది అప్పు. నా మొగుడు నా ఇష్టం. మధ్యలో నీకెందుకు అని కనకం అనగా.. చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా అని అప్పు అంటుంది. ఇలా కనకం, అప్పు కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. ఇక కావ్య గదిలోకి వస్తుంది. ఏదో ఆలోచిస్తూ బాత్రూమ్ లోకి వెళ్లబోతుంటే.. రాజ్ పిలుస్తాడు. ఇప్పుడు దీనికి కూడా మిమ్మల్ని అడిగి వెళ్లాలా అని కావ్య నిరాశగా అంటుంది. అడిగినదానికి సమాధానం చెప్పి వెళ్లు అంటాడు రాజ్.
నిజంగా నువ్వు గుడికి మొక్కు తీర్చుకోవడానికే వెళ్లావా.. రాజ్ అనుమానం:
కావ్య ఏంటి అనగా.. నిజంగానే నువ్వు గుడికి మొక్కు తీర్చుకోవడానికే వెళ్లావా అని రాజ్ అడుగుతాడు. మీకింకా అనుమానం తీరలేదా అని కావ్య అడుగుతుంది. క్లారిటీ రాలేదని అంటాడు రాజ్. ఏం చేయాలనుకున్నా.. చెప్పి చేసే నువ్వు ఇలా అర్థరాత్రి అర్థాంతరంగా.. చెప్పకుండా వెళ్లావ్ అంటే… నాకు నమ్మకం కుదరడం లేదు అని రాజ్ అంటాడు. నేను కూడా చాలానే నమ్మకం పెట్టుకున్నా.. కానీ అన్నీ అనుకున్నట్టు జరగావ్ గా అని కావ్య అంటుంది. ఇప్పుడు నేనేం చేశాను అని రాజ్ అడగ్గా.. మోసం చేశారు.. ఏ భర్తా.. ఏ భర్యాకీ చేయని విధంగా నన్ను మోసం చేశారని మనసు లోపల అనుకుటుంది కావ్య.
సమయం వచ్చినప్పుడు చెప్తాలెండి అని కావ్య అంటుంది. చెప్పే వెళ్లు అంటాడు రాజ్. మొక్కు తీర్చుకోవడానికే వెళ్లాను.. కానీ ఆ దేవుడు అంత త్వరగా నా కోరికను నెరవేరుస్తాడని అనుకోలేదు. ఏంటో ఆ కోరిక అని అడుగుతాడు రాజ్. ఇంకేముంది? నా మీద విపరీతమైన ప్రేమ పెరగాలి అనుకున్నాను.. కానీ మీ మనసులో ఎంత ప్రేమ ఉందో.. గుళ్లో చూపించారు కదా.. నేను కనిపించకపోయే సరికి ఎంత కంగారు పడిపోయారో కళ్లారా చూశాక.. నా కడుపు నిండిపోయిందని కావ్య అంటుంది. నా మీద భయమూ లేక.. ప్రేమ లేక రాత్రంతా పిచ్చోడిలా ఎందుకు వెతికారు అని కావ్య అడుగుతంది. బుద్ధి లేక అని చెప్తాడు రాజ్. ఈ సారి నువ్వు మిస్ అయితే అస్సలు వెతకను అని రాజ్ అంటాడు. సరే అయితే అని కావ్య అంటుంది.
స్వప్నని ఎలా వదిలించుకోవాలా అని ప్లాన్ వేస్తున్న రుద్రాణి.. సీమంతం చేద్దామంటున్న పెద్దావిడ:
ఆ తర్వాత స్వప్నని ఎలా వదిలించుకోవాలా అని రుద్రాణి ఆలోచిస్తూ ఉంటుంది. దీని కడుపును ఎలాగైనా పోగట్టాలి అని ప్లాన్ వేస్తుంది. ఈలోపు నీ కోడలి కడుపు గురించి ఏం ఆలోచించావ్ అని ఇందిరా దేవి.. రుద్రాణిని అడుగుతుంది. నాలుగో నెల అయ్యాక ఐదో నెల వస్తుంది అందులో ఆలోచించడానికి ఏముందని రుద్రాణి అడుగుతుంది. అత్తయ్య గారు సీమంతం గురించి అడుగుతున్నారని అపర్ణ అంటుంది. సీమంతం గురించే కదా ఆలోచించాను.. చేయకపోవడమే బెటర్ అని రుద్రాణి అంటే.. అపర్ణ, ధాన్య లక్ష్మి, ఇందిరాదేవి షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు.. ఈ ఇంట్లోకి కోడళ్లు వచ్చాక జరగబోయే మొదటి శుభ కార్యం ఇది.. వద్దు అంటావ్ ఏంటి? అని ఇందిరా దేవి అడగ్గా.. రాహుల్, స్వప్నల పెళ్లి ఎలా జరిగిందో తెలుసు కదా అమ్మా.. ఇప్పుడు అందర్నీ పిలిచి హడావిడి చేస్తే.. పెళ్లి కాక ముందే కడుపు వచ్చిందని అందరికీ తెలిసి పరువు పోతుంది. అందుకే వద్దు అంటున్నా అని చెప్పా అంటుంది రుద్రాణి. కాదు చేద్దాం అని అంటుంది ఇందిరా దేవి.
ఎలాగైనా కడుపు పోగొట్టుకోవాలి అని ప్లాన్ వేసిన స్వప్న.. అప్పూకి కళ్యాణ్ ఫోన్:
ఇదంతా విన్న స్వప్న.. పైకి గదిలోకి వెళ్లి అమ్మో కావ్య చెప్పింది నిజమే. ఎలాగైనా ఈ కడుపును పోగొట్టుకోవాలి.. ఏం చేయాలి? అని ప్లాన్స్ వేస్తుంది స్వప్న. ఇక కళ్యాణ్.. అప్పూకి కాల్ చేస్తూనే ఉంటాడు. అయినా అప్పు కాల్ కట్ చేస్తుంది. మళ్లీ కళ్యాణ్ కాల్ చేస్తూనే ఉంటాడు. సరే అయిన అప్పూ కాల్ లిఫ్ట్ చేసి.. ఏంది ఫోన్ కట్ చేస్తే.. మళ్లీ చేయకూడదని తెలీదా? అని అడుగుతంది. ఎన్ని పనులు ఉన్నా పక్కకు పెట్టి.. నువ్వు నాతో వస్తున్నావ్.. మనం కలుస్తున్నాం అంటాడు కళ్యాణ్. కుదరదు అని చెప్పేస్తుంది అప్పు. అయినా నువ్వు రావాల్సిందే అని కాల్ కట్ చేస్తాడు కళ్యాణ్. ఇదంతా విన్న కనకం ఎవరే అని అడుగుతుంది. కళ్యాణ్ అని చెప్తుంది అప్పు. మరి పిలుస్తే వెళ్లవే అని కనకం అనగా.. నేను వెళ్లాను అంటుంది అప్పు. అప్పుడు నీకు హెల్ప్ చేశాడు కదా వెళ్లు అటుంది కనకం. వాళ్లు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను పోవాలా నో వెళ్లను అని అంటే.. అతను నీకు ఫ్రెండ్ మాత్రమే కాదు.. కావ్య అక్క మరిది కూడా కాబట్టి.. అతనితో మర్యాదగా నడుచుకోవాలి.. వెళ్లు అంటుంది కనకం. సరే అని బయలు దేరుతుంది అప్పు.
కిచెన్ లో రాజ్ ని ఓ ఆట ఆడుకున్న కావ్య.. బిత్తరపోయిన రాజ్:
ఇక కావ్య కిచెన్ లో కూరగాయలు కట్ చేస్తూ ఉంటే.. రాజ్ వచ్చి వాటర్ తాగుతాడు. నువ్వు నిజంగానే మొక్కు తీర్చుకోవడానికే గుడికి వెళ్లావా అని అడుగుతాడు. కావ్య కత్తి చూపిస్తుంది. ఓకే అంటాడు. రాజ్ ని చూసిన కావ్య కావాలనే ఫ్రెండ్ తో మాట్లాడినట్టు ఫోన్ చేసి.. ఏంటి? అలా చేశాడా? అలాంటి వాళ్లను అస్సలు ఊరికోకూడదు.. చెప్పుతో కొట్టాలి. ఏంటి భయం లేదా? అయితే చంపేయ్.. అని అంటుంది. నువ్వేం భయపడకు.. మా ఆయన పలుకుబడితో నిన్ను బెయిల్ పై బయటకు తీసుకొస్తాం అని కావ్య అంటే.. వసేయ్ ఏంటే.. మర్డర్ చేయమంటున్నావ్.. నేను ఉన్నానని చెప్తున్నావ్ అని ఖంగుతింటాడు రాజ్. ఇంతకీ అతను ఏం చేశాడు చెప్పు.. వాడికి నేను బుద్ధి చెప్తా.. తాగి ఆస్తి అంతా తగలెడుతున్నాడా.. తాగి వచ్చి కొడుతున్నాడా.. పోనీ ఇంకో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడా? అని రాజ్ అడుగుతూ ఉంటే కావ్య కాదని చెప్తుంది. మరి ఏం చేశాడని రాజ్ అడగ్గా.. మోసం చేస్తున్నాడు అని కావ్య అంటుంది. ఏంటి మోసం చేస్తున్నాడా.. అవును ప్రేమించానని చెప్పి నటించి మోసం చేశాడని అంటుంది కావ్య. ఇది విన్న రాజ్ నవ్వుతాడు. నటించి మోసం చేశాడా.. వాడిని వదిలేయవచ్చు అని రాజ్ అంటాడు. ఏంటి అని కావ్య కోపంగా అనగా.. ఎందుకు.. కారణం ఏమై ఉంటుందని రాజ్ అడగ్గా.. బోడి కారణం ఎవడిక్కి కావాలి? ప్రేమ ఉందని చెప్పి నటించడం ఎంత తప్పు అండి? అని కావ్య కావాలనే కోపంగా అంటుంది. ఇక కావాలనే రాజ్ తో మాట్లాడుతూ ఉడికిస్తుంది. ఇక రాజ్ మనసులో నేను కూడా అలాగే నటించాను.. అది తెలిస్తే నా పరిస్థితి ఏంటో? అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తాడు.
ప్లాప్ అయిన స్వప్న ప్లాన్.. ఫైర్ అయిన ఫ్యామిలీ:
ఈలోపు ఇందిరా దేవి కావ్యను మజ్జిగ తీసుకు రమ్మని అడుగుతుంది. కావ్య మజ్జిగ తెచ్చి ఇస్తుంది. ఇక స్వప్న ప్లాన్ ప్రకారం కింద పడాలని ప్లాన్ వేస్తూ మెట్ల మీద నుంచి కింద పడబోతుంటే.. కావ్య వచ్చి పట్టుకుంటుంది. ఇదంతా చూసిన ఇంటి సభ్యులు అయ్యో.. అంటూ పరుగులు పెడుతూ వస్తారు. ఏం కాలేదు కదమ్మా అని ఇందిరా దేవి అడగ్గా.. ఏమీ కాలేదు అమ్మమ్మ అని అంటుంది. ఏమైనా జరిగినా బావుణ్ణు దీని పీడ విరగడ అవుతందని రుద్రాణి అనుకుంటుంది. ఇక జాగ్రత్తగా ఉండాలి కదా అని అందరూ క్లాస్ పీకుతారు.