
బిగ్ బాస్ ఆడియెన్స్ కు మరింత వినోదాన్ని అందించేందుకు ఆదివారం (అక్టోబర్ 12) కొత్త కంటెస్టెంట్లు హౌస్ లోకి రానున్నారు. మొత్తం ఆరుగురు కొత్త కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారు. మరికాసేపట్లో బిగ్ బాస్ 2.o గ్రాండ్ లాంచ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఒక చిన్న ప్రోమోను రిలీజ్ చేశారు. ‘వైల్డ్ కార్డ్స్ చాలా వైల్డ్‌గా ఉంటాయి’ అంటూ రిలీజ్ చేసిన ఈ ఫైర్ స్ట్రామ్ ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ ప్రోమోలో నాగార్జునతో పాటు మరో ముగ్గురు హోస్టులు కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తమిళ్, కన్నడ, మలయాళ బిగ్ బాస్ హోస్టులు విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, మోహన్ లాల్ ఈ ప్రోమోలో కనిపించి ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేశారు. ఆ తర్వాత ఫేసులు కనిపించకుండా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంట్రీ చూపించారు. అలాగే డ్యూడ్ సినిమా హీరోహీరోయిన్ ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు బిగ్ బాస్ స్టేజీపై అతిథులుగా సందడి చేశారు.
కాగా గత కొన్ని రోజుల నుంచి నెట్టింట వినిపిస్తోన్న కంటెస్టెంట్లే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారని తెలుస్తోంది. ముఖ్యంగా చాలా మంది ఎదురుచూస్తున్న దివ్వెల మాధురి పట్టుచీర కట్టుకుని ఓ డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. అలాగే ఆయేషా జీనత్, రమ్య మోక్ష, శ్రీనివాస్ సాయి, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తాలు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు ప్రోమోలో చూపించారు. అయితే వాళ్ల ఫేస్ లు కనిపించకుండా కేవలం వాయిస్ మాత్రమే వినిపించేలా ప్రోమోను కట్ చేశారు. మొత్తానికి ఈ వీకెండ్ ఎపిసోడ్ బిగ్ బాస్ ఆడియెన్స్ కు మరింత ఫన్ ఇచ్చేలా రూపొందించినట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.