
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోరా హీరోగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకుంది. పాత హౌస్ మేట్స్, కొత్త వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ తో హౌస్ ఇప్పుడు రణరంగంగా మారింది. కాగాఈ బుల్లితెర రియాలిటీ షోపై అప్పుడుప్పుడు నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తుంటాయి. ముఖ్యంగా మాజీ కంటెస్టెంట్స్ కొందరు ఈ షోపై సంచలన ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్యన హరి తేజ బిగ్ బాస్ షో గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు మరో మాజీ కంటెస్టెంట్ ఈ రియాలిటీ షో పై సంచలన కామెంట్స్ చేసింది. లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరైన ఆమె బిగ్ బాస్ కి వెళ్లినందుకు చాలా తిట్టుకున్నానంటూ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ బిగ్ బాస్ షో ను తిట్టిన ఆ మాజీ కంటెస్టెంట్ మరెవరో కాదు స్టార్ యాంకర్ విష్ణుప్రియ. బిగ్ బాస్ షోకు అసలు వెళ్లనని చెప్పిన ఆమె కేవలం డబ్బు కోసమే ఈ షోలో పార్టిసిపేట్ చేశానంది.
‘నేను డబ్బుల కోసమే బిగ్ బాస్ షోకు వెళ్లాను. కొత్త ఇల్లు కట్టుకోవచ్చు అని కంటెస్టెంట్ గా ఎంటరయ్యాను. కానీ అదేమీ జరగలేదు. ఇప్పుటికీ ఇంకా పాత ఇంట్లోనే ఉన్నాను. బిగ్ బాస్ హౌస్ కు వెళ్లడమనేది నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం. బిగ్ బాస్ లో నేను ఏమి నేర్చుకోలేదు. అన్ని బయట నా లైఫ్ లోనే నేర్చుకున్నాను. మళ్లీ బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చినా అసలు వెళ్లను. ఒక్కసారి వెళ్లినందుకే నన్ను నేను తిట్టుకున్నాను. ఎందుకు వెళ్లాను? నా చెప్పు తో నన్ను కొట్టుకోవాలి అని నన్ను నేను తిట్టుకున్నా. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక నన్ను లవ్ చేసిన జనాలు ఉన్నారు కాబట్టి ఓకే అనుకున్నా’
‘బిగ్ బాస్ కు వెళ్లక ముందే నేను లైఫ్ లో సెటిల్ అయ్యాను. లగ్జరీ లైఫ్ ను ఆస్వాదిస్తున్నాను. మూడు రోజులు పనిచేస్తే నాలుగో రోజు మసాజ్ చేయించుకొని రెస్ట్ తీసుకునే దాన్ని. కానీ బిగ్ బాస్ లో మసాజ్ లేదు, కాఫీ లేదు, సరిగ్గా నిద్ర పట్టదు. బిగ్ బాస్ హౌస్ లో నేను చాలా పెయిన్ అనుభవించాను’ అని విష్ణు ప్రియ చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.