
బిగ్ బాస్ రివ్యూయర్, మాజీ కంటెస్టెంట్ ఆది రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో లాగానే ఇప్పుడు కూడా బిగ్ బాస్ సీజన్ 9 కి సంబంధించి తన దైన శైలిలో రివ్యూలు ఇస్తున్నాడు. అందరికంటే ముందే బిగ్ బాస్ అప్డేట్స్ ను ఊహించి ముందే వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు. వీటికి యూట్యూబ్ లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి పోలీసులను ఆశ్రయించాడు ఆది రెడ్డి. తన రివ్యూల్లో భాగంగా కొంత మంది కంటెస్టెంట్లకు పాజిటివ్ రివ్యూలు చెప్పడం, అలాగే మరికొంతమందికి నెగెటివ్ రివ్యూలు ఇవ్వడంతో ఆదిరెడ్డిని కొంతమంది సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తనను ఏ సోషల్ మీడియా అకౌంట్ నుంచి తనను, తన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారో వాటిని స్క్రీన్ రికార్డర్ చేశాడు. వాటినే సాక్ష్యధారాలుగా చూపిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు తన పోస్టుకు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను, ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర పోలీసుల డిపార్ట్మెంటును ట్యాగ్ చేశాడు. మరి ఆదిరెడ్డి ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.
కాగా ఆది రెడ్డి రివ్యూలను ఇష్టపడడని వాళ్లే అతనను ట్రోల్ చేస్తున్నారని సమచారం. ముఖ్యంగా కొంత మంది కంటెస్టెంట్స్ గురించి పాజిటివ్ గా చెబుతున్న తరుణంలో మిగతా కంటెస్టెంట్ ని అభిమానించే వాళ్లే అతనిపై ఎక్కువగా నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారని తెలుస్తోంది. అలాగే ఏదో ఒక కంటెస్టెంట్ కి పీఆర్ చేసేవాళ్లు ఆది రెడ్డికి ఇలా చేసి ఉండొచ్చన్నది టాక్. కాగా విష్ణు ఫ్రమ్ హైదరాబాద్ అనే అకౌంట్ తో ఒకరు ఆదిరెడ్డిని ట్రోల్ చేశాడు. అయితే ఆతర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ వ్యక్తి తన సోషల్ మీడియా ఎకౌంటును డిలీట్ చేశాడు. కానీ ఆదిరెడ్డి మాత్రం ముందే దానిని స్క్రీన్ రికార్డ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరి ఆదిరెడ్డి ఫిర్యాదుపై పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.