Bigg Boss Telugu 9: గవర్నమెంట్ టీచర్ కావాల్సింది.. ఇప్పుడు బిగ్ బాస్‌లో రచ్చ చేస్తోంది..ఈ అందాల తార ఎవరంటే?

అంచనాలకు తగ్గట్టుగానే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్ థీమ్ తో సాగుతోన్న ఈ సెలబ్రిటీ రియాలిటీ షో బుల్లితెర ఆడియెన్స్ కు మంచి ఫన్ అండ్ ఎంటర్ టైన్మెంట్ అందిస్తోంది.

Bigg Boss Telugu 9: గవర్నమెంట్ టీచర్ కావాల్సింది.. ఇప్పుడు బిగ్ బాస్‌లో రచ్చ చేస్తోంది..ఈ అందాల తార ఎవరంటే?
Bigg Boss Telugu 9

Updated on: Sep 12, 2025 | 8:35 PM

సెప్టెంబర్ 7న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇందులో తొమ్మిది మంది సెలబ్రిటీలు కాగా ఆరుగురు కామనర్స్ కోటాలో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తనూజ గౌడ, రీతూ చౌదరి, ఇమ్మాన్యుయేల్, భరణి, సుమన్ శెట్టి, ఫ్లోరా శైనీ, రాము రాథోడ్, సంజనా గల్రానీ, శ్రేష్టి వర్మ సెలబ్రిటీలు కాగా, మాస్క్ మ్యాన్ హరిత హరీశ్‌, మర్యాద మనీశ్, దమ్ము శ్రీజ, కల్యాణ్‌ పడాల, డిమోన్‌ పవన్‌, ప్రియశెట్టి కామనర్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ఈ కంటెస్టెంట్స్ లో ఒక్కొక్కరిదీ ఒక్కో బ్యాక్ గ్రౌండ్. సెలబ్రిటీల్లో ఎక్కువగా సినిమాలు, సీరియల్స్ తో ఫేమస్ కాగా మరికొందరు సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు గా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక కామనర్స్ ది కూడా ఒక్కొక్కరిదీ ఒక్కో ట్యాలెంట్. అయితే ఒక కంటెస్టెంట్ బ్యాక్ గ్రౌండ్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. తండ్రి ఆమెను గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా చూడాలనుకున్నాడు. కానీ తను మాత్రం చిన్నప్పటి నుంచే యాక్టింగ్ కే ప్రాధాన్యమిచ్చింది. ఇక కాలేజీ రోజుల్లో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఇప్పటికే పలు సినిమాలు, సీరియల్స్ తో అలరించిన ఈ అందాల తార ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లోకి కూడా అడుగు పెట్టింది. అయితే ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు చెప్పలేదట. కానీ తన పేరెంట్స్ ను ఏ మాత్రం డిజప్పాయింట్ చేయకుండా తన గేమ్ ను కొనసాగిస్తానని బల్ల గుద్ది చెప్పింది. అందుకు తగ్గట్టుగానే ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో భారీగా ఓట్లు పడుతున్నాయి.

ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరనుకుంటున్నారా? బిగ్ బాస్ సీజన్ 9లోకి మొదటిగా ఎంట్రీ ఇచ్చింది కన్నడ హీరోయిన్ తనూజ గౌడ. తన అసలు పేరు తనూజ పుట్టస్వామి. కానీ తనూజ గౌడ గానే మంచి గుర్తింపు తెచ్చుకుంది. బెంగళూరుకు చెందిన ఈ ముద్దుగుమ్మ కాలేజీ రోజుల్లోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘అందాల రాక్షసి’ సీరియల్ తో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ను పలకరించింది. ముద్ద మందారం సీరియల్ తో మరింత చేరువైంది. శివ మనసుల శక్తి సీరియల్‌లోనూ నటించిన ఈ అందాల తార ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 9 ద్వారా మరోసారి ఆడియెన్స్ ను అలరిస్తోంది.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌస్ లో తనూజ గౌడ..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి