
బిగ్ బాస్ సీజన్ 9లో రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటకే ఐదో వారంలోకి చేరుకుంది. మొత్తం 15 మంది హౌస్ లోకి అడుగు పెడితే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం 12 మంది కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్ లో ఉన్నారు. ఇందులో దివ్యా నికితా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఐదో వారంలో బిగ్ బాస్ లో చాలా ట్విస్టులు ఉండనున్నాయి. ఈ వీకెండ్ ఎపిసోడ్ లోనే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంట్రీల ఉండనున్నాయని స్వయంగా బిగ్ బాసే అప్ డేట్ ఇచ్చాడు. హౌస్ మేట్స్ జాగ్రత్తగా ఆడాలని లేకుంటే ఎలిమినేట్ అవుతారని కంటెస్టెంట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీనికి తోడు ఈ వారంలో ఏకంగా 10 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. కెప్టెన్ గా ఉన్న రామూ రాథోడ్, ఇమ్యూనిటీ సంపాదించుకున్న ఇమ్మాన్యుయేల్ తప్పితే మిగతా వారందరూ నామినేషన్స్ జాబితాలో ఉన్నారు. కాగా వైల్డ్ కార్డ ల ఎంట్రీతో ఈ వారం బిగ్ బాస్ లో డబుల్ ఎలిమినేషన్ జరగనుందని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా గేమ్ ఆడనివారిని కొత్త కంటెస్టెంట్స్ తో రీప్లేస్ చేస్తారని బిగ్ బాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం ఈ రూమర్లకు మరింత బలాన్నిస్తోంది.
ఇక బిగ్ బాస్ ఆన్ లైన్ ఓటింగ్ విషయానికి వస్తే.. మొదటి ప్లేస్ లో తనూజ ఉంది. రెండవ స్థానంలో కళ్యాణ్ పదాల, మూడవ ప్లేస్ లో సుమన్ శెట్టి, 4వ స్థానంలో దమ్ము శ్రీజ, 5వ స్థానంలో సంజన, 6వ స్థానంలో భరణి, 7వ స్థానంలో డెమాన్ పవన్ ఉన్నారు. ఇక 8వ స్థానంలో దివ్య నికిలా, 9వ ప్లేస్ లో ఫ్లోరా శైనీ ఉన్నారు. ఇక ఆఖరి స్థానంలో రీతూ చౌదరి ఉంది. బిగ్ బాస్ లో టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరైన రీతూ చౌదరి ఇప్పుడు ఓటింగ్ లో ఆఖరి ప్లేస్ లో ఉండడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం రీతూ చౌదరి, ఫ్లోరా శైనీలలో ఎవరో ఒకరిని హౌస్ నుంచి బయటకు పంపే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఓటింగ్ కు ఇంకా వీకెండ్ వరకు టైమ్ ఉంది. కాబట్టి ఈ లెక్కలు మారే అవకాశం ఉంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ జరిగితే మాత్రం ఇద్దరూ హౌస్ నుంచి బయటకు రావాల్సిందే.
From explosive tasks to nonstop entertainment, the house is on fire! 💥👁️
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/2VkUZZ46eQ
— Starmaa (@StarMaa) October 8, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.