Bigg Boss Telugu 9: బిగ్ బాస్ అగ్ని పరీక్షకు జడ్జీగా అతనెందుకు? షాకింగ్ వీడియో రిలీజ్ చేసిన కౌశల్

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 5 న బిగ్ బాస్ లాంఛింగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది.అయితే తాజాగా బిగ్ బాస్ టీమ్ నిర్వహిస్తోన్న అగ్ని పరీక్ష కాంటెస్ట్ పై మాజీ విన్నర్ కౌశల్ సంచలన కామెంట్స్ చేశాడు.

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ అగ్ని పరీక్షకు జడ్జీగా అతనెందుకు? షాకింగ్ వీడియో రిలీజ్ చేసిన కౌశల్
Bigg Boss Telugu 9

Updated on: Aug 26, 2025 | 10:13 PM

బిగ్ బాస్ సీజన్ 9లో సెలబ్రిటీలతో పాటు కామన్ ఆడియెన్స్ కూడా భాగం కానున్నారు. ఇందులో భాగంగానే బిగ్ బాస్ టీమ్ అగ్ని పరీక్ష అంటూ సరికొత్త కంటెస్టెను ప్రవేశ శెట్టింది. ఇందుకు వేలాది మంది అప్లై చేసుకుంటే బిగ్ బాస్ టీమ్ జల్లెడ పట్టి 45 మందిని సెలక్ట్‌ చేసింది. ఇప్పుడు వీరి మాట, ఆట తీరు బట్టి మొత్తం ఐదుగురిని తొమ్మిదో సీజన్‌కు కంటెస్టెంట్స్ గా పంపించాలి. ఇందులో ఎవర్ని సెలెక్ట్ చేయాలి? ఎవరిని బయటకు పంపించాలి? అన్న బాధ్యతలను బిగ్ బాస్ మాజీ విన్నర్లు అభిజిత్‌, బిందు మాధవి అలాగే మాజీ కంటెస్టెంట్ నవదీప్ చేతిలో పెట్టారు. ప్రస్తుతం ఈ అగ్ని పరీక్ష కాంటెస్ట్ హోరా హోరీగా జరుగుతోంది. అయితే ఈ విధానంపై బిగ్ బాస్ సెకెండ్ సీజన్ విన్నర్ కౌశల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

‘ బిగ్‌బాస్‌-9 హౌస్‌లోకి కామన్‌ ఆడియన్స్‌ను పంపేందుకు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. కానీ, జడ్జీలుగా వారిని తీసుకోవడంపై నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అభిజిత్ బిగ్‌బాస్- 4 విజేత కాబట్టి అతను పర్వాలేదు. బిందు మాధవి ఓటీటీ విజేత కాబట్టి ఓకే. మరి నవదీప్ ఎందుకు? అతను‌ సీజన్‌-1 సమయంలో మూడో స్థానంలో నిలిచాడు. ఇలా ఓడిపోయిన వ్యక్తిని కాకుండా మొదట సీజన్ లో విన్న ర్ గా నిలిచిన‌ శివబాలాజీని జడ్జీగా తీసుకుని ఉండుంటే బాగుండేది. అలా చేయడం వల్ల బిగ్ బాస్ విన్నర్స్‌కు మంచి గుర్తింపు ఇచ్చినట్లు ఉండేది’

ఇవి కూడా చదవండి

బిగ్‌బాస్‌ సీజన్‌- 2 లో విజేతగా నిలిచిన తర్వాత కౌశల్ మళ్లెప్పుడు హౌస్ లోకి రాలేదు. చాలా మంది పాత కంటెస్టెంట్లు వైల్డ్ కార్డర్ కంటెస్టెంట్స్ గానో, గెస్టులు గానో బిగ్‌బాస్‌ స్టేజీపై సందడి చేశారు.. కానీ కౌశల్ మాత్రం వీటికి దూరంగానే ఉన్నాడు. దీనిపై అతను స్పందిస్తూ.. ‘నేను గెలవడం బిగ్‌బాస్‌ టీమ్‌కు ఇష్టమే లేదు. కేవలం ప్రేక్షకుల అభిమానం వల్ల నాకు ట్రోఫీ ఇచ్చారు. అందుకే బిగ్‌బాస్‌ టీమ్‌ వారు నన్ను ఎప్పుడూ కూడా హౌస్‌లోకి రమ్మని పిలువలేదు. సాధారణంగా బిగ్ బాస్ విజేతను చేయి పట్టుకుని ప్రకటిస్తారు. కానీ, మొదటిసారి దానిని బ్రేక్‌ చేసి స్క్రీన్‌ మీద విన్నర్‌ను ప్రకటించారు. దీనిని బట్టే చెప్పవచ్చు.. బిగ్‌బాస్‌ టీమ్‌కు నా విజయం నచ్చలేదని’ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

బిగ్ బాస్ కౌశల్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.