బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. మొదటి వీక్ లోనే కంటెస్టెంట్స్ తమ సత్తా ఏపాటిదో చూపించారు. అయితే మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేషన్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. హౌస్ లో ఉన్న చాలా మంది కంటెస్టెంట్స్ కంటే బేబక్క చాలా బెటర్ అని, అయినా ఆమెని మొదటి వారమే పంపించేశారంటూ కొంత మంది బిగ్ బాస్ పై మండి పడుతున్నారు. ఈ సంగతి పక్కన పెడితే సోమవారం అంటేనే అందరికీ నామినేషన్స్ గుర్తుకు వస్తాయి. రెండో వారం కూడా ఈ నామినేషన్స్ ప్రక్రియ హీట్ ఎక్కించింది. తాజాగా దీనికి సంబంధించిన సోమవారం నాటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. ఎప్పట్లాగానే ఈ వారం నామినేషన్స్ లో కూడా కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. మాటల తూటాలతో బిగ్ బాస్ హౌస్ లో ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది. ‘నీకు పర్సనాలిటీ ప్రాబ్లమ్ ఉంది, నీకింకా మెచ్యూరిటీ రావాలి’ అని సోనియా ఆకుల సూక్తులు చెప్పడంతో సీతకు మండిపోయింది. ‘నాకెంత క్లారిటీ ఉందో నాకు తెలుసు, ముందు నువ్వు గేమ్‌ను అర్థం చేసుకుని నాకు వివరించు, అసలు ముందు నీకు క్లారిటీ లేదు’ అని ఇచ్చిపడేసింది కిర్రాక్ సీత. దీంతో సోనియా.. ఎక్కువ మాట్లాడొద్దు, పిచ్చి మాటలు మాట్లాడకు అని సీరియస్ అయింది
ఆ తర్వాత ప్రేరణను కూడా నామినేట్ చేసింది సీత ‘ బయట ఆల్‌రెడీ ఉన్న ఫ్రెండ్‌షిప్‌ను మీరు ఇంట్లో ఫాలో అవండి, కానీ పక్కవాళ్లు కూడా ఫాలో అవాలని చెప్పే హక్కు నీకు లేదు’ అంటూ ప్రేరణను నామినేట్ చేయడానికి గల కారణాన్ని వివరించింది సీత. కాగా మొదటి వారం మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వచ్చారు. అయితే ఈ వారం మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా క్లారిటీ రావాలంటే సోమవారం నాటి ఎపిసోడ్ ను చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.