
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మరికొన్ని గంటల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ఈ ఆదివారం జరిగే గ్రాండ్ గా ఫినాలే ఈవెంట్ తో బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కోసం ఆడియన్స్ సైతం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తనూజ, కల్యాణ్ ల మధ్యనే బిగ్ బాస్ టైటిల్ పోరు సాగుతోంది. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈసారి బిగ్ బాస్ కప్పు అందుకోవడం ఫిక్స్ అయిపోయింది. ఇక వీరి తర్వాత మూడో ప్లేసులో డిమాన్ పవన్ ఉన్నాడు. నిన్నటివరకు మూడో స్థానంలో ఉన్న జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ శనివారం నాటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తోంది. అతనితో పాటు సంజనా గల్రానీ కూడా బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయ్యారని సమాచారం. సంజనా ఎలిమినేషన్ పెద్దగా ఆశ్చర్యపరచలేదు కానీ ఇమ్మాన్యుయేల్ ఎలిమినేషన్ పై మాత్రం అతని అభిమానులు బాగా ఫీల్ అవుతున్నారు. ఇమ్మూ బిగ్ బాస్ విన్నర్ అవ్వాల్సిందని, ఇప్పుడు కనీసం టాప్-3లోనూ లేకుండా ఎలిమినేట్ చేశారని బిగ్ బాస్ పై మండిపడుతున్నారు ఆడియెన్స్.
కాగాఈ సీజన్ ప్రారంభం నుంచే బిగ్ బాస్ హౌస్ లో టాప్ కంటెస్టెంట్ గా చెలామణి అయ్యాడు జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్. అందుకు తగ్గట్టుగానే తన ఆట, ఆట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చు కున్నాడీ జబర్దస్త్ కమెడియన్. తోటి కంటెస్టెంట్స్ తోనూ ఎంతో స్నేహపూర్వకంగా మెలిగాడు. ముఖ్యంగా ఇప్పుడు టైటిల్ రేసులో ఉన్న తనూజతో ఇమ్మూ ఎంతో సరదాగా ఉన్నాడు. అయితే కారణాలేవైనా తర్వాతి క్రమంలో తనూజ, ఇమ్మూల మధ్య బంధం చెడింది. ఇది ఇమ్మూకు కాస్త నెగెటివ్ గా మారింది. తనూజ విషయంలో ఇమ్మూ స్వార్థపూరితంగా వ్యవహరించాడని కొందరు బిగ్ బాస్ ఆడియెన్స్ అభిప్రాయపడ్డారు.
ఇక ఇమ్మూను దెబ్బ కొట్టిన మరో కీలక అంశం నామినేషన్స్. అసలు ఈ సీజన్ పది వారాలు పూర్తయ్యే దాకా ఇమ్మూ నామినేషన్స్ లోకి రాలేదు. ఇది క్రమంగా అతని ఓటింగ్ పై ప్రతికూల ప్రభావం చూపించింది. ఇప్పుడు కూడా తక్కువ ఓట్ల పడడంతోనే ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తోంది. ఒక వేళ తనూజ లాగే ఇమ్మూ తరచూ నామినేషన్స్ లోకి వచ్చి ఉంటే ఈ జబర్దస్త్ నటుడి ఓటింగ్ మరింత మెరుగయ్యేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి బిగ్ బాస్ కప్పు అందుకోవాల్సిన ఇమ్మాన్యుయేల్ తక్కువ ఓటింగ్ కారణంగా టాప్-3లోనూ నిలవలేదని అతని అభిమానులు బాధపడుతున్నారు.
#Emmanuel eliminated from the Top 4 position#BiggBossTelugu9 pic.twitter.com/82HhUaJNzk
— BigBoss Telugu Views (@BBTeluguViews) December 20, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.